Skip to main content

నేటి మోటివేషన్...



నాకే ఎందుకు ఇలా అయ్యింది ?
ఇలా అనుకుంటూ ఉంటాము కదూ !

వింబుల్డన్ ప్లేయర్ Arthur Ashe మనకు అందిస్తున్న ఈ మెస్సేజ్ చదివితే మనం ఎలా ఆలోచించాలో తెలుస్తుంది .

ఏమయ్యింది ?

1983 లో ఆర్థర్ గుండె ఆపరేషన్ కోసం రక్తం ఎక్కించుకోవలసి వచ్చింది . ఆ రక్తం ద్వారా అతడికి వచ్చింది AIDS

ఈ విషయం పేపర్లద్వారా ప్రపంచం అంతటా తెలిసింది . అభిమానుల సానుభూతి వేల్లువయ్యింది .
అనేక ఉత్తరాలు . మెయిళ్ళు. అతడికి ఎన్నెన్నో సానుభూతి వచనాలు . అందులో ఒక మె యిలు లో ఇలా ఉంది .
.
“ ఆర్ధర్ ! నీకే ఇలా అయ్యింది ఏమిటి ? ఇంతటి భయంకరమైన వ్యాధికి దేముడు నిన్నే ఎంచుకున్నాడేమిటి ?”
ఈ మెయిలు చదివిన ఆర్థర్ దానికి సమాధానం ఇలా ఇచ్చాడు .

“డియర్ మిస్టర్ ! మీ మెయిలు నన్ను ఆలోచింప చేసింది .
5 కోట్ల మంది పిల్లలు టెన్నిస్ ఆడడం మొదలు పెడితే ,

500 000 మంది మాత్రమె ప్రొఫెషనల్ టెన్నిస్ లోకి వచ్చారు , వారిలో........


50 వేల మంది మాత్రమె Circuit దశకు చేరుకున్నారు ..........

వారిలో
5 వేల మంది మాత్రమె గ్రాండ్ స్లామ్ కి చేరుకోగలిగారు. ...........
వారిలో
50 మంది మాత్రమె వింబుల్డన్ కి వచ్చారు . ..........
వారిలో
4 గురు మాత్రమె సెమీ ఫైనల్స్ కి వచ్చారు . .......

వారిలో
ఇద్దరు మాత్రమె ఫైనల్స్ కి వచ్చారు ...........

వారిలో
నేను మాత్రమె టైటిల్ గెలుచుకున్నాను .

మిత్రమా ? అప్పుడు నేను అడిగానా ?

నాకు మాత్రమె ఈ గెలుపును ఎందుకు ఇచ్చావు అని దేముడిని నేను అడగలేదు కదా !

నాకు అంతటి సంతోషాన్ని ఇచ్చినప్పుడు ఆయనను ఎందుకు ఇచ్చావు అని అడగం

బాధను కలుగచేసినపుడు ఎందుకు అడగాలి ?

సంతోషం నిన్ను ఆహ్లాదపరుస్తుంది . పరీక్షలు నిన్ను ధైర్యవంతుడిని చేస్తాయి .

బాధలు నిన్ను మానవుడిని చేస్తాయి . ఓటమి నీకు వినయాన్ని నేర్పుతుంది .

విజయం నిన్ను ఆనందపరుస్తుంది . నమ్మకం నిన్ను నడిపిస్తుంది

నీ జీవితం నీకు ఆనందం కలిగించకపోవచ్చు
నీలా జీవించాలని కలలు కనే వాళ్ళు ఎందఱో ఉంటారు

ఆకాశం లో ఎగిరే విమానాన్ని చూసి అందులో వెడితే ఎంతో బాగుంటుంది అని ఒక పిల్లవాడు అనుకుంటాడు .
కిందని ఉన్న మనుషులను చూసి ఇంటికి ఎప్పుడు వెడదామా అని ఆ విమానం నడిపే పైలట్ అనుకుంటాడు
అదే జీవితం !
డబ్బే ఆనందం అనుకుంటే డబ్బు ఉన్న ఆసామీలు అందరూ రోడ్ల మీద డాన్స్ లు చేస్తూ కనిపించాలి . కానీ రోడ్డుమీద నిక్కరు లేకుండా ఉండే పిల్లలు హాయిగా ఆనందంగా ఆడుకుంటూ కనిపిస్తారు

అధికారమే భద్రత అనుకుంటే VIP లు అందరూ ఎటువంటి రక్షణా లేకుండా తిరగాలి .
కానీ అలా జరగడం లేదు .
సింపుల్ గా ఉండే వాళ్ళే హాయిగా తిరుగుతున్నారు . హాయిగా నిద్రపోతున్నారు .
చూడు నేస్తం !
సింపుల్ గా జీవించు !
వినమ్రతతో మెలుగు !
మనసారా ప్రేమించు !
తృప్తిగా ఉండు !
మీ ఆత్మీయ సోదరుడు.

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో...

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో... 💫Official Question Bank నుంచి 5×630 మొత్తం 3150 Questions ను వరుసగా 30 బిట్స్ కి ఒకటి చొప్పున మొత్తం Practice Tests చేయడం జరిగింది. 💡 ప్రశ్నలు చదవడం మాత్రమే కాదు… 👉 మీరు స్వయంగా Test రాసి 👉 వెంటనే Answer Check చేసి 👉 మీ Preparation Level తెలుసుకోండి! ⚡ Practice Mode + Actual Exam Mode 📊 Score & Answer Review కూడా వెంటనే! 🎯 AP TETకి సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థి ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించండి. 👇 Practice & Mock Tests ఇక్కడ: 🔗 https://ganaweb.in/ap-tet-official-paper-1a-practice-test/ 🔥 ఈరోజు ఒక Test… మీ Preparationలో ఒక Step ముందుకు! Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

TET and DSC Very important topics...

Lakshya Educational Groups