భూకంపాలు.
1) భూకంపాలను అధ్యయనం చేసే సిస్మాలజీ. వీటిని నమోదు చేసే పరికరం ఏది ?
జ) భూకంప లేఖిని (సిస్మోగ్రాఫ్)
2) భూకంపం విడుదల చేసే శక్తి తీవ్రతను కొలచే పరికరాన్ని రిక్టర్ స్కేలు అంటారు. దీన్ని ఎక్కడ రూపొందించారు ?
జ) 1935లో అమెరికాలో
3) రిక్టర్ స్కేలుపై ఎన్ని పాయింట్లు దాటితే సునామీ హెచ్చరికలు జారీ చేస్తారు ?
జ: 7.5
4) రిక్టర్ స్కేలు విడుదల చేసే శక్తిని ఏ రసాయన పదార్థం విడుదల చేసే శక్తితో లెక్కిస్తారు ?
జ: TNT ( Trinitro Tolin)
5) భూకంపం ప్రారంభమైన ప్రదేశం (నాభి)ని ఏమంటారు ?
జ: హైపో సెంటర్
6) భూకంపం సంభవించినప్పుడు తీసుకునే జాగ్రత్తలను ఏ పదాలతో సూచిస్తారు ?
జ) Drop, Cover, Hold
7) మనదేశంలో ఎక్కువగా భూకంపాలు వచ్చే ప్రాంతం ఏది ?
జ: శివాలిక్ హిమాలయాలు
8) దేశంలో తరుచుగా భూకంపాలు వచ్చే రాష్ట్రాలు ఏవి ?
జ: అసోం, మహారాష్ట్ర, గుజరాత్
8) మనదేశంలో భూకంప జోన్స్ ను ఎన్ని రకాలుగా విభజించారు ?
జ: 5 రకాలుగా ( Bureau of Indian Standard)
9) ఐదో భూకంప జోన్ లో ఉండి రిక్టర్ స్కేలుపై 9 కంటే ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాలు (Very high risk) ఏవి ?
జ: హిమాలయ పర్వత రాష్ట్రాలు, ఈశాన్య ప్రాంతం, అండమాన్ దీవులు
10) High Risk లో ఉండి రిక్టర్ స్కేలుపై 8 కంటే ఎక్కువ భూకంపాలు నమోదయ్యే జోన్ -4 ప్రాంతం ఏది ?
జ: ఢిల్లీ, గంగ, సింధు మైదానాలు
11) దక్షిణ భారత దేశంలోని ఏపీ, కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు ఏ జోన్ లో ఉన్నయాి.
జ: జోన్ - 3 ( Medium Risk)
12) జోన్ 1 లో ఉండి అసలు భూకంపం రిస్క్ లేని ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయి ?
జ: ద్వీప కల్ప పీఠభూమిలోని కఠిన శిలామయ ప్రాంతాల
13) తెలుగు రాష్ట్రాలు భూకంప జోన్స్ లో 3,2 జోన్ కిందకు వస్తాయి. ఏ ప్రాంతాలు ఏ జోన్లు ?
జ) హైదరాబాద్,
అనంతపూర్ - 2 వ జోన్
కోస్తా ప్రాంతాలతో పాటు కడప,
చిత్తూరు - 3 వ జోన్
14) ప్రపంచంలో మొదటగా గుర్తించబడిన ఏ భూకంపంతో 8,43,000 మంది చనిపోయారు ?
జ: 1556- చైనాలో
15) ఏ దేశంలో సంభవించిన భూకంపం ప్రభావం చైనా, టిబెట్, భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లపై పడింది ?
జ: నేపాల్ రాజధాని ఖాట్మాండులో లామాజంగ్ కేంద్రంగా
16) ఆపరేషన్ మైత్రి పేరుతో ఏ దేశానికి మన దేశం సాయం అందించింది ?
జ: నేపాల్

17) అత్యధిక నష్టం కలిగించింది లాతూర్, భుజ్ భూకంపాలు ఏ తీవ్రతతో వచ్చాయి ?
జ: 6.4 తీవ్రతతో మహారాష్ట్రలోని లాతూర్
6.9 తీవ్రతతో గుజరాత్ లోని భుజ్ భూకంపం
18) మన రాష్ట్రంలో తీవ్ర భూకంపం ఏప్రిల్ 13, 1969లో ఎక్కడ సంభవించింది ?
జ: భద్రాచలం కొత్తగూడెం జిల్లాలోని( గతంలో ఖమ్మం జిల్లా) భద్రాచలం ఏరియాలోని కిచ్చనపల్లి - గొల్లగూడెం
19) మన దేశంలో మొదటగా భూకంపాలను నమోదు చేసే కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు ?
జ: 1898లో కోల్ కతాలో
20) మన రాష్ట్రంలో ఉన్న భూకంపం పరిశోధనా కేంద్రం ఏది ?
జ: జాతీయ భూభౌతిక ప్రయోగ పరిశోధన కేంద్రం (NGRI- National Geophysical Research Institute)
21) భూకంపాలను అధ్యయనం చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యూనివర్సిటీ ఏది ?
జ: ఉత్తరాఖండ్ లోని రూర్కీ యూనివర్సిటీ
22) National Sismological Data Centre ఎక్కడ ఉంది ?
జ: న్యూఢిల్లీ
23) భారత్ లో భూకంపాలను కేంద్ర ప్రభుత్వం తరపున నోడల్ ఏజెన్సీగా పనిచేసే సంస్థ ఏది ?
జ: భారత్ వాతావరణ శాఖ ( Indian Meterological Department)
24) దేశంలో భూకంపాల అధ్యయనం కోసం National Sismological Network కింద ఎన్ని అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేశారు ?
జ: 55 కేంద్రాలు
25) United Nations Development Programme, భారత ప్రభుత్వం కలసి 5లక్షలకు పైబడిన 38 నగరాల్లో భూకంపాలను అధ్యయనం చేయుటకు చేపట్టిన ప్రాజెక్టును ఏమంటారు ?
జ) Urban Earthquake Vulnarability Reduction Project
26) భూకంపాలను కూడా తట్టుకునే భవనాలను నిర్మించడానికి ఏ సంస్థ నిబంధనలను రూపొందించింది ?
జ: బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్
27) జాతీయ భవన నిర్మాణ కోడ్ ను ఎప్పుడు రూపొందించారు ?
జ: 1970లో ప్రస్తుతం దీన్ని జాతీయ భవన నిర్మాణ కోడ్ - 2005 గా వ్యవహరిస్తున్నారు.
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment