Skip to main content

నేటి మోటివేషన్...


ఎందుకు భయం

భయం ... స్టేజి మీదకు ఎక్కి మాట్లాడాలంటే భయం. ఏదన్నా ఓక కొత్త పని చేయాలంటే భయం. పబ్లిక్ లో కొత్త వారితో మాట్లాడాలంటే భయం.

ఎందుకు భయం ?? ఒక్క విషయం గుర్తుంచుకోండి భయపడడం , భాదపడడం వీటి వాళ్ళ ఏదైనా సాధించగలరా ??
భయపడితే నీ సమస్య దూరం అవుతుందా?బాధపడితే దానికి పరిష్కారం దొరుకుతుందా??

ఒకసారి నీకు నువ్వు ప్రశ్నించుకో.

సైకిల్ లేదా బైక్ నేర్చుకోన్నే మొదటి రోజుని బాగా నేర్చుకున్న తర్వాత ఒక రోజుని గుర్తుతెచ్చుకోండి. ఒకటే మార్పు..మొదటి రోజు పడిపోతానేమో అని ఒక చిన్న భయం బాగా నేర్చుకున్న తర్వాత ఆ భయం ఉండదు. గమనించారా ! భయం ఉంటే ఎలా ఉంటుందో లేకపోతే ఎలా ఉంటుందో. భయం ఒక ఊర కుక్క లాంటిది. భయపడి పరుగు పెడితే వెంట పడుతుంది. ధైర్యంగా నిలబడితే అదే భయపడి పారిపోతుంది.

స్టేజి మీదకు ఎక్కి మాట్లాడాలంటే భయం. ఎందుకు? ఇతరులు ఏమనుకుంటారో ,వాళ్ళు నన్ను హేళన చేస్తారేమో, నా సిగ్గు తెసేస్తరేమో అని భయం. ఒక విషయం గుర్తుంచుకోండి. నువ్వు ఈ పని చేసిన చేయకపోయినా ఎవరో ఒకరు ఎదో ఒకటి అంటూనే ఉంటారు. ఉదాహరణకు ఎక్కువగా నవ్వితే పిచ్చివాడు అంటారు.

నవ్వకపోతే ఎప్పుడు కోపంగా ఉంటాడు. ఏడిస్తే పిరికివాడు అంటారు. ఏడవక పోతే వీడికి అసలు మనస్సే లేదు అంటారు. మర్యాదగా ఉంటే అమాయకుడు అంటారు.

జ్ఞానం ప్రదర్శిస్తే గర్విష్టి అంటారు.
ఒంటరిగా ఉంటే ఏకాకి అంటారు.
అందరితో తిరిగితే తిరుగుబోతూ అంటారు.
ఏదేమైతే నాకేంటి అనుకుంటే స్వార్ధపరుడు అంటారు.
ఇలా ఏ పని చేసిన చేయకపోయినా ఏదో ఒకటి అంటునే ఉంటారు. మరి వాళ్ళ గురించి ఆలోచించడం అవసరమా ??
మీకు మీరు ప్రశ్నించుకోండి?? మీరు ఏదన్నా మంచి పని చేసేటప్పుడు ఎవరు ఏమన్నా పటించుకోకండి. వాళ్ళు అనేది వినండి నచ్చి , మంచి ఉంటే స్వీకరించండి. లేకపోతే అసలు పట్టించుకోకండి.

కొత్త వారిని అడిగి ఏదన్నా తెలుసుకోవాలంటే భయం ఎందుకు ?? వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని భయం. అలాగే వాళ్ళు అనుకుంటారు. చివరికి ఇద్దరు బాధపడతారు. ఏదన్నా తెలియక పోతే అడిగి తెలుసుకోండి, తప్పులేదు. బాధపడుతూ ఎప్పుడు ఉండకండి. డి మోటివెటెడ్ గా,నిరాశగా ఎప్పుడు ఉండకండి. అలాంటివారిని లోకం ఎప్పుడు పట్టించుకోదు. అందరికి ఎప్పుడు సంతోషంగా ఉండి , వాళ్ళను సంతోషంగా ఉంచే వారే కావాలి. ఎప్పుడు ధైర్యంగా ఉండండి. మంచిగా కాన్ఫిడెంట్ గా మాట్లాడండి. సత్తువ లేని వాడిలా నీరసంగా నడవకండి. నడకలో మన కాన్ఫిడెన్స్ కనపడాలి.
దర్జాగా బతుకు, హ్యాపీగా బతుకు అప్పుడు నిన్ను పదిమంది ఆదర్శంగా తీసుకుంటారు. ఎప్పుడు చురుకుగా, కాన్ఫిడెంట్ గా ఉండండి.

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో...

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో... 💫Official Question Bank నుంచి 5×630 మొత్తం 3150 Questions ను వరుసగా 30 బిట్స్ కి ఒకటి చొప్పున మొత్తం Practice Tests చేయడం జరిగింది. 💡 ప్రశ్నలు చదవడం మాత్రమే కాదు… 👉 మీరు స్వయంగా Test రాసి 👉 వెంటనే Answer Check చేసి 👉 మీ Preparation Level తెలుసుకోండి! ⚡ Practice Mode + Actual Exam Mode 📊 Score & Answer Review కూడా వెంటనే! 🎯 AP TETకి సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థి ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించండి. 👇 Practice & Mock Tests ఇక్కడ: 🔗 https://ganaweb.in/ap-tet-official-paper-1a-practice-test/ 🔥 ఈరోజు ఒక Test… మీ Preparationలో ఒక Step ముందుకు! Lakshya Educational Groups

హార్ట్‌ ఎటాక్‌ ముప్పు ఆల్కహాల్‌ వల్ల కాదండోయ్‌!..... మీరు ఎంతగానో ఇష్టపడి త్రాగే ఇదే...

ఎనర్జీ డ్డ్రింక్స్ వల్ల అని చెబుతున్నారు నిపుణులు! ఎనర్జీ డ్రింక్స్ హానికరం కాదని మీరు అనుకుంటున్నారా?  ఒకటి తాగిన తర్వాత మీ హృదయ స్పందన రేటు పెరుగుతుందా?  ఈ సందేహాలు మీకూ ఉన్నాయా?  'హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ డక్' గా పిలువబడే ప్రముఖ కార్డియాలజిస్ట్‌ డాక్టర్ డిమిత్రి యారనోవ్ మీ సందేహాలకు సమాధానం ఇస్తున్నారు.  ఎనర్జీ డ్రింక్ వినియోగం యువకుల గుండె జబ్బులతో ముడిపడి ఉంటుంది.  అధిక ఎనర్జీ డ్రింక్ వినియోగం తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తుందని అతను అంటున్నారు. ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు ఉన్న రోగులను తాను ఎక్కువగా చూస్తున్నానని.. 20, 30 ఏళ్లలోపు యువకులు, ఆరోగ్యవంతులు అకస్మాత్తుగా గుండె వైఫల్యంతో బాధపడుతున్నారు. ధూమపానం అలవాటు లేదు, కుటుంబ చరిత్ర కూడా లేదు. కానీ వీరందరిలో ఓ ఉమ్మడి అలవాటు ఉంది. అది వారు ప్రతిరోజూ 3-4 డబ్బాల ఎనర్జీ డ్రింక్స్ తీసుకుంటున్నారు. ఎనర్జీ డ్రింక్స్ రక్తపోటును పెంచుతాయని, అసాధారణ గుండె లయలకు కారణమవుతాయని, కాలక్రమేణా గుండె కండరాలను బలహీనపరుస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అధిక కెఫిన్, ఉత్తేజకాలు గుండెను ఓవర్‌డ్రైవ్‌కు గురి చేస్తాయి...

🚨🚨 FLASH FLASH – AP SPECIAL TET 2026 HALL TICKETS 🚨🚨

📢 ఆంధ్రప్రదేశ్ స్పెషల్ టెట్ (AP SPECIAL TET) 2026 హాల్ టికెట్లకు సంబంధించి కీలక అప్డేట్! ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ నిర్వహించనున్న AP Special TET 2026 పరీక్షకు హాజరుకానున్న ఇన్‌ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం హాల్ టికెట్లను అక్టోబర్ 5, 2026న విడుదల చేయనున్నారు. 📌 ముఖ్యమైన వివరాలు: 🔹 పరీక్ష పేరు: AP Special TET 2026 🔹 హాల్ టికెట్ల విడుదల తేదీ: 05-10-2026 🔹 పరీక్ష తేదీలు: 11-10-2026 నుంచి 21-10-2026 వరకు 🔹 పరీక్ష విధానం: ఆన్‌లైన్ (CBT) 🔹 అర్హులు: ఇన్‌ సర్వీస్ ఉపాధ్యాయులు 🌐 హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే వెబ్‌సైట్: https://tet2dsc.apcfss.in/ 📌 డౌన్‌లోడ్ విధానం: 1. అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. 2. Candidate Login పై క్లిక్ చేయండి. 3. మీ Username, Password నమోదు చేయండి. 4. హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. 5. ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి. ⚠️ అభ్యర్థులు తమ హాల్ టికెట్‌లోని పేరు, పరీక్ష తేదీ, పరీక్ష కేంద్రం, సమయం తదితర వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలి. 🙏 పరీక్షకు హాజరయ్యే ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు! 📲 ఈ సమాచారాన్ని మీ ఉపాధ్యాయ మిత్రులకు కూడా షేర్ చేయండి. #APSpecialTET20...