పాఠశాల అసెంబ్లీ
నేటి వార్తలు
> విలీనం చేసే వరకు పోరాటం ఆగదు.‘సకల జనభేరి’సభలో స్పష్టం చేసిన కార్మికులు: తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్వహించిన ‘సకల జన భేరి’ సభ విజయవంతమైంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందేనని కార్మికులు నినదించారు
> బంగారంపై కేంద్రం సంచలన నిర్ణయం?: ఇటీవల నల్లధనాన్ని పసిడి రూపంలో దాచుకుంటున్న నేపథ్యంలో ఆ బంగారాన్ని బయటకు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త క్షమాభిక్ష పథకాన్ని తీసుకురా నున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. నిర్ణీత పరిమాణానికి మించి బంగారం ఉంటే తెలియజేసేలా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.
> గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి: సరూర్‌నగర్‌లో నిర్వహించిన సకల జనభేరి సభకు వచ్చిన ఓ ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందారు. కరీంనగర్-2 డిపోకు చెందిన నంగునూరి బాబు అనే డ్రైవర్ సరూర్‌నగర్ సభకు వచ్చారు. అక్కడ ఆయనకు గుండెపోటు రావడంతో సహచరులు సమీపంలోని ఓజోన్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకొచ్చేలోపే డ్రైవర్ మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు.
> ఒక రోజు పోలీసు కమిషనర్‌గా రమ్య. క్యాన్సర్‌తో బాధపడుతున్న విద్యార్థినికి అవకాశం ఇచ్చిన రాచకొండ సీపీ: క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న ఓ విద్యార్థిని ‘మేక్ ఏ విష్’ సంస్థ సహకారంతో పోలీసు కమిషనర్ అవతారం ఎత్తి పోలీసులతో గౌరవ వందనం స్వీకరించిన సంఘటన ఇది.
> భూమికి తిరిగొచ్చిన ‘రహస్య’ వ్యోమనౌక: రహస్య పరిశోధన కోసం అమెరికా వైమానిక దళం పంపిన ఒక వ్యోమనౌక రెండేళ్ల పాటు రోదసిలో గడిపిన అనంతరం భూమికి తిరిగొచ్చింది. ఎక్స్-37బి అనే ఈ అంతరిక్ష నౌక ఫ్లోరిడాలోని కెన్నెడీ అంతరిక్ష కేంద్రంలో దిగింది. దీన్ని 2017లో ప్రయోగించారు. 780 రోజుల పాటు భూ కక్ష్యలో ఉంది.
> చారిత్రక ఘట్టానికి ఈడెన్‌గార్డెన్స్ వేదిక: మరో చరిత్రాత్మక ఘట్టానికి ఈడెన్ గార్డెన్స్ వేదికగా మారనుందని బంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) సెక్రటరీ అవిషేక్ దాల్మియా పేర్కొన్నారు. ‘క్రికెట్ అభివృద్ధికి ఇది దోహదపడుతుంది. ఎన్నో చారిత్రక ఘట్టాలకు ఈడెన్ గార్డెన్స్ వేదికగా మారింది.
నేటి సుభాషితం
"ఏదీ అసాధ్యం కాదు. ప్రతి దానికి మార్గం ఉంటుంది. మనలో తగినంత పట్టుదల ఉంటే కావలసిన వనరులు అవే ఏర్పడతాయి."
It is not what we say or think that defines us, but what we do."
మంచి పద్యం
*రేపటి ఉషోదయం నీకై*
*సింగిడివేసెను. నలుదిక్కులు*
*వెలుతురు నిండిన రహదారిన*
*సాగిపో. నలుగురు మెచ్చన్.*
(*యనగందుల దేవయ్య" గారిచే రచించబడిన "ముత్యాల సరాలు" అనే శతక పద్యాలు. వీరు ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం, పైనంపల్లి ఉన్నత పాఠశాలలో తెలుగు పండితులుగా పని చేయుచున్నారు. వారి సెల్ నెం: 9666036288*)
*నేటి జీ.కె*
ప్రశ్న: *ఏ గ్రహానికి చెందిన చందమామ 'ఎన్‌సెలాడస్'పై జీవం మనుగడకు తోడ్పాటును ఇచ్చే హైడ్రోథర్మల్ చర్యలున్నాయని ఇటీవల నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు?
జ: *శని*
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment