దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ వ్యవస్థ(టిఎ్‌సఎ్‌సపిడిసిఎల్) జూనియర్ లైన్‌మెన్, జూనియర్ పర్సనల్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 3025 ఖాళీలున్నాయి. వీటిలో జూనియర్ పర్సనల్ ఆఫీసర్ 25, జూనియర్ లైన్‌మెన్ 2500, జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్ 500 పోస్టులున్నాయి. ఈ ఖాళీల్లో 95 శాతం పోస్టులను స్థానికులకే కేటాయంచారు. దక్షిణ తెలంగాణ పరిధిలోని కొత్త జిల్లాల ప్రాతిపదికన నియామక ప్రక్రియను చేపడతారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే నిర్దేశిత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి.
దక్షిణ తెలంగాణ పరిధిలోకి వచ్చే జిల్లాలు
మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల్, నారాయణ్‌పేట్, నల్లగొండ, భువనగిరి - యాదాద్రి, సూర్యాపేట, మెదక్, సిద్ధిపేట్, సంగారెడ్డి వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, హైదరాబాద్.
అర్హతల వివరాలు
జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టులకు బిఎ/బికాం/బిఎస్సీ లేదా తత్సమాన విదార్హతతో పాటు 18-34 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. ఎస్టీ, ఎస్సీ, బీసీలకు 5 ఏళ్లు, శారీరక వికలాంగులకు పదేళ్లు వయోపరిమితిలో మినహాయింపు ఉంటుంది.
జూనియర్ లైన్‌మెన్ పోస్టులకు పదో తరగతితో పాటు ఎలక్ర్టికల్ ట్రేడ్‌లో ఐటీఐ లేదా ఎలక్ట్రికల్ ట్రేడ్‌లో ఇంటర్మీడియెట్ వొకేషనల్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్ళ వయోపరిమితిలో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక విధానం
జూనియర్ అసిస్టెంట్ కం ఆపరేటర్
రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రెండు గంటల వ్యవధి ఉండే ప్రశ్న పత్రంలో 80 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ప్రశ్నపత్రంలో మూడు విభాగాలుంటాయి. సెక్షన్-ఎలో న్యుమరికల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్ నుంచి 40 ప్రశ్నలు, సెక్షన్-బిలో కంప్యూటర్ అవేర్‌నెస్ నుంచి 20 ప్రశ్నలు, సెక్షన్-సిలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ, జనరల్ నాలెడ్జ్ రెండూ కలిపి 20 ప్రశ్నలు వస్తాయి. సెక్షన్-ఎ కి సంబంధించిన ప్రశ్నలు తెలుగు-ఇంగ్లీ్‌షలో ఇస్తారు. పరీక్ష ఆఫ్‌లైన్ మోడ్‌లోనే ఉంటుం ది. కాబట్టి అభ్యర్థులు బాల్ పాయింట్ పెన్‌తో ఓఎంఆర్ షీట్‌పై సమాఽధానాన్ని గుర్తించాల్సి ఉంటుంది. అయితే పేపర్ ఎవాల్యుయేషన్‌ను మాత్రం 100 మార్కులకు చేస్తారు. సంస్థలో పనిచేస్తున్న అర్టిజన్స్/ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి 20 శాతం వరకు వెయిటేజీ ఉంటుంది. నోటిఫికేషన్ నాటికి ఆరు నెలల కంటే తక్కువ సర్వీసు ఉన్న అర్టిజన్స్/ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి ఎలాంటి వేయిటేజీ ఉండదు. ఓసీలు 40 శాతం, బీసీలు 35, ఎస్సీ/ఎస్టీలు 30, శారీరక వికలాంగులు 30 శాతం కనీస అర్హత మార్కులు సాధించాలి. అలా అర్హత సాధించిన వారిలో 1:2 ప్రకారం(ప్రతి పోస్టుకి ఇద్దరు చొప్పున) ఎంపిక చేసి కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్టు నిర్వహిస్తారు. ఇది కేవలం క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే. ర్యాంకుల నిర్ధారణ సందర్భంగా ఈ టెస్టులో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకోరు. కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్టులో చూపిన ప్రతిభ ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.
సిలబస్
సెక్షన్-ఎ(40 మార్కులు): న్యుమరికల్ ఎబిలిటీ నుంచి ఇండీసెస్, రేషియోస్, ప్రొపర్షన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, మెన్సురేషన్, ఆల్‌జిబ్రా, జామెట్రీ అండ్ స్టాటిస్టిక్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. అదేవిధంగా లాజికల్ రీజనింగ్‌కు సంబంధించి డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ముఖ్యమైన టాపిక్స్.
సెక్షన్-బి(20 మార్కులు): ఇది కంప్యూటర్ అవేర్‌నె్‌స్‌కు సంబంధించిన విభాగం. బేసిక్ కాన్సెఫ్ట్స్ ఆఫ్ కంప్యూటర్స్, ఎంఎస్ ఆఫీస్, కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ స్కిల్స్, అకౌంట్స్ రిలేటెడ్ సాఫ్ట్‌వేర్ సంబంధిత ప్రశ్నలు ఉంటాయి.
సెక్షన్-సి(20 మార్కులు): ఇందులో రెండు టాపిక్‌లు ఉంటాయి. మొదటిది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ, రెండోది జనరల్ నాలెడ్జ్. ఇంగ్లీష్ టాపిక్‌కు సంబంధించి ఒకాబులరీ, కాంప్రహెన్షన్ ప్యాసెజెస్ అండ్ రీ అరెంజ్‌మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, సినానిమ్స్, ఆంటోనిమ్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. అదేవిఽధంగా జనరల్ నాలెడ్‌కి సంబంధించి కరెంట్ అఫైర్స్, కన్జూమర్ రిలేషన్స్, జనరల్ సైన్స్ ఇన్ ఎవరిడే లైఫ్, ఎన్విరాన్‌మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్, హిస్టరీ, జాగ్రఫీ అండ్ ఎకానమీ ఆఫ్ ఇండియా, తెలంగాణ, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం, అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన సంస్కృతి, సాహిత్యం, కళలు వంటి వాటిపై ప్రశ్నలు ఉంటాయి.
జూనియర్ లైన్‌మెన్
రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రెండు గంటల వ్యవధి ఉండే ప్రశ్న పత్రంలో 80 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ప్రశ్న పత్రం రెండు విభాగాలుంటాయి. సెక్షన్-ఎలో కోర్ ఐటిఐకి సంబంధించిన 65 ప్రశ్నలు, సెక్షన్-బిలో జనరల్ నాలెడ్జ్ నుంచి 15 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష ఆఫ్‌లైన్ మోడ్‌లోనే ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు బాల్ పాయింట్ పెన్‌తో ఓఎంఆర్ షీట్‌పై సమాఽధానాన్ని గుర్తించాల్సి ఉంటుంది. అయితే పేపర్ ఎవాల్యుయేషన్‌ను మాత్రం 100 మార్కులకు చేస్తారు. సంస్థలో పనిచేస్తున్న అర్టిజన్స్/ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి 20 శాతం వరకు వెయిటేజీ ఉంటుంది. నోటిఫికేషన్ నాటికి ఆరు నెలల కంటే తక్కువ సర్వీసు ఉన్న అర్టిజన్స్/ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి ఎలాంటి వేయిటేజీ ఉండదు. ఓసీలు 40 శాతం, బీసీలు 35, ఎస్సీ/ఎస్టీలు 30, శారీరక వికలాంగులు 30 శాతం కనీస అర్హత మార్కులు సాధించాలి. అలా అర్హత సాధించిన వారిలో 1:2 ప్రకారం(ప్రతి పోస్టుకి ఇద్దరు చొప్పున) ఎంపిక చేసి పోల్ క్లైంబింగ్ టెస్ట్(విద్యుత్ స్తంభం ఎక్కడం)కి పిలుస్తారు. ఈ టెస్టులో అర్హత సాధించిన వారిని ఫైనల్‌గా ఎంపిక చేస్తారు.
సిలబస్
సెక్షన్-ఎ(65 మార్కులు): ప్రశ్నలన్నీ ఐటీఐ స్థాయిలోనే ఉంటాయి. ముఖ్యంగా ఎలక్ర్టికల్ టేడ్‌కు సంబంధించిన పోస్టు ఇది. కాబట్టి ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, బ్యాటరీస్, మ్యాగ్నటిజమ్, ఫండమెంటల్స్ ఆఫ్ ఏసి, బేసిక్ ఎలకా్ట్రనిక్స్, డిసి మెకానిక్స్, ట్రాన్స్‌ఫార్మర్స్, ఏసీ మెషిన్స్, ఎలక్ట్రికల్ మెజెర్‌మెంట్స్, ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ వంటి టాపిక్‌ల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
సెక్షన్-బి(15 మార్కులు): ఇది జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించిన విభాగం. అనలిటికల్ అండ్ న్యుమరికల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్, కన్జూమర్ రిలేషన్స్, జనరల్ సైన్స్ ఇన్ ఎవరిడే లైఫ్, ఎన్విరాన్‌మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్, హిస్టరీ, జాగ్రఫీ అండ్ ఎకానమీ ఆఫ్ ఇండియా, తెలంగాణ, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం, అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన సంస్కృతి, సాహిత్యం, కళలు వంటి వాటిపై ప్రశ్నలు ఉంటాయి.
జూనియర్ పర్సనల్ ఆఫీసర్
రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. మొత్తం 100 మార్కులకు ప్రశ్న పత్రం ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ప్రశ్న పత్రం ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. పరీక్ష వ్యవధి రెండు గంటలు. పరీక్ష ఆఫ్‌లైన్ మోడ్‌లో ఉంటుంది.
ప్రశ్న పత్రంలో మూడు విభాగాలుంటాయి. సెక్షన్-ఎలో 50 ప్రశ్నలు ఉంటాయి. ఇవి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, ఇండస్ట్రియల్ లాస్, జనరల్ లాస్ అండ్ లేబర్ లాస్ టాపిక్‌లకు సంబంధించిన ప్రశ్నలు. ఇక సెక్షన్-బి కంప్యూటర్ అవేర్‌నె్‌సకు సంబంధించింది. దీనికి సంబంధించి 20 ప్రశ్నలు వస్తాయి. ఇక చివరిది సెక్షన్-సి. ఈ విభాగంలో 30 ప్రశ్నలుంటాయి. ఇవి కాంప్రహెన్షన్, మెంటల్ ఎబిలిటీ, న్యుమరికల్ ఎబిలిటీ అండ్ అర్థమెటిక్ ఎబిలిటీ, జనరల్ అవేర్‌నె్‌సకు చెందినవి.
జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్
ఫీజుల చెల్లింపు ప్రారంభ తేదీ: 2019 అక్టోబరు 30
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 2019 అక్టోబరు 31
ఫీజుల చెల్లింపునకు చివరి తేదీ: 2019 నవంబరు 20
హాల్ టిక్కెట్ల డౌన్‌లోడింగ్ ప్రారంభం: 2019 డిసెంబరు 11
పరీక్ష తేదీ: 2019 డిసెంబరు 22
వెబ్‌సైట్: https://www.tssouthernpower.com/
జూనియర్ లైన్‌మెన్, జూనియర్ పర్సనల్ ఆఫీసర్
ఫీజుల చెల్లింపు ప్రారంభ తేదీ: 2019 అక్టోబరు 21
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 2019 అక్టోబరు 22
ఫీజుల చెల్లింపునకు చివరి తేదీ: 2019 అక్టోబరు 10
హాల్ టిక్కెట్ల డౌన్‌లోడింగ్ ప్రారంభం: 2019 డిసెంబరు 5
పరీక్ష తేదీ: 2019 డిసెంబరు 15
వెబ్‌సైట్: https://www.tssouthernpower.com/
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment