భౌతికశాస్త్రంలో నోబెల్ విజేతలు వీరే..
స్టాక్‌హోమ్: భౌతికశాస్త్రంలో నోబెల్ విజేతలను మంగళవారం ప్రకటించారు. ముగ్గురు శాస్త్రవేత్తలను నోబెల్ వరించింది. అంతరిక్షంలో భౌతికాంశాలపై విశిష్ట పరిశోధనలకుగాను.. జేమ్స్ పీబుల్స్‌ను నోబెల్ పురస్కారానికి జ్యూరీ ఎంపిక చేసింది. సౌరవ్యవస్థను పోలిన నక్షత్రాన్ని కనిపెట్టినందుకు.. మైఖేల్ మేయర్, డిడియర్ క్విల్లోజ్‌కు సంయుక్తంగా నోబెల్ పురస్కారం దక్కింది. ప్రపంచవ్యాప్తంగా శాంతి, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, వైద్యశాస్త్రం, సాహిత్యంలో అత్యున్నతస్థాయిలో ప్రతిభా పాటవాలు, విశేష కృషి సల్పిన వారికి ఏటా నోబెల్ పురస్కారాలు అందిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా సోమవారం వైద్యశాస్త్ర విజేతలను ప్రకటించారు. అక్టోబర్ 9న రసాయన శాస్త్రం, అక్టోబర్ 10న సాహిత్యం, అక్టోబర్ 11న శాంతి, అక్టోబర్ 14న ఆర్థికశాస్త్రానికి సంబంధించిన విజేతల పేర్లను ప్రకటించనున్నారు.
వెద్యరంగంలో అందించిన విశిష్ట సేవలకు గానూ ముగ్గురు వైద్యులకు నోబెల్ బహుమతి లభించింది. ఈ ముగ్గురు వైద్యులలో యూఎస్‌కు చెందిన పరిశోధకులు విలియంకెలిన్, గ్రెగ్ సెమెన్జా, బ్రిటన్‌కు చెందిన పీటర్ రాట్‌క్లిఫ్ ఉన్నారు. 2019 సంవత్సరానికి గానూ వీరికి సంయుక్తంగా ఈ పురస్కారాన్ని అందజేయనున్నట్లు నోబెల్ కమిటీ అక్టోబర్ 7న ప్రకటించింది. హైపోక్సియా పరిశోధనలో విలువైన సమాచారం ఆవిష్కరించినందుకుగాను ఈ ముగ్గురికి నోబెల్ దక్కింది. ఆక్సిజన్‌ను కణాలు ఏ విధంగా గుర్తించి, స్వీకరిస్తాయన్న అంశంపై వీరు విశేష పరిశోధన సాగించారు.
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment