Skip to main content

ఒక ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి అంటే ఈ ఆరు స్కిల్స్ తప్పక కావాలి



1. కమ్యూనికేషన్ వ్యూహం:

ఇంటర్వ్యూ అంటేనే అభ్యర్థి సామర్థ్యాలను గుర్తించే పని అంటున్నారు ‘కోర్సెరా’ చీఫ్‌ ఆపరేటింగ్‌ అధికారి. ఒకవేళ ఇంటర్వ్యూ గంట సేపు జరిగితే ఆ సమయంలో అడిగే ప్రశ్నలు అన్నింటికీ సమగ్రంగా సమాధానం ఇవ్వడం అన్నది ఏ అభ్యర్థికి సాధ్యం కాదు. అందువల్ల నాన్‌ వెర్బల్‌ కమ్యూనికేషన్‌ సామ ర్థ్యాన్ని తగ్గించి చూడవద్దు. అంటే కమ్యూని కేషన్‌ సంబంధిత వ్యూహం చాలా పకడ్బందీగా ఉండాలి. ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఏమి అడుగుతు న్నారు, మనం ఏమి చెబుతున్నాం, సమాధానాన్ని మనం ఎలా వ్యక్తం చేస్తున్నాం లేదంటే చేయాలి అనే విషయాలపై పక్కా ప్రణాళికతో వ్యవహరించాలి.

🌷సోషల్‌ మీడియా, జాబ్‌ పోర్ట్‌ల్స్‌ పరిశీలనలో చురుకుగా:

సోషల్‌ నెట్‌వర్కింగ్‌ ప్రభావం ఈ రోజుల్లో విపరీతంగా ఉంది. జాబ్‌ మార్కెట్‌లో నిలవాలంటే సంబంధిత అంశాల్లో చాల చురుకుగా వ్యవహరించాల్సిందే. పేరు ప్రతిష్ఠలు ఎక్కువగా ఉన్న సంస్థల్లో జాబ్‌ పొందాలంటే ఆ సామర్థ్యం తప్పనిసరి.

🌷అవగాహనలో వెనుక ఉండొద్దు:

ఒక పజిల్‌ను పూర్తి చేయలేనప్పుడు విషయం ఆసాంతం ఆర్థం కాదు. అంతా ముక్కలుముక్కలుగానే ఉంటుంది. ఇంటర్వ్యూ విషయానికి వస్తే, మనం వెళ్ళిన కంపెనీపై సమగ్ర అవగాహన లేకుంటే, అభ్యర్థి పరిస్థితి బలహీ నంగా ఉంటుంది. ఇంటర్వ్యూ జరుగుతున్న సమయం లోనే కంపెనీకి తాను ఎలా ఫిట్‌ అన్నది అభ్యర్థి తెలియజేయాలి.

ఈ విషయం జవాబులో రావాలంటే, కంపెనీకి సంబంధించిన విషయాలు తెలిసి ఉండాలి. కంపెనీ లక్ష్యానికి అనుగుణంగా అభ్యర్థి తన లక్ష్యాలు, విలువలు, నైపుణ్యాలు ఎలా ఉపయోగపడతాయో వివరించాలి. అదే సమయంలో తన విధుల నిర్వరించే క్రమంలో భాగంగా కంపెనీ తన నుంచి ఏమి ఆశిస్తోందో తెలుసుకోవాలి. దీంతో జాబ్‌ విషయంలో అభ్యర్థి ఎంత సీరియస్‌గా ఉన్నారన్నది ఇంటర్వ్యూ చేసే వ్యక్తికి అర్థమవుతుంది

🌷ఎవరి సీవీ వారికే:

మన పరోక్షంలో మనల్ని కంపెనీ ముందు నిలిపేదే సీవీ. మొదట ఆ సీవీ ఆకట్టుకుం టేనే హైరింగ్‌ మేనేజర్‌ నుంచి పిలుపు అందుకోగలం. అందువల్ల దేనికదిగా కంపెనీని అనుసరించి సీవీని రూపొందించుకోవాలి. చిట్టిపొట్టి వాక్యాలతో ఇంత వరకు చేసిన పని తదితరాలన్నీ రాయాలి. సొంత విషయాలు మొదలుకుని ప్రతీది బుల్లెట్‌ పాయింట్స్‌తో రాయాలి. అబద్దాలకు తావుండరాదు.

🌷మంచి ఇంప్రెషన్‌:

 ఇంటర్వ్యూలో గెలుపు అన్న విషయాన్ని పక్కన పెడితే, అభ్యర్థిగా మంచి ఇంప్రెషన్‌ ఇవ్వగలగాలి. సమయానికి ఇంటర్వ్యూ చేసే ప్రదేశానికి చేరుకోవడం, మంచి డ్రెస్సింగ్‌, ఐ కాంటాక్ట్‌, చెప్పే విషయంలో స్పష్టత, ఆత్మవిశ్వాసం, గతంలో సాధించిన విజయాల వివరణలో ఆచితూచి వ్యవహరించాలి. యావత్తు వ్యవహారాన్ని నడవడి అన్న పదబందంలో ఇముడ్చుకోవాలి.

🌷ఫాలోఅప్‌:

 ఇదో కీలక అంశం. మీ నుంచి ఏమి ఆశిస్తోందో కంపెనీ నర్మగర్భంగా తెలియజేస్తుంది. ఆ మాటల్లోని అంతరార్థాన్ని అర్థం చేసుకోండి. తుది ఎంపికకు సంబంధించి మర్యాదగా ప్రశ్నించి తెలుసు కోండి. ఇంటర్వ్యూ అనంతరం ఫాలోఅప్‌ను అస్సలు మర్చిపోవద్దు. అవకాశం ఉందా అని అడగడం ద్వారా, మిమ్మల్ని తీసుకుంటే కంపెనీకి అదనంగా సమకూరే విలువే అన్నది అర్థమయ్యేలా ఈ ఫాలోఅప్‌ ఉండాలి

Comments

Popular posts

TET అభ్యర్థులకు ఉపయోగకరమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్

TET పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఒక ప్రత్యేకమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో మీరు ఎన్ని సార్లైనా పరీక్ష రాయవచ్చు. ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం రూపొందించబడటం దీని ప్రత్యేకత. ఈ మాక్ టెస్టులు విస్తృతమైన ప్రశ్నల బ్యాంక్ ఆధారంగా రూపొందించబడుతున్నందున, ప్రతి పరీక్షలో భిన్నమైన ప్రశ్నలు ఎదురవుతాయి. దీనివల్ల ఒకే రకమైన ప్రశ్నలు పదేపదే రావడం తగ్గి, అభ్యర్థులు వివిధ అంశాలపై మెరుగైన అవగాహన పెంపొందించుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా: • అపరిమిత సంఖ్యలో మాక్ టెస్టులు రాయవచ్చు. • ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం లభిస్తుంది. • విభిన్న అంశాలపై ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. • పరీక్షా సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. • మీ బలాలు, బలహీనతలను గుర్తించి వాటిపై మరింత దృష్టి పెట్టవచ్చు. • కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు అలవాటు పడేందుకు ఇది ఉపయోగపడుతుంది. • కంప్యూటర్ వినియోగంలో అనుభవం తక్కువగా ఉన్న అభ్యర్థులు కూడా ముందుగానే ప్రాక్టీస్ చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. నిరంతరంగా మాక్ టెస్టులు రాయడం ద్వారా పరీక్షా భయం తగ్గి, నిజమైన TET పరీక్షలో ...

AP 2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు

2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు.  https://cse.ap.gov.in/loadacademictextbookpublicview?random=0.6384777802675639 Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺