Skip to main content

వ్యోమ తెలుగు కరెంట్ అఫైర్స్ - 15/06/2019




పీఎం కిసాన్ పెన్షన్ కోసం నెలకు రూ.100

 ప్రధానమంత్రి కిసాన్ పెన్షన్ యోజనలో భాగంగా రైతులు ఇకపై ప్రతినెలా రూ.100 చెల్లించాల్సి ఉంటుందని కేంద్రప్రభుత్వం తెలిపింది.
ఈ మేరకు రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ జూన్ 13న దిశానిర్దేశం చేశారు.
 పీఎం కిసాన్ పెన్షన్‌లో చేరిన రైతులు 60 ఏళ్ల వరకు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.
 దీనికి సమాంతరంగా కేంద్ర ప్రభుత్వం అంతేమొత్తం చెల్లిస్తుంది.
  రైతుకు 60 ఏళ్లు నిండాక నెలకు రూ.3,000 చొప్పున పెన్షన్‌గా కేంద్రం చెల్లించనుంది.

జిన్‌పింగ్‌కు కిర్గిజ్ అత్యున్నత పురస్కారం

చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌కు కిర్గిస్థాన్ అత్యున్నత పౌర పురస్కారం ‘మనాస్ ఆర్డర్ ఆఫ్ ద ఫస్ట్ డిగ్రీ’ లభించింది.

కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్‌లో జూన్ 13న జరిగిన కార్యక్రమంలో జిన్‌పింగ్‌కు కిర్గిస్థాన్ అధ్యక్షుడు సూరోన్‌బే జీన్‌బెకోవ్ ఈ అవార్డు ప్రదానం చేశారు.
 కిర్గిస్థాన్-చైనా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య అభివృద్ధికి జిన్‌పింగ్ అందించిన ప్రత్యేక సేవలను ఈ సందర్బంగా సూరోన్‌బే ప్రశంసించారు.

శ్రీలంక ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా రువాన్‌ కులతుంగ

 శ్రీలంక జాతీయ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ గా మేజర్‌ జనరల్‌ రువాన్‌ కులతుంగ నియమితులు కానున్నారు.
 రక్షణ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న సిరిసేన గతవారం విచారణకు ముందే మెండిస్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించారు.
జాతీయ తౌహీద్‌ జమాత్‌ జరిపిన బాంబ్‌ దాడులు అనంతరం పోలీస్‌ చీఫ్‌ పూజిత్‌ జయసుందర, రక్షణ శాఖ ఉన్నతాధికారి హేమసిరి ఫెర్నాండోలను కూడా సిరిసేన విధుల నుంచి తొలగించారు.   

🥈తెలుగులో ఇద్దరికి సాహిత్యఅకాడమీ అవార్డులు

 యువ, బాల సాహిత్య పురస్కారాలను కేంద్ర సాహిత్య అకాడమీ  జూన్ 14న  ప్రకటించింది.
ఇద్దరు తెలుగు సాహితీ వేత్తల రచనలకు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలు వరించాయి. యువ పురస్కారాల్లో తెలుగు నుంచి గడ్డం మోహన్‌రావు రచించిన ‘కొంగవాలు కత్తి’ నవల, బాలసాహిత్య విభాగంలో బెలగాం భీమేశ్వరరావు రచించిన ‘తాత మాట వరాల మూట’ కథకు ఈ ప్రఖ్యాత పురస్కారాలు వరించాయి.
గడ్డం మోహన్‌రావు ప్రస్తుతం ఓయూలో అధ్యాపకులుగా పనిచేస్తున్నారు.
పరిశోధకుడిగా చిందు కళాకారుల జీవితాలను ఆయన వెలుగులోకి తీసుకొచ్చారు.
చదివించే కథనం, సంఘటనలు, కళ్ల ముందు కదిలేలా అక్షరీకరించడం ఆయన శైలి ప్రత్యేకత.
  విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన బెలగాం భీమేశ్వరరావు 1979 నుంచి 40 ఏళ్లుగా బాలసాహిత్యానికి సేవలందిస్తున్నారు.
 1000కి పైగా కథలు గేయాలు రచించారు. మహరాష్ట్రలో తెలుగు భాష అభ్యసించే విద్యార్థులకు ఈయన కథలు, నాటికలను పాఠ్యాంశాలుగా బోధిస్తున్నారు. 

Read More Current Affairs@
https://www.vyoma.net/current-affairs/

Comments

Popular posts

TET అభ్యర్థులకు ఉపయోగకరమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్

TET పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఒక ప్రత్యేకమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో మీరు ఎన్ని సార్లైనా పరీక్ష రాయవచ్చు. ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం రూపొందించబడటం దీని ప్రత్యేకత. ఈ మాక్ టెస్టులు విస్తృతమైన ప్రశ్నల బ్యాంక్ ఆధారంగా రూపొందించబడుతున్నందున, ప్రతి పరీక్షలో భిన్నమైన ప్రశ్నలు ఎదురవుతాయి. దీనివల్ల ఒకే రకమైన ప్రశ్నలు పదేపదే రావడం తగ్గి, అభ్యర్థులు వివిధ అంశాలపై మెరుగైన అవగాహన పెంపొందించుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా: • అపరిమిత సంఖ్యలో మాక్ టెస్టులు రాయవచ్చు. • ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం లభిస్తుంది. • విభిన్న అంశాలపై ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. • పరీక్షా సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. • మీ బలాలు, బలహీనతలను గుర్తించి వాటిపై మరింత దృష్టి పెట్టవచ్చు. • కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు అలవాటు పడేందుకు ఇది ఉపయోగపడుతుంది. • కంప్యూటర్ వినియోగంలో అనుభవం తక్కువగా ఉన్న అభ్యర్థులు కూడా ముందుగానే ప్రాక్టీస్ చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. నిరంతరంగా మాక్ టెస్టులు రాయడం ద్వారా పరీక్షా భయం తగ్గి, నిజమైన TET పరీక్షలో ...

AP 2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు

2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు.  https://cse.ap.gov.in/loadacademictextbookpublicview?random=0.6384777802675639 Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺