Skip to main content

రేడియో గురించి మీకు తెలుసా...?

📻📻📻📻📻📻📻📻📻📻📻📻📻📻📻📻
  ఈరోజు అందరం రేడియో గురించి తెలుసుకుందాం..
తీగల ఆధారం లేకుండా గాలిలో శబ్దసంకేతాలను ప్రసారం చేసే ప్రక్రియని రేడియో ట్రాన్స్మిషన్ అంటారు. ఇలాంటి ప్రసారాలను వినటానికి ఉపయోగించే సాధనాన్ని రేడియో అంటారు. దీనిని మార్కొని అనే శాస్త్రవేత్త కనిపెట్టారు. మొదట వాడడానికి వాల్వులను ఉపయోగించి వీటిని రూపొందించేవారు. తర్వాత ట్రాన్సిస్టర్లు కనిపెట్టడంతో ట్రాన్సిస్టర్లు వాడిన రేడియోలు వాడుకలోకి వచ్చాయి. వీటిని ట్రాన్సిస్టర్ రేడియోస్ అంటారు. ఇవి తక్కువ విద్యుత్ తోనే కాదు బ్యాట్రీతో కూడా పనిచేస్తాయి. ట్రాన్సిష్టరుల వాడకం రేడియో సెట్లలో ప్రారంభమై తర్వాత చెవిటి వాళ్ళ ఉపయోగించే శ్రవణ పరికరాలు,గిటార్లు, రాకెట్ లలో వాడే ఆధునిక పరికరాలు, కంప్యూటర్ల దాకా విస్తరించింది. చిన్న తరంగాలపై పనిచేసే రేడియో టెలిఫోన్ అనే పరికరం కూడా
ఇప్పుడు ఎంతగానో ఉపకరిస్తోంది.

ఓడ నుండి తీరానికి, విమానం నుంచి విమానాశ్రయానికి వార్తలను పంపించేందుకు కూడా దీన్ని తప్పనిసరిగా వాడాల్సిందే. కల్లోలిత ప్రాంతాలలో గస్తీదళాలకు, పర్వతారోహక బ్రుందాలకు, అంబులెన్స్ వాహనాలకు,సైనిక దళాలకు, ఇది ఎంతగానో ఉపయోగపడుతోంది. వ్యవసాయాభివ్రుద్ధికి, వయోజన విద్యాప్రచారానికి, మహిళాభ్యుదయానికి, కార్మిక వార్తల ప్రచారానికి, పిల్లల అభిరుచులను అభివ్రుద్ధి పరచటానికి  ఎంతగానో ఉపకరి స్తుంది. వార్తలు, లలిత సంగీతం, శాస్ర్తీయసంగీతం, సాహిత్యప్రదర్శనలు అంటూ ఎన్నో ప్రసారం చేస్తోంది. ఎందరో సంగీత సాహిత్య కళాకారులు ఆకాశవాణిలోఉద్యోగులుగా లలిత గీతాలు, రూపకాలు, నాటికలు లాంటి కార్యక్రమాలలో శ్రోతలందరితోనూ పాలుపంచుకున్నారు... వారిలో కొందరు ప్రముఖుల పేర్లు తలుచుకుందాం...


అన్నవరపు రామస్వామిగారు
ఇవటూరి విజయేశ్వరరావుగారు
ఈమనిశంకరశాస్ర్తి గారు
ఉషశ్రీగారు
త్రిపురనేని గోపిచంద్ గారు
దేవులపల్లి క్రిష్ణశాస్త్రిగారు
బుచ్చిబాబుగారు
మంగళంపల్లి బాలమురళీక్రిష్ణగారు
శ్రీరంగం గోపాలరత్నంగారు
స్ధానం నరసింహారావుగారు...

ఇలా ఎందరో మహానుభావులు... ఎయిర్ ద్వారా అదేనండి... ఆల్ ఇండియా రేడియో ద్వారా తెలుగువారందరికీ ఎన్నో వినిపించారు. ఇప్పుడు ఆకాశవాణి, జానవాణి, బిగ్ ఎఫ్ ఎమ్, రెడ్ ఎఫ్ ఎమ్, రేడియో ఎఫ్ఎమ్, రేడియో మిర్చి, రేడియో సిటీ, రేడియో స్టూడియో, తెలుగు ఎప్ ఎమ్ రేడియో లాంటివెన్నో మిమ్మల్ని అందరినీ అలరిస్తున్నాయి....
📻📻📻📻📻📻📻📻📻📻📻📻📻📻📻📻

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

ఆధునిక భారతదేశ చరిత్ర top 30 bits....

1. భగత్ సింగ్‌కు మరణశిక్ష విధించిన న్యాయమూర్తి ఎవరు?  జ: GC హిల్టన్  2. మహాత్మా గాంధీ రాజకీయ గురువు ఎవరు?  జ: గోపాల్ కృష్ణ గోఖలే  3. ఏ చట్టాన్ని అప్పీల్ లేకుండా, లాయర్ లేకుండా మరియు వాదన లేకుండా చట్టం అని పిలుస్తారు.  జ: రౌలట్ చట్టం  4. దండా ఫౌజ్‌ను ఎవరు ఏర్పాటు చేశారు?  జ: చమందీవ్ (పంజాబ్)  5. పాముల దేశం అని దేనిని పిలుస్తారు?  జ: బ్రెజిల్  6. మరణశిక్ష విధించిన అతి పిన్న వయస్కుడైన విప్లవకారుడు ఎవరు?  జ: ఖుదీరామ్ బోస్  7. జలియన్ వాలాబాగ్ మారణకాండకు నిరసనగా కైసర్-ఎ-హింద్ బిరుదును ఎవరు తీసుకున్నారు? నిరాకరించారు.  జ: మహాత్మా గాంధీ  8. గదర్ పార్టీని ఎవరు స్థాపించారు?  జ: లాలా హర్దయాల్, కాశీరాం  9. ఫార్వర్డ్ బ్లాక్ సంస్థ స్థాపకుడు ఎవరు?  జ: సుభాష్ చంద్రబోస్  10. కాంగ్రెస్ ఎప్పుడు, ఏ పార్టీలలో చీలిపోయింది?  జ: 1907 మితవాదులు మరియు తీవ్రవాదులు (సూరత్ సెషన్)  11. కాంగ్రెస్ మొదటి ముస్లిం అధ్యక్షుడు ఎవరు?  జ: బద్రుద్దీన్ త్యాబ్జీ  12. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఎవరు.  జ: శివాజీ ...