Skip to main content

ప్రముఖ వ్యక్తులు నినాదాలు




జాతీయ వ్యక్తులు:    నినాదం--వ్యక్తి

» గోబ్యాక్ టు వేదాస్ (వేదాలకు మరలండి)--స్వామి దయానంద సరస్వతి


» నాకు రక్తాన్ని ఇవ్వండి - మీకు నేను స్వాతంత్య్రం ఇస్తాను--సుభాష్ చంద్రబోస్

»ఢిల్లీ చలో--సుభాష్ చంద్రబోస్

» జైహింద్-సుభాష్ చంద్రబోస్

» జై జవాన్, జై కిసాన్-లాల్‌ బహదూర్ శాస్త్రి

» సత్యం, అహింస నాకు దేవుళ్లు--మహాత్మా గాంధీ


» డూ ఆర్ డై (చేయండి లేదా చావండి)--మహాత్మా గాంధీ

» బెంగాల్ విభజన దినం బ్రిటిష్ సామ్రాజ్య పతన దినం--మహాత్మా గాంధీ

» బెంగాల్ విభజన తరువాత దేశంలో అసలైన చైతన్యం మొదలైంది--మహాత్మా గాంధీ

» సంస్కారం లేని చదువు వాసనలేని పువ్వులాంటిది--మహాత్మా గాంధీ

» ది వేదాస్ కంటైన్ ఆల్ ది ట్రూత్--స్వామి దయానంద సరస్వతి

» భారతదేశం, భారతీయుల కొరకే--స్వామి దయానంద సరస్వతి

» ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి--లాలా లజపతిరాయ్

» కాంగ్రెస్ ఉద్యమం ప్రజల చేత ప్రభావితమైంది కాదు, ప్రజలు ప్రణాళిక చేసిందీ కాదు--లాలా లజపతిరాయ్

» ముందుకు సాగండి--మేడం బికాజికామా

» నిజాలను నిర్లక్ష్యం చేస్తే అవి రెట్టింపు శక్తితో ప్రతీకారం తీర్చుకుంటాయి--సర్దార్ వల్లభాయ్ పటేల్

» రోజ్‌గార్ బడావో--మన్మోహన్‌సింగ్

» జై విజ్ఞాన్--అటల్‌బిహారి వాజ్‌పేయి

» భారతదేశానికి హిందువులు, ముస్లింలు రెండు కళ్లులాంటివారు--సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్

» రాజకీయ స్వేచ్ఛ అన్నది జాతికి ప్రాణ వాయువులాంటిది--అరబిందో ఘోష్

» ప్రజలే ప్రభువులు--లోక్‌సత్తా

» ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు--జవహర్‌లాల్ నెహ్రూ

» ప్రతి కంటి నుంచి కారే కన్నీటిని తుడవడమే నా అంతిమ లక్ష్యం--జవహర్‌లాల్ నెహ్రూ

» చెడును సహిస్తే అది మొత్తం వ్యవస్థనే నాశనం చేస్తుంది--జవహర్ లాల్ నెహ్రూ

» ప్రపంచం ఒక పద్మవ్యూహం, కవిత్వం ఒక తీరని దాహం--శ్రీశ్రీ

» భారతదేశం నేర్చుకోవాల్సిన ఒకే ఒక్క పాఠం ఏమిటంటే ఎలా చావాలో, దాన్ని బోధించవలసిన ఏకైక పద్ధతి చావడం ద్వారానే--ఎం.కె. ధింగ్రా

» ఇంక్విలాబ్ జిందాబాద్ (విప్లవం వర్ధిల్లాలి)--భగత్‌సింగ్

» స్వరాజ్యం నా జన్మహక్కు, దాన్ని సాధించి తీరుతాను--బాలగంగాధర తిలక్

» దేవుడు అంటరానితనాన్ని సహిస్తే నేను ఆయన్ను దేవునిగా అంగీకరించను--బాలగంగాధర తిలక్

» పిచ్చాసుపత్రుల వెలుపల ఉండే పిచ్చివాళ్లు మాత్రమే స్వాతంత్య్రం గురించి ఆలోచిస్తారు, మాట్లాడతారు--గోపాలకృష్ణ గోఖలే

» ఆధునిక విద్య, విజ్ఞానాల్ని ఆర్జించకుండా మన జాతి పురోగమించటం సాధ్యం కాదు-రాజారామ్మోహన్‌రాయ్

» కళ కళ కోసం కాదు ప్రజల కోసం--బళ్ళారి రాఘవ

» గాంధీ మరణించవచ్చు కానీ గాంధీయిజం ఎప్పుడూ జీవించే ఉంటుంది--భోగరాజు పట్టాభి సీతారామయ్య

» దేశ్ బచావో, దేశ్ బనావో--పి.వి.నరసింహారావు

» వడగాల్పులు నా జీవితం అయితే వెన్నెల నా కవిత్వం--గుర్రం జాషువా

» ఒకే దేశం, ఒకే దేవుడు, ఒకే కులం, ఒకే ఆలోచన తేడా ఏమీ లేకుండా అనుమానమేమీ లేకుండా మేమందరం అన్నదమ్ములం--వి.డి.సావర్కర్

»నా తెలంగాణ కోటి రతనాల వీణ--దాశరథి కృష్ణమాచార్యులు

» బోదెను చేధిస్తే ఎండిన కొమ్మలు వాటంతటవే పడిపోతాయి--బాజీరావు

» చిన్న లక్ష్యాలు నిర్దేశించుకోవడం నేరం, గొప్ప కలలు కనండి, వాటి సాకారానికై కృషిచేయండి-ఎ.పి.జె. అబ్దుల్ కలాం

» పాలిత దేశంలో కాకుండా స్వతంత్ర దేశంలో నన్ను దీర్ఘ నిద్ర పోనివ్వండి--మోతీలాల్ నెహ్రూ

» నాలో చివరి రక్తపు బొట్టు వరకు ప్రజల కోసం పోరాడతాను--ఇందిరాగాంధీ

» అవసరమైతే చిరిగిన చొక్కా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో--కందుకూరి వీరేశలింగం పంతులు

» బ్రిటిష్ సామ్రాజ్య భావమే మాకు విరోధి, బ్రిటిష్ ప్రజలతో మాకు వైరం లేదు--మౌలానా అబుల్ కలాం ఆజాద్

» ప్రత్యేక రక్షణలు కోరుతున్న ముస్లింలు ఎంత మూర్ఖులో వాటిని ఇస్తున్న హిందువులు అంతకంటే పెద్ద మూర్ఖులు--మౌలానా అబుల్ కలాం ఆజాద్

» బికారీ హఠావో--రాజీవ్ గాంధీ

» వాణి నా రాణి--పిల్లలమర్రి పినవీరభద్రుడు

» బ్రిటిషర్ల ఫించను పొందుతున్న రాజుల, నవాబుల జాబితాలో బతకటం కంటే సైనికుడిగా మరణించటమే మేలు--టిప్పుసుల్తాన్

» సూర్యుడు కనపడలేదని కన్నీరు పెడుతూ ఉంటే చివరకు నక్షత్రాలు కూడా కనపడకుండా పోతాయి--రవీంద్రనాథ్ ఠాగూర్

» స్వాతంత్య్రం అనేది ఓ కనిపించని మహా అదృష్టం, అది లేనప్పుడు గాని దాని విలువ తెలియదు--రవీంద్రనాధ్ ఠాగూర్

» అందరిలోనూ సామాన్యున్ని అయినా చిరంజీవుణ్ణి--సి.నారాయణరెడ్డి

» కులం పునాదులపై ఒక జాతిని గాని ఒక నీతిని గాని నిర్మించలేము--బి.ఆర్. అంబేడ్కర్

» మహారాష్ట్రులనంతా ఒకచోట చేర్చు. మతం మరలా జీవించేటట్లు చూడు. మనల్ని చూచి మన పూర్వులు స్వర్గం నుంచి నవ్వుతున్నారు--గురు రామదాస్

» మానవులందరూ నా బిడ్డలవంటివారు--అశోకుడు.

నాకు వాట్సప్ లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ని పది మందికి చేరవేయాలి అనే ఆతురత తప్ప ఏ విధమైన వేరే ఉద్దేశ్యం లేదు...



Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు సువర్ణావకాశం

2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి లో 60% లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు తో పాస్ అయిన విద్యార్ధిని విద్యార్ధులకు ఎంట్రెన్స్ ఎగ్జామ్ లేకుండానే నవోదయ ఎటపాక స్కూల్ నందు 11వ తరగతి సైన్స్ మరియు మ్యాథ్స్ గ్రూప్స్ లో డైరెక్ట్ గా సీటు ఇవ్వబడును. కావున విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాము. దరఖాస్థులు నింపి పంపించడానికి చివరి తేదీ 20 ఆగష్టు 2025 . అడ్మిషన్స్ కేవలం మెరిట్ బేసిస్ మీదనే ఉంటుంది. ఎవరి సిఫార్సులు పని చేయవు.  మొత్తం ఖాళీల సంఖ్య: 52 సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9494343022 (కె. టీ. ప్రసాద్)  9491191813 (శ్రీ భాస్కరాచారీ, సీనియర్ టీచర్)  9491768144 (శ్రీ కె. శేఖర్, కౌన్సిలర్) ముఖ్య గమనిక: 11వ తరగతిలో ఎంపికకు ఖాళీగా ఉన్న సీట్లు 12 నుంచి 52 కు పెంచబడినాయని చెప్పటానికి సంతోషిస్తున్నాము. అంటే ఒక సెక్షన్ పెంచబడింది. ఇట్లు ప్రిన్సిపాల్ ఇంచార్జి  కె టి ప్రసాద్ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

𝗧𝗢𝗗𝗔𝗬 - 𝗛𝗜𝗡𝗗𝗨 - 𝗩𝗢𝗖𝗔𝗕𝗨𝗟𝗔𝗥𝗬

1. STIFLE (VERB): (गला घोंटना):  choke Synonyms: suffocate, asphyxiate Antonyms: cold Example Sentence:Those in the streets were stifled by the fumes. 2. VOLUMINOUS (ADJECTIVE): (विशाल):  capacious Synonyms: commodious, roomy Antonyms: tiny Example Sentence:We have a voluminous purple cloak at home. 3. PATRONIZE (VERB): (रिआयत करना):  look down on Synonyms: talk down to, put down Antonyms: friendly Example Sentence:She was determined not to be put down or patronized. 4 TACTICAL (ADJECTIVE): (परिगणित):  calculated Synonyms: planned, plotted Antonyms: unwise Example Sentence:In a tactical retreat, she moved into a hotel with her daughters. 5. AMALGAMATE (VERB): (मिलाना):  combine Synonyms: merge, unite Antonyms: separate Example Sentence:She amalgamated his company with another. 6 ONEROUS (ADJECTIVE): (कष्टदायक):  burdensome Synonyms: heavy, inconvenient Antonyms: easy Example Sentence:She found his ...