Skip to main content

సెల్ ఫోన్స్ వాడకంతో చిన్నారులకు బ్రెయిన్ ట్యూమర్లు


హైదరాబాద్ : బ్రెయిన్ ట్యూమర్....అదో కనిపించని టెర్రర్. ప్రాణంపోయే వరకు తెలియదు అది రోగి మెదడులో దాగి ఉందని..మెదడులో అసహజ కణాల వల్ల ఏర్పడే ఈ ట్యూమర్లు.. రెండు రకాలు. ఒకటి క్యాన్సర్‌కు సంబంధించిదని, రెండోవది సాధారణమైనది. ఇవి చాపకింద నీరులా వ్యాపించి రోగి ప్రాణాలు తీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బ్రేయిన్ ట్యూమర్స్‌పై ప్రజల్లో అవగాహన లేకపోవడంతో సకాలంలో చికిత్స తీసుకోలేక చివరి సమయంలో దవాఖానలకు పరుగులు పెడుతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. బ్రేయిన్ ట్యూమర్‌పై అవగాహన కల్పించే క్రమంలో ఏటా జూన్ 8న బ్రెయిన్‌ట్యూమర్ నివారణ దినంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిగణిస్తున్నది.
ఎందుకొస్తుంది..
సెల్ ఫోన్లు అధికంగా వాడడం వల్ల వాటి నుంచి వచ్చే రేడియేషన్ ప్రభావం వల్ల బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశాలున్నట్లు ఎంఎన్‌జే క్యాన్సర్ దవాఖాన, రీసర్చ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ జయలత తెలిపారు.
సాధారణంగా 60 ఏండ్లు, ఆ పై వయస్సువారిలో కనిపించే బ్రెయిన్‌ట్యూమర్ వ్యాధులు ఇప్పుడు చిన్న పిల్లల్లో సైతం కనిపిస్తున్నట్లు ఆమె వివరించారు. దీనికి ప్రధాన కారణం మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లతో పాటు ముఖ్యంగా పెరిగిపోయిన రేడియేషన్ తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు వివరించారు. ముఖ్యంగా చిన్నపిల్లలు బ్రెయిన్ ట్యూమర్స్ రావడానికి రేడియేషన్ ప్రభావమే ప్రధాన కారణంగా ఆమె తేల్చిచెప్పారు.
నాన్ క్యాన్సర్ ట్యూమర్స్
సాధారణంగా ట్యూమర్స్ రెండు రకాలు. అందులో బినైల్ ట్యూమర్స్, రెండోది మాలిగ్నివ్ ట్యూమర్స్. బినైల్ ట్యూమర్స్‌ను నాన్ క్యాన్సర్ ట్యూమర్స్‌గా పరిగణిస్తారని డా.జయలత తెలిపారు. అయితే ఈ ట్యూమర్స్ వల్ల రోగికి ప్రాణనష్టం చాలా తక్కువగా ఉంటుందని, ఇది మందులకు త్వరగా రెస్పాండై తగ్గుముఖం పడుతుందన్నారు. సాధారణంగా ఈ ట్యూమర్స్‌కు ప్రత్యేకంగా సైబర్‌నైఫ్ అనే చికిత్స చేస్తారని, ఈ చికిత్సకు చాలా తక్కువ ఖర్చవుతుందన్నారు.

మాలిగ్నివ్ ట్యూమర్
మాలిగ్నివ్ ట్యూమర్స్‌ను క్యాన్సర్ ట్యూమర్స్ అంటారు. ఇవి చాలా ప్రమాదకరమైనవని, వీటి వల్ల రోగికి ప్రాణనష్టం ఎక్కువగా ఉండే అవకాశాలుంటాయని వైద్యులు తెలిపారు. ఈ ట్యూమర్స్ మందులకు పెద్దగా రెస్పాండ్ కావని, కొన్ని సందర్భాల్లో అస్సలు మందులు పనిచేయవని తెలిపారు. ఈ రకం ట్యూమర్స్‌కు సర్జికల్, కీమో, రేడియోథెరపి ద్వారా చికిత్స అందించాల్సి ఉంటుందన్నారు.
రేడియన్‌తోనే పిల్లల్లో ట్యూమర్స్
వివిధ రకాల రేడియేషన్లు మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా సెల్‌ఫోన్స్, సెల్ టవర్స్ నుంచి వెలువడే రేడియోధార్మిక కిరణాలు మెదడుపై ప్రభావం చూపడం బ్రెయిన్ ట్యూమర్ రావడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. వంశపార్యపరంగా చాలా తక్కువ శాతం ఈ ట్యూమర్స్ వస్తాయి. ప్రస్తుతం మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు, రేడియేషన్ తదితర కారణాల వల్ల బ్రెయిన్ ట్యూమర్ వ్యాధులు వస్తున్నాయి. ముఖ్యంగా చిన్న వయస్సుగల వారిలో బ్రెయిన్ ట్యూమర్ రావడానికి ప్రధాన కారణం అధికంగా సెల్‌ఫోన్స్ వాడడం, రేడియేషన్ ప్రభావమే
. సాధారణంగా 60ఏండ్లు, ఆపైబడి వయస్సు వారికి బ్రెయిన్ ట్యూమర్స్ వస్తుంటాయి. ఈ మధ్య కాలంలో 20 ఏండ్ల లోపు వారికి, చిన్న పిల్లలకు కూడా బ్రెయిన్ ట్యూమర్స్ వస్తున్నాయి. తల్లిదండ్రులు పిల్లల విషయంలో శ్రద్ధ వహించాలి. *ఈ మధ్య కాలంలో పిల్లలకు ఆడుకునేందుకు కూడా సెల్‌ఫోన్స్ ఇస్తున్నారు. అది చాలా ప్రమాదకరం*. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం ఉత్తమం. -డాక్టర్ జయలత(డైరెక్టర్, ఎంఎన్‌జె క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీజనల్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్)

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ