Skip to main content

నేటి మోటివేషన్...


ఇది ఒక మధ్య తరగతి కుటుంబములో జరిగిన కథ.

    ఒక కొడుకుకి తన ఇంట్లో ఉండటం ఇష్టం లేదు. అతని తండ్రి ఆతనిని ఎప్పుడు నువ్వు ఫ్యాన్ స్విచ్  ఆఫ్ చేసి వేళ్ళు , T .V .స్విచ్ ఆఫ్ చేసి వేళ్ళు, టేబుల్,ఇల్లు శుభ్రంగా ఉంచుకో అని పదే పదే చెప్తు ఉండేవాడు .ఆ మాటలు ఆ కొడుకుకి నచ్చేవి కావు.ఇంట్లో ఉండటానికి ఇష్టం ఉండేది కాదు.

   నిన్నటి వరకు ఆ తండ్రి మాటలు ఇష్టం లేక పోయిన వినేవాడు కానీ ఈ రోజు అతనికి ఒక ఉద్యోగానికి పిలుపు వచ్చింది . ఉద్యోగం రాగానే వేరే చోటుకి వెళ్లిపోవాలి అని మనసులో అనుకున్నాడు.

  ఇంటర్వ్యూకి బయలుదేరాడు తండ్రి ఇంటర్వ్యూకి వెళ్తున్న  కొడుకుకి వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికి  దైర్యంగా సమాధానం చెప్పు ఒక వేళ నీకు తెలియకపోతే ఆ ప్రశ్నలని కూడా నువ్వు ధైర్యంగా ఎదురుకో అని చెప్పి ఖర్చులకు కొంచం ఎక్కువగానే డబ్బులు ఇచ్చి పంపాడు.

   ఆ కొడుకు ఇంటర్వ్యూ జరుగుతున్న అడ్రస్ కు వెళ్ళాడు. అంత పెద్ద బిల్డింగ్ కి సెక్యూరిటీ లేదు.గేట్ యొక్క గడి కొంచం వెళ్తున్న వాళ్ళ చేతికి తగిలేటట్లు ఉంది దానిని సరిచేసి లోపలికి వెళ్ళాడు .లోపల గేట్ కి రెండు పక్కల చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి .ఆ మొక్కలకు నీళ్లు పట్టి టూబ్ ని నడిచే దోవలో పడేసి ఆ తోట వాడు మోటార్ ఆఫ్ చేయటానికి వెళిపోయాడు .ఆ టూబ్ ని చేతిలోకి తీసుకోని ఒక మొక్క యొక్క మొదళ్ళ మీద నీరు పడేటట్లు పెట్టి లోపలికి వెళ్ళిపోయాడు.

  రిసెప్షన్ లో ఎవ్వరు లేరు. ఇంటర్వ్యూ కి 1 ST ఫ్లోర్ అని బోర్డు రాసి పెట్టి ఉంది .మెల్లగా మెట్లు ఎక్కాడు దారిలో నిన్న రాత్రి వేసిన లైట్లు వెలుగుతూనే ఉన్నాయి ఎవ్వరు ఆఫ్ చేయకుండా ఉన్నాయి .లైట్స్ ఆఫ్ చేయకుండా వెళ్తున్నావు అని తండ్రి చెప్పిన మాటలు వినపడుతున్నట్లుగా సడన్ గా అనిపించి వెంటనే మెట్ల వద్దకు వెళ్లి లైట్స్ స్విచ్లను ఆఫ్ చేసి పైకి వెళిపోయాడు.

 1ST ఫ్లోర్ లో ఒక పెద్ద హాలు లో చాలా మంది కూర్చొని ఉన్నారు. అంత మందిని చూసి నాకు ఇక్కడ ఉద్యోగం దొరుకుతుందా అని మనసులో అనుకుంటూ ముందుకు అడుగు వేసాడు, అక్కడ ఫ్లోరుపై ఉన్న MAT పై WELCOME తల క్రిందులుగా ఉంది దానిని కాలితో సరిచేసి లోపలికి వెళ్ళిపోయాడు.ఆ హాల్ లో ముందు వరుసలో  చాలా మంది కూర్చొని ఉన్నారు ,వెనుక వరుస కాళిగా ఉంది కానీ ఫ్యాన్ తిరుగుతూ ఉంది . గది లో ఎవ్వరు లేనప్పుడు ఫ్యాన్ ఎందుకు అని వాళ్ళ అమ్మ అన్నట్లు మాటలు వినపడ్డాయి వెంటనే ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంటర్వ్యూ కి వచ్చిన వారితో కలిసి కూర్చున్నాడు.

  ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళని ఒక దారిలో నుంచి లోపలికి పంపి వేరే దారిలోనుండి బయటకి పంపిస్తున్నారు ,దానివల్ల లోపల ఎటువంటి ప్రెశ్నలు అడుగుతున్నారో అనే విషయం తెలుసుకోలేక పోయాడు.లోపల ఏమి ప్రశ్నలు అడుగుతారో అనే భయంతోనే లోపలికి వెళ్లి నిలబడ్డాడు.అతని సర్టిఫికెట్స్ తీసుకున్న అధికారి తెరచి చూడకుండానే మీరు ఉద్యోగంలో ఎప్పుడు చేరతారు అని ఆ అధికారి అతన్ని అడిగాడు .ఇది కూడా ఒక ప్రశ్న లేక ఉద్యోగం లో చేరతారా అని అడిగారో అర్ధం కాకుండా ఆలోచిస్తూ నిలబడాడ్డు .

అధికారి ఏంటి ఆలోచిస్తున్నావు ఇక్కడ మేము ఎవ్వరిని ఎలాంటి ప్రశ్నలు అడగలేదు వచ్చే ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారో , ఎలా ప్రవర్తిస్తున్నారో చూడటానికి అక్కడక్కడా కెమెరాలు పెట్టాము .ఇక్కడికి వచ్చిన అందరూ వేస్ట్ అవుతున్న వాటర్ ని కానీ, టూబ్ లైట్స్ ని కానీ, ఫ్యాన్ ని కానీ ఆఫ్ చేయలేదు కానీ మీరు ఒకరే అనింటిని సరిచేస్తూ లోపలికి వచ్చారు.మేము మిమల్ని ఉద్యోగం లోకి తీసుకుంటున్నాము అని ఆ అధికారి చెప్పాడు.
 
 నాన్న చెప్పే మాటలు అన్ని నాకు విసుకు తెప్పించేవి,కానీ ఆ మాటలే ఇప్పుడు నాకు ఉద్యోగం ఇప్పించాయి అని సంతోష పడ్డాడు. తండ్రి మీద ఉన్న కోపం మొత్తం పోయింది . ఉద్యోగం లో చేరేటప్పుడు నాన్న ని కూడా ఇక్కడికి తీసుకురావాలి అని మనస్సులో అనుకుంటూ ఇంటికి బయలుదేరాడు

 తండ్రి మన కోసం ఎం చెప్పినా ,ఎం చేసినా మన భవిష్యత్తు కి మంచి జరగాలనే చేస్తాడు.

  ఉలి దెబ్బలకి శిల బాధపడుతుంది అనుకుంటే రాయి శిల్పం కాదు . ఆ బాధని తట్టుకున్నపుడే ఆ రాయి శిల్పంగా మారుతుంది .

తండ్రి మనలో ఉన్న చెడుని ఉలి పెట్టి కొట్టినట్లు పోగొడతాడు.తల్లి బిడ్డని పాలిచ్చి,లాలించి,కథ చెప్పి పడుకోపెట్టి పెంచుతుంది ,కానీ తండ్రి అలా కాదు తాను చూడని లోకాన్నితన కొడుకు చూడాలి అని తన భుజంపై కూర్చోపెట్టి లోకాన్నిచూపిస్తాడు.

తల్లి ఒక కవిత అయితే తండ్రి ఒక చరిత్ర!
తల్లి కష్టపడేదాన్నికనిపెట్టచ్చు కానీ తండ్రి కష్టాన్ని పక్కవారు చెప్తే కానీ కనిపెట్టలేరు.
మనకి తండ్రి 5 సంIIల వరకు గురువు లాగా 25 సంIIలకు శత్రువు లాగా కనిపించే తండ్రి గురించి ఆయన చనిపోయిన తర్వాత ఆయన గొప్పతనం తెలుస్తుంది .
తల్లి వృధాప్యంలో కొడుకు లేదా కూతురు ఇంట్లోనో ఉండి తన జీవితాన్ని గడుపుతుంది .
తండ్రి అలా ఉండలేడు చివరి వరకు ఒంటరిగానే ఉండిపోతాడు .
అందువల్ల తల్లితండ్రుల్ని ప్రాణాలతో ఉన్నప్పుడే ప్రేమగా చూసుకోకుండా ప్రాణంతో లేనప్పుడు బాధపడి ప్రయోజనం లేదు....

గమనిక:- చనిపోయినతరువాత గొప్పలు చూపించుకోవటానికి పంచభక్ష్యాలతో   వేలమందికి ఆర్భాటంగా భోజనాలుపెట్టే సంతానం ఆలోచించండి. బ్రతికుండగా have తల్లితండ్రులకు కడుపునిండా ప్రేమగా నాలుగు ముద్దలు పెట్టండి సంతోషంగా మరికొంతకాలం జీవించే అవకాశం కల్పించండి 

Comments

  1. Sir really ur thoughts are so NYC ND I'm very tqful to this group. ..

    ReplyDelete

Post a Comment

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

తెలుసుకుందాం...

🌸జవాబు: గోత్రం అంటేనే అద్భుతమైన సైన్సు. ఈ శాస్త్రం ప్రకారం మన పూర్వీకులు గోత్ర విధానాన్ని ఎలా ఏర్పాటు చేశారో గమనించండి. మీరు పూజలో కూర్చున్న ప్రతిసారీ పూజారి మీ గోత్రం గురించి  ఎందుకు అడుగుతారో మీకు తెలుసా? _తెలీదు కాబట్టి అది చాదస్తం అనుకుంటున్నారు?_ 💐గోత్రం వెనుక ఉన్న శాస్త్రం మరేమిటో కాదు-  జీన్-మ్యాపింగ్. అది ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం  పొందిన అధునాతన శాస్త్రమే! 👉🏻 గోత్రం వ్యవస్థ అంటే ఏమిటి? 👉🏻 మనకు ఈ వ్యవస్థ ఎందుకు ఉంది?  👉🏻 వివాహాలకు ఇది చాలా ముఖ్యమైనదిగా మనం ఎందుకు భావిస్తాము? 👉🏻 కొడుకులకు ఈ గోత్రం ఎందుకు వారసత్వంగా వస్తుంది, కుమార్తెలకు ఎందుకు రాదు? 👉🏻 వివాహం తర్వాత కుమార్తె గోత్రం ఎలా/ఎందుకు మారాలి? 👉🏻 తర్కం ఏమిటి? 💐ఇది మనం అనుసరించే అద్భుతమైన జన్యు శాస్త్రం.   మన గోత్ర వ్యవస్థ వెనుక  జన్యుశాస్త్ర వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూద్దాం! గోత్రమ్ అనే పదం రెండు సంస్కృత పదాల నుంచి ఏర్పడింది.   మొదటి పదం 'గౌ'- అంటే ఆవు, రెండవ పదం 'త్రాహి' అంటే కొట్టం. గోత్రం అంటే 'గోశాల' అని అర్థం. జీవశాస్త్ర పరంగా, మానవ శరీరంలో 23 జతల క్...

నేటి మోటివేషన్... ఉద‌యం 8 లోపు చేసే (S.A.V.E.R.S.)….అనే ఈ 6 అల‌వాట్లు మీ జీవితాన్నే మారుస్తాయ్.!

హాల్ ఎలోర్డ్ అనే ప్ర‌ముఖ ర‌చ‌యిత రాసిన “ద మిరాకిల్ మార్నింగ్” అనే బుక్ లో ఉద‌యం 8 లోపు చేసే 6 ప‌నులు మ‌న జీవితాన్నే మారుస్తాయ్ అని చాలా స్ఫ‌ష్టంగా చెప్పాడు. కార్ యాక్సిడెంట్ అయ్యి కోమాలోంచి బ‌య‌ట‌ప‌డ్డ ఈ ర‌చ‌యిత ఇప్పుడు త‌న ర‌చ‌న‌ల‌తో ప్ర‌పంచాన్ని ఆలోచింప‌జేస్తున్నాడు. ఆనందానికి 6 అంశాల సూత్రం. S.A.V.E.R.S S-Silence( నిశ్శ‌బ్దం)....మ‌న ప్ర‌తి రోజును చాలా నిశ్శ‌బ్దంగా ప్రారంభించాలి…అంటే ప్ర‌శాంత‌త‌తో స్టార్ట్ చేయాలి..లేవ‌డం లేట‌య్యింది…అయ్యే ఎలా…? ఆఫీస్ ప‌ని…ఈ రోజు అత‌డిని క‌లుస్తాన‌ని చెప్పాను…ఎమోయ్…టిఫిన్ అయ్యిందా…..ఇదిగో ఇంత‌లా హైరానా ప‌డొద్దు… ప్ర‌శాంతంగా లేవ‌గానే….కాసింత సేపు మెడిటేష‌న్ చేయండి. లేదా…క‌ళ్ళు మూసుకొని ప్ర‌శాంత‌త‌ను మీ మ‌న‌స్సులోకి ఆహ్వానించండి. ఇక్క‌డే మ‌న రోజు ఎలా గ‌డుస్తుంది? అనేది డిసైడ్ అయిపోతుంది . A-Affirmations ( నీతో నువ్వు మాట్లాడుకోవ‌డం)…. అంద‌రి గురించి, అన్ని విష‌యాల గురించి అన‌ర్గ‌లంగా మాట్లాడే మ‌నం…మ‌న‌తో మ‌నం ఒక్క‌సారి కూడా మాట్లాడుకోలేక‌పోతున్నాం. అస‌లు మ‌న‌లోని మ‌న‌కు ఏం కావాలి? పెద్ద స్థాయికి ఎదిగిన వాళ్ళ‌ల్లో ఖ‌చ్చితంగా ఈ ల‌క్ష‌ణం ఉంటుంది. ఈ మూడు పా...