Skip to main content

నేటి మోటివేషన్...


కొద్దిగా రిస్కు చేసి చదవండి..🙏🙏🙏

ఒక వ్యక్తి ఎడారిలో దారి తప్పి పోయాడు అతడు తెచ్చుకున్న నీళ్లు 💧రెండు రోజుల తర్వాత అయిపోయాయి నడుస్తున్నాడు. నీరు ఎక్కడ కనపడటం లేదు తన జీవితపు ఆఖరు దశ కు చేరానని అతడికి తెలిసిపోయింది. ఈ రాత్రి గడవదు రేపు ఉదయం చూడను అని అనుకున్న దశలో ప్రయత్నం చేయడమా?? అలాగే నిరాశలో కూలబడి పోవడమా ??ఎటు నిశ్చయించుకొని లేకపోతున్నాడు దూరంగా ఒక గుడిసె 🏕️లాంటిది కనబడింది. అది నిజమా !!తన బ్రమా! ఏమో నిజమేమో!! అక్కడ తనకు నీరు దొరక వచ్చునేమో? తనకు చనిపోయేముందు ఆఖరి ప్రయత్నం చేయాలనుకున్నాడు. శక్తిని కూడా పెట్టుకున్నాడు.. తడబడిపోతున్న అడుగులతో👣 ముందుకు నడుస్తున్నాడు.. గుడిసెలోకి వెళ్ళాడు అక్కడ ఒక నీటి పంపు 🚰కనబడింది👀. దానిని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టయింది దాని దగ్గరకు వెళ్లి కొట్టాడు నీరు 💧రావడం లేదు శక్తినంతా ఉపయోగించి కొట్టాడు అయినా ప్రయోజనం లేదు నిరాశ నిస్పృహలు ఆవరించాయి. ఒంట్లో ఉన్న కొద్ది నీరు అయిపోయింది కళ్ళు మూసుకుపోతున్నాయి..
ఒక మూలాన సీసా🍼 కనిపించింది దానిలో నీరు ఉంది .మూత గట్టిగా బిగించి ఉంది మూత దాన్ని ఎత్తిపట్టి తాగుదామని పైకెత్తాడు ..దానికి ఒక కాగితం కట్టి ఉంది దాని మీద ఈ రాసి ఉంది బోరులో నీరు పోయండి.. పంపు కొట్టండి నీరు వస్తుంది ..మీరు మళ్ళీ బాటిల్ నింపి పెట్టండి..

..అతడికి సందేహం కలిగింది ఈ నీరు తాగెయ్యడమా!!? బోరింగ్ పంపు లో పొయ్యడ మా?ఎంత కొట్టినా? రాని నీరు ఈ బాటిల్ లో నీరు పోస్తే వస్తుందా?.. ఉన్న ఈ నీరు కాస్తా పోసేస్తే తర్వాత రాకపోతే? తన గతి ఏమి కావాలి ..చేతిలో ఉన్న నీరు తాగితే కనీసం ఇంకో రెండు రోజులు బతకొచ్చు ..అందులో పోస్తే మరణం ఖాయం..

ఏమి చేయాలి లి ఒక నిశ్చయానికి వచ్చాడు నీళ్లను పంపులో పోశాడు బోరింగ్ పంపు కొట్టాడు !!ఆశ్చర్యం!!! పాతాల గంగ పైకి తన్నుకుంటూ ..వచ్చింది నీళ్లు తాగి బాటిల్ ని నింపాడు.. మూలన పెట్టాడు. తను తెచ్చుకున్న బాటిల్ లో నీళ్లు నింపుకున్నాడు..గుడిసెలో ఎడారి మ్యాప్ కనబడింది. తను ఎటు వెళ్ళాలో చూసి బయలుదేరాడు..👣👣

....ఏదైనా పొందాలంటే ఇవ్వడం నేర్చుకోవాలి ఇవ్వడం వలన మనం పొందగలం అనే నమ్మకాన్ని కలిగి ఉండాలి కృషి చేయకుండా ఫలితం ఆశించకూడదు..
చావుబతుకుల మధ్య ఇక్కడ #తర్కం #ఎంత కొట్టినా పంప్ నుండి నీళ్ళు పోస్తే ఎలా వస్తాయి..?? రిస్క్ తీసుకోకుండా బాటిల్ లో నీళ్లు తాగితే ...మహా అంటే మరి కొన్ని గంటలు ప్రాణం నిలుపుకోవచ్చు ..తర్వాత..? అసలు బాటిల్ లో నీళ్లు ఎలా వచ్చాయి ?తనకన్నా ముందు ఎవరికో ఇలాంటి సమస్య వచ్చి ఉండొచ్చు..? వాళ్ళు పంపులో పోసి ఆ తర్వాత తిరిగి బాటిల్ లో నీళ్ళు నింపి ఉండవచ్చు ..!!కాబట్టి రిస్క్ అయినా బాటిల్ లో నీళ్ళు బోరింగ్ లో పోయడం కరెక్ట్..!!

గత్యంతరం లేని క్లిష్ట పరిస్థితుల్లో "నమ్మకం" ముఖ్యం.. నువ్వు ఇవ్వకుండా దేనిని పొందలేవు..!!


Comments

Post a Comment

Popular posts

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో...

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో... 💫Official Question Bank నుంచి 5×630 మొత్తం 3150 Questions ను వరుసగా 30 బిట్స్ కి ఒకటి చొప్పున మొత్తం Practice Tests చేయడం జరిగింది. 💡 ప్రశ్నలు చదవడం మాత్రమే కాదు… 👉 మీరు స్వయంగా Test రాసి 👉 వెంటనే Answer Check చేసి 👉 మీ Preparation Level తెలుసుకోండి! ⚡ Practice Mode + Actual Exam Mode 📊 Score & Answer Review కూడా వెంటనే! 🎯 AP TETకి సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థి ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించండి. 👇 Practice & Mock Tests ఇక్కడ: 🔗 https://ganaweb.in/ap-tet-official-paper-1a-practice-test/ 🔥 ఈరోజు ఒక Test… మీ Preparationలో ఒక Step ముందుకు! Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

TET and DSC Very important topics...

Lakshya Educational Groups