Skip to main content

నేటి మోటివేషన్....



ఒక్క క్షణం విలువ 🌱

ఒక ఊర్లో మంచి పేరు ప్రతిష్టలు కలిగిన పండితుడు ఒకాయన ఉండేవాడు.
చాలా చక్కని వాక్పటిమ గలవాడు.
ఆయన ఆలయం ఆవరణలో కూర్చొని ప్రవచనం చెబుతూ వుంటే
వేలమంది జనం అలా కదలకుండా బొమ్మల్లా వింటూ ఉండిపోయేవాళ్ళు.
ఆయన ప్రఖ్యాతి చుట్టుపక్కల చాలా గ్రామాల్లో వ్యాపించింది.

🌱ఒకసారి ఆయన ప్రవచనం నిమిత్తం పొరుగూరు వెళ్ళవలసి వచ్చింది.
ఆ ఊరు వెళ్ళే బస్సు ఎక్కి టికెట్ తీసుకున్నాడు.
అయితే పొరపాటున బస్సు కండక్టర్ 10 రూపాయలు ఎక్కువ ఇచ్చాడు.
పండితుడు అది గమనించి తిరిగి ఇవ్వాలని యోచించాడు.
కానీ బస్సునిండా జనం కిక్కిరిసి ఉండటంతో,
దిగేటప్పుడు ఇద్దాంలే అనుకుని కూర్చున్నాడు.

🌱 కొద్ది సేపు తరువాత అతని మనసులొ ఆలోచనలు మారాయి.

🌱'ఆ కండక్టరు కూడా ఎంతమంది దగ్గర చిల్లర కొట్టేయడం లేదు.

🌱 ఈ బస్సు కూడా ఒక సంస్థదే కదా! 🌱 ఎంత మంది తినటంలేదు?
🌱 నా పది రూపాయలకే నష్టపోతుందా ఏమిటి?

🌱 ఈ పది రూపాయలు ఏదైనా దైవ కార్యనికి ఉపయోగిస్తా......'
అని అనుకుని మౌనంగా కూర్చున్నాడు.

🌱 అంతలో వూరు వచ్చింది.... బస్సు ఆగింది.
కానీ ఆయన దిగేటప్పుడు బస్సు కండక్టర్ దగ్గరికి రాగానే
తన ప్రమేయం ఏమాత్రం లేకుండా అసంకల్పితంగా
కండక్టరుకు ఇవ్వవలిసిన పది రూపాయలు ఇచ్చి
"మీరు నాకు టికెట్ ఇచ్చేటప్పుడు ఇవి ఎక్కువగా ఇచ్చారు" అన్నాడు.

🌱 దానికి ఆ కండక్టర్ "అయ్యా! నేను మీ ప్రవచనాలు ఎంతో శ్రద్ధగా వింటాను.
మీరు చెప్పడంతోటే సరిపెట్టుకుంటారా లేక పాటిస్తారా
అని చిన్న పరీక్ష చేశాను" అని అన్నాడు.

🌱 పండితుడు చల్లటి చిరు చెమటలతో బస్సు దిగి
'పది రూపాయల కోసం తుచ్ఛమైన ఆశతో
నా విలువలకే తిలోదకాలు ఇవ్వబోయాను...
నా అదృష్టం బాగుంది.
నా మనస్సాక్షి సరైన సమయంలో సరియైన నిర్ణయం తీసుకొని
నా విలువలను కాపాడింది' అనుకున్నాడు.

🌱 జీవిత కాలం పాటు సంపాదించుకున్న మంచితనం కూడా
సర్వనాశనం కావడానికి
క్షణం చాలు....

🌱 ఒకానొక సందర్భం లో మీ శత్రువులు కూడా మీమీద ప్రయోగం చేస్తారు... మీ మంచితనాన్ని నాశనం చేయడానికి.... మీకు సంబంధం లేకుండానే మీ గురించి ప్రచారం చేస్తుంటారు... ఆ ప్రచారం అవునా కదా అని తెలుసుకోకుండా వాళ్ళు కళ్ళు ఉండి కూడా గుడ్డిగా నమ్ముతారు... అది వాళ్ళ కర్మ...

☘ కానీ మీరు మాత్రం జాగ్రత్త... గడియారం లో సెకండ్ ముళ్ళు ఎలా తిరుగుతుందో అలానే మీ జీవితాన్ని ప్రతి సెకండ్ ని గమనిస్తూ ముందుకు సాగండి....

☘ మంచితనానికి ఎపుడు చావు లేదు.... ☘

మీరు బ్రతికి ఉన్నంత కాలము మంచి పేరుతో జీవించాలి... మరణించాకా కూడా ఆ మంచి పేరు నిలచిపోవాలి.

Comments

  1. Nice చాలా బాగుంది ఇలాంటివి మరిన్ని షేర్ చేయాలని

    ReplyDelete

Post a Comment

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

ఆధునిక భారతదేశ చరిత్ర top 30 bits....

1. భగత్ సింగ్‌కు మరణశిక్ష విధించిన న్యాయమూర్తి ఎవరు?  జ: GC హిల్టన్  2. మహాత్మా గాంధీ రాజకీయ గురువు ఎవరు?  జ: గోపాల్ కృష్ణ గోఖలే  3. ఏ చట్టాన్ని అప్పీల్ లేకుండా, లాయర్ లేకుండా మరియు వాదన లేకుండా చట్టం అని పిలుస్తారు.  జ: రౌలట్ చట్టం  4. దండా ఫౌజ్‌ను ఎవరు ఏర్పాటు చేశారు?  జ: చమందీవ్ (పంజాబ్)  5. పాముల దేశం అని దేనిని పిలుస్తారు?  జ: బ్రెజిల్  6. మరణశిక్ష విధించిన అతి పిన్న వయస్కుడైన విప్లవకారుడు ఎవరు?  జ: ఖుదీరామ్ బోస్  7. జలియన్ వాలాబాగ్ మారణకాండకు నిరసనగా కైసర్-ఎ-హింద్ బిరుదును ఎవరు తీసుకున్నారు? నిరాకరించారు.  జ: మహాత్మా గాంధీ  8. గదర్ పార్టీని ఎవరు స్థాపించారు?  జ: లాలా హర్దయాల్, కాశీరాం  9. ఫార్వర్డ్ బ్లాక్ సంస్థ స్థాపకుడు ఎవరు?  జ: సుభాష్ చంద్రబోస్  10. కాంగ్రెస్ ఎప్పుడు, ఏ పార్టీలలో చీలిపోయింది?  జ: 1907 మితవాదులు మరియు తీవ్రవాదులు (సూరత్ సెషన్)  11. కాంగ్రెస్ మొదటి ముస్లిం అధ్యక్షుడు ఎవరు?  జ: బద్రుద్దీన్ త్యాబ్జీ  12. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఎవరు.  జ: శివాజీ ...