ప్రశ్న: రంగుల్లో వెచ్చని రంగులు, చల్లని రంగులు, మూగ రంగులు ఉంటాయా? బ్లూలైట్ థెరపీ అంటే ఏమిటి?*
ఎరుపు, నీలం, పసుపు... ప్రాథమిక రంగులు. ఈ మూడింటిని రకరకాల నిష్పత్తుల్లో కలిపితే అనేక రంగులు వస్తాయి. ఎల్లో, మస్టర్డ్, ఆరెంజ్, లెమన్, కాకీ, ఎల్లోబ్రౌన్, బ్లాక్, రెడ్, మెజెంతా, బ్రాంజ్‌ల్ని వెచ్చని రంగులు అంటారు.
బ్లూ, పర్‌పుల్, లైట్‌బ్లూ, వైలెట్, లావెండర్ బ్లూ, లైట్ పింక్, స్కైబ్లూలు చల్లని రంగులు. టెర్రాకోటా, మస్క్‌మెలన్, పీచ్‌గ్రీన్, కోరల్, టానీ, పేల్‌లెమన్, క్రీమ్, పింకిష్ బ్రౌన్, పింకిష్ బ్లూ, రోజ్‌పింక్‌లు మూగ వర్ణాలు. నెల వయసుగల బిడ్డలకు కామెర్లు వస్తూ ఉంటాయి. తల్లిరక్తం ‘ఓ’ గ్రూపు, బిడ్డరక్తం ‘ఎ’ లేదా ‘బి’ గ్రూపు అయితే బిడ్డ ఒక ప్రమాదం ఎదుర్కోవాల్సి వస్తుంది. తల్లి రక్తం ఆర్.హెచ్ నెగిటివ్, బిడ్డరక్తం ఆర్.హెచ్ పాజిటివ్ అయినా బిడ్డ ఈ ప్రమాదానికి గురి అవుతుంది. ఇంతకీ అదేంటంటే బిడ్డ శరీరంలో ‘బిల్లీ రూబీస్’ అనే పదార్థం ఎక్కువగా తయారై రక్తం ద్వారా మెదడుకు చేరి బిడ్డకు ప్రాణ హాని కల్గిస్తుంది.
చాలాకాలం ఈ వ్యాధికి చికిత్స లేదు. ఇప్పుడు బిల్లీ రూబీస్ స్థిరత్వాన్ని దెబ్బతీసేందుకు ఒక శాస్త్రవేత్త బ్లూకలర్ లైట్‌ను ఉపయోగించాడు. ఈ రంగు కాంతికి బిల్లీ రూబీస్ ముక్కలు ముక్కలుగా విడిపోయింది. దీన్నే బ్లూలైట్ థెరపీగా మలచారు. ఒక గదిలో అనేక బ్లూ కలర్ లైట్లను అమర్చి ఆ గదిలో శిశువులను ఉంచుతారు. ఈ లైటు వారి కళ్లమీద పడకుండా వారి కళ్లకు బ్యాండేజి వేస్తారు. ఈ లైటు ప్రభావం వల్ల శిశువు శరీరంలోని బిల్లీ రూబీస్ కరిగిపోతుంది. తర్వాత అది మూత్రపిండాలను చేరి మూత్రం ద్వారా బయటకు వస్తుంది. ప్రతి రంగు దీపపు కాంతి శరీరంలో ఏదో ఒక రోగానికి చికిత్సగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
Comments
Post a Comment