Skip to main content

ఒత్తిడిని జయించడం ఎలా.. ..


ఒత్తిడి జయించడం అసాధ్యమేమీ కాదు. జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకుని ఒత్తిడిని అదుపులో ఉంచుకునే మార్గాలు అనేకం ఉన్నాయి. అవేంటంటే...

టైమ్‌ మేనేజ్‌మెంట్‌:

 ప్రాధమ్యాలను క్రమానుగుణంగా ఏర్పరుచుకోవడంలో మనం పొరపాటు పడుతూ ఉంటాం. ఏ పని ముందు చేయాలి? ఏ పనిని వాయిదా వేయవచ్చు? ఏ పని ముఖ్యం? అనే విశ్లేషణ కొరవడి, కంగారు పడిపోతూ ఉంటాం. ఈ కంగారులో ప్రాముఖ్యం లేని పనుల కోసం సమయం వృథా చేస్తాం. ఫలితంగా ముఖ్యమైన పనులకు సమయం కేటాయించలేక ఒత్తిడికి లోనవుతాం. ఇలా అనవసర ఒత్తిడికి గురి కాకుండా ఉండాలంటే పనులను ప్రాధాన్యక్రమంలో పూర్తి చేసే అలవాటు అలవరుచుకోవాలి.

ధ్యానం:

మానసిక ప్రశాంతతతో ఒత్తిడిని జయించవచ్చు. ఇందుకోసం ధ్యానం, బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజులు చేయాలి. ఒత్తిడి వల్ల మనం ఊపిరి తీసుకునే తీరు మారుతుంది. త్వరత్వరగా ఊపిరి పీల్చడం, వదలడం చేస్తాం. గాలిని కూడా శక్తి మేరకు లోపలికి పీల్చం. ఫలితంగా సరిపడా ఆక్సిజన్‌ రక్తంలో కలవదు. దాంతో మెదడు పనితీరు తగ్గుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే ఊపిరి మీద దృష్టి పెట్టాలి. రోజులో వీలైనన్నిసార్లు గుండెనిండా ఊపిరి పీల్చుకుని వదులుతూ ఉండాలి. గాలి లోపలికి పీల్చుకున్నప్పుడు కొన్ని క్షణాలు బిగించి ఉంచి, వదలడం సాధన చేయాలి.

చిన్న చిన్న ఆనందాలు:

 అదే పనిగా గంటల తరబడి పనిలో మునిగి తేలడం సరి కాదు. ఎంత పని ఒత్తిడిలో ఉన్నా మధ్యమధ్యలో కొన్ని నిమిషాలపాటు బ్రేక్‌ తీసుకోవాలి. ఆ బ్రేక్‌లో నచ్చిన వ్యక్తులతో కలిసి ఆహ్లాదంగా నవ్వుకోవాలి. నవ్వు తెప్పించే పుస్తకం తిరగేయాలి. అవేవీ వీలు కాకపోతే కొన్ని నిమిషాలు నడవాలి.

సంగీతం వినాలి:

 ఒత్తిడిని తొలగించే సాధనాల్లో సంగీతం ఒకటి. కాబట్టి నచ్చిన పాటలతో ప్లే లిస్ట్‌ తయారు చేసుకుని తీరిక వేళల్లో వినాలి. సమయం చిక్కినప్పుడల్లా ఆహ్లాదం కలిగించే పాటలు వినడం వల్ల మనసు తేలిక అవుతుంది. ఫలితంగా ఒత్తిడి వదులుతుంది.

సామర్థ్యానికి తగ్గట్టు:

ఒకే సారి రెండు పడవల మీద కాళ్లు మోపితే నిలువునా మునిగిపోతాం. అన్ని పనులూ ఒకేసారి తలకెత్తుకున్నా అదే జరుగుతుంది. మల్టీ టాస్కింగ్‌ చేసి హీరో అనిపించుకోవాలనే తాపత్రయంతో, ఒకేసారి ఎక్కువ పనులకు పూనుకుంటే ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి ఏ సమయానికి ఎంత పని సమర్థంగా పూర్తి చేయగలమో, ఆ స్పష్టతతో ముందుకు సాగాలి.

వ్యాయామం:

 వ్యాయామంతో ఎండార్ఫిన్లు అనే ఒత్తిడిని తొలగించే హార్మోన్లు విడుదల అవుతాయి. కాబట్టి ప్రతి రోజూ వ్యాయామం చేయాలి. వ్యాయామం వల్ల శక్తి పెరగడంతోపాటు సామర్ధ్యమూ రెట్టింపవుతుంది. ఈత, పరుగు, సైక్లింగ్‌ లాంటి వ్యాయామాలతో గుండె కొట్టుకునే వేగం పెరగడం వల్ల చురుకుదనం కూడా పెరుగుతుంది. శారీరక ధృఢత్వంతోపాటు మానసిక సాంత్వన కూడా దక్కుతుంది.నిద్ర అవసరం: సరిపడా నిద్ర పోకపోతే, మెదడు చురుకుదనం తగ్గుతుంది. దాంతో చిన్న పని కూడా కష్టంగా తోస్తుంది. ఫలితంగా ఒత్తిడీ పెరుగుతుంది. ఇదే ఒత్తిడి కొనసాగితే రాత్రివేళ నిద్ర కరవవుతుంది. ఇలా ఈ స్థితి ఓ చట్రంలా కొనసాగుతుంది. కాబట్టి దీన్ని బ్రేక్‌ చేస్తూ రోజుకు 8 గంటలపాటు నిద్ర పోవడం అలవాటు చేసుకోవాలి.

గ్యాడ్జెట్స్‌:

 మెసేజ్‌లు, మెయిల్స్‌, ఫోన్‌కాల్స్‌, టీవీ శబ్దాలు....వీటిన్నిటి నుంచి కూడా అప్పుడప్పుడూ బ్రేక్‌ తీసుకోండి. ఎంతో కొంత సమయం టీవీ కట్టేయండి. సెల్‌ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేయండి. కంప్యూటర్‌ ఆపేయండి. ఆ నిశ్శబ్దంలో పరిసరాల శబ్దాలను ఆస్వాదించండి. ఒంటరితనాన్ని మనసులోకి తొంగి చూసుకోవడానికి కేటాయించండి. ఇలా అరుదుగానైనా చేస్తూ ఉండడం ఎంతో అవసరం.

Comments

  1. Replies
    1. ధన్యవాదాలు మిత్రమా... మీ సపోర్ట్ మాకు ఎల్లప్పుడూ ఉండాలి... మిత్రమా...

      Delete

Post a Comment

Popular posts

TET అభ్యర్థులకు ఉపయోగకరమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్

TET పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఒక ప్రత్యేకమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో మీరు ఎన్ని సార్లైనా పరీక్ష రాయవచ్చు. ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం రూపొందించబడటం దీని ప్రత్యేకత. ఈ మాక్ టెస్టులు విస్తృతమైన ప్రశ్నల బ్యాంక్ ఆధారంగా రూపొందించబడుతున్నందున, ప్రతి పరీక్షలో భిన్నమైన ప్రశ్నలు ఎదురవుతాయి. దీనివల్ల ఒకే రకమైన ప్రశ్నలు పదేపదే రావడం తగ్గి, అభ్యర్థులు వివిధ అంశాలపై మెరుగైన అవగాహన పెంపొందించుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా: • అపరిమిత సంఖ్యలో మాక్ టెస్టులు రాయవచ్చు. • ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం లభిస్తుంది. • విభిన్న అంశాలపై ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. • పరీక్షా సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. • మీ బలాలు, బలహీనతలను గుర్తించి వాటిపై మరింత దృష్టి పెట్టవచ్చు. • కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు అలవాటు పడేందుకు ఇది ఉపయోగపడుతుంది. • కంప్యూటర్ వినియోగంలో అనుభవం తక్కువగా ఉన్న అభ్యర్థులు కూడా ముందుగానే ప్రాక్టీస్ చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. నిరంతరంగా మాక్ టెస్టులు రాయడం ద్వారా పరీక్షా భయం తగ్గి, నిజమైన TET పరీక్షలో ...

AP 2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు

2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు.  https://cse.ap.gov.in/loadacademictextbookpublicview?random=0.6384777802675639 Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺