అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో చాలాచోట్ల వడదెబ్బ మరణాలు పెరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పోస్టర్ల రూపకల్పన.
వడదెబ్బ తగలకుండా..
👇🏻👇🏻👇🏻
వేడిగాలులు వీస్తున్నప్పుడు ఎండలో తిరగకూడదు.
బయటకు వెళ్లాల్సి వస్తే సురక్షితమైన తాగునీరు తాగాలి.
తలకు టోపీ, చెవులు, ముక్కును కవర్ చేస్తూ కాటన్ మాస్క్ ధరించాలి.
మాంసాహార ప్రియులు సాధ్యమైనంత వరకు వాటికి దూరంగానే ఉండి ఆరోగ్యాన్నిచ్చే తాజా కూరగాయలను వినియోగించాలి.
మజ్జిగ, కొబ్బరినీళ్లు, చెరకు రసం, నిమ్మకాయనీళ్లు, ఓఆర్‌ఎస్ వంటి వాటిని ఆరారా తీసుకోవాలి.
ఇంటి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా కూడా దోమల బారిన పడకుండా ఉండవచ్చు.
వడదెబ్బ తగిలితే...
👇🏻👇🏻👇🏻
వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే నీడ ప్రదేశానికి తీసుకువెళ్లి కూలింగ్ వాటర్‌లో ముంచిన గుడ్డతో శరీరం అంతా తుడడాలి.
శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చే వరకు ఈ విధంగా చేయాలి.
చల్లగాలి తగిలేలా జాగ్రత్తపడాలి.
ఉప్పు కలిపిన మజ్జిగ, చిటికెడు ఉప్పు కలిపిన గ్లూకోజ్ ద్రావకం లేదా ఓరల్ డీహైడ్రేషన్ ద్రావకం తాగించాలి.
వడదెబ్బ తగిలిన వ్యక్తి అపస్మారక స్థితిలో ఉంటే నీరు తాగించకుండా దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం/ఆసుపత్రికి తరలించాలి.
Comments
Post a Comment