ఉత్తములకీ మనకీ తేడా !
మనలో చాలామందిమి అనుకుంటాం " నేను అతడికి సహాయం చేస్తే నాకేమిటి ప్రయోజనం ?"
అతడు అనుకున్నాడు " నేను సహాయ పడకపోతే వాళ్ళకి ఎవరు సహాయ పడతారు ? అని
జరిగిన కధ !
స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ లో 1892 లో జరిగిన వాస్తవం.
18 సంవత్సరాల ఆ యువకుడు ఫీజులు కట్టలేక ఏమి చెయ్యాలో తెలీని స్థితిలో ఉన్నాడు . అతడు తల్లి తండ్రులు లేని అనాధ !
అతడూ అతడి స్నేహితుడూ కలిసి ఒక పధకం ఆలోచించారు . వాళ్ళ యూనివర్సిటీ లో ఒక సంగీత కచేరీ ఏర్పాటు చేద్దామనీ , అందులో ఖర్చులు పోను మిగీన దానితో తమ ఫీజులు కట్టెయ్యవచ్చు అనీ నిర్ణయించుకున్నారు.
అప్పట్లో గొప్ప పియానో వాద్య కారుడు
Ignace J.Paderewski. వద్దకు వెళ్ళారు.ఆయన మేనేజరు ఫీజు రూపం లో 2000 డాలర్లు కనీస మొత్తం గా ఇవ్వాలనీ,ఆ పైన ఇతర ఖర్చులు అనీ ఒప్పదం చేసుకున్నారు.వీళ్ళు అంగీకరించారు.టికెట్లు అమ్మడం సాగించారు . అనుకున్న రోజు వచ్చింది . ప్రోగ్రాం అద్భుతం గా జరిగింది . అయితే వీళ్ళు అనుకున్నట్టు వసూళ్లు రాలేదు.మొత్తం 1600 డాలర్లు మాత్రమె వచ్చింది
వాళ్ళు Paderewski. దగ్గరకు వెళ్ళారు . వసూలు అయిన మొత్తమూ,400 డాలర్లకు చేక్కూ పట్టుకు వెళ్లి జరిగిన మొత్తం విషయం చెప్పారు . సాధ్యమయినంత త్వందరలో ఆ మిగిలిన సొమ్ము చెల్లిస్తాము అనీ,క్షమించమనీ అన్నారు
వాళ్ళ గురించి Paderewski. కి తెలీదు . ఆయన వాళ్ళని అతకు ముందు చూడలేదు . ఆయన ఆ చెక్కును చింపేశాడు . . 1600 డాలర్లూ వాళ్ళ చేతిలో పెడుతూ వాళ్ళతో ఆయన ఇలా అన్నాడు
" మీకు అయిన ఖర్చులు ఎంతో లెక్క పెట్టుకోండి . మీ ఫీజులకు ఎంతో అవుతోందో అది కూడా ఇందులో నుండి మినహాయించుకోండి . ఏమైనా మిగిలితే ఆ మిగిలిన సొమ్ము నాకు ఇవ్వండి "
ఈ సంఘటన Paderewski మానవతను చాటి చెబుతుంది . తనకు తెలీని , తనకు ఏమీకాని , వారి వలన ఎటువంటి ప్రయోజనమూ ఆశించకుండా తన శ్రమనూ , తన ఆదాయాన్నీ ఇవ్వడం Paderewski హృదయం గురించి చెబుతోంది కదూ!
మనలో చాలామందిమి అనుకుంటాం " నేను అతడికి సహాయం చేస్తే నాకేమిటి ప్రయోజనం?"
అతడు అనుకున్నాడు " నేను సహాయ పడకపోతే వాళ్ళకి ఎవరు సహాయ పడతారు ? అని
అదే ఉత్తములకీ మనకీ తేడా !
ఇది ఇక్కడితో ఆగిపోలేదు
Paderewski తర్వాతి కాలం లో పోలాండ్ ప్రధాని అయ్యారు.
రెండో ప్రపంచ యుద్ధం లో పోలాండ్ సర్వ నాశనం అయిపొయింది.15 లక్షల మంది ఆకలితో అలమటించే స్థితికి చేరారు
Paderewski కి ఏమి చెయ్యాలో తోచలేదు . ఎవరిని అడగాలో తోచలేదు . చివరికి అమెరకా ఆహార , పునరావాస విభాగాన్ని సంప్రదించాడు
దానికి అధిపతి Herbert Hoover . ఇతడే తర్వాత అమెరికా అధ్యక్షుడు కూడా అయ్యాడు . అతడు వెంటనే ప్రతిస్పందించాడు . టన్నులకొద్దీ ఆహార పదార్ధాలు పోలాండ్ కు సరపరా జరిగింది. పోలాండ్ లో ఆహార సంక్షోభం నివారించబడింది
Herbert Hoover చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పడానికి Paderewski అమెరికా వెళ్లి హూవర్ ను కలిశాడు . కృతజ్ఞతలు చెబుతూ ఉండగా హోవర్ అన్నాడు*
కొన్ని సంవత్సరాల క్రితం మీరు కాలేజీ ఫీజులు కట్టలేని ఇద్దరు యువకులకు సహాయం చేశారు .వారిలో నేను ఒకడిని
ఈ ప్రపంచం ఒక అద్భుతమైన విషయం
నీవు ఏది ఇస్తావో అది నీవు అనేక రెట్లు పొందుతావు అనే గీతా సారం ఇది
The world is a wonderful place. What goes around usually comes around.
Comments
Post a Comment