Skip to main content

నేటి మోటివేషన్.....


ఒక అడవి లో ఒక లేడి భారంగా అడుగులు వేస్తూ వెళ్తోంది. అది నిండు గర్భిణి. దానికి అప్పుడే నొప్పులు వస్తున్నాయి.అది అనుకూలమైన ప్రదేశం కోసం వెతుకు తోంది. ఒక దట్టమైన గడ్డి భూమి కనబడింది. దానికి అటుపక్క నది ప్రవహిస్తోంది. అదే అనుకూలమైన ప్రదేశం అనుకుంది. నొప్పులు మొదలయ్యాయి. నిట్టూర్పులు విడుస్తూ అటూ ఇటూ తిరుగుతోంది.. అప్పుడే దట్టమైన మబ్బులు కమ్మాయి. ఉరుములు, పిడుగులు.. పిడుగు పడి కొద్ది దూరం లోనే గడ్డి అంటుకుంది. దూరంగా తన ఉనికిని గమనించి కుడి వైపు నుండి ఒక సింహం వస్తోంది. ఎడమవైపు నుండి ఒక వేటగాడు బాణం సరి చూసుకుంటున్నాడు. ఇంకో వైపు నది వెళ్ళనివ్వదు...!

లేడి బిడ్డకు జన్మ ఇస్తుందా..? బిడ్డ బతుకుతుందా..? సింహం లేడిని తినేస్తుందా..?

వేటగాడు లేడిని చంపెస్తాడా..? నిప్పు లేడి వరకూ వచ్చి లేడి కూనను చంపేస్తుందా..?

ఒకవైపు నిప్పు.. రెండో వైపు నది.. మిగిలిన రెండు వైపులా మృత్యువు రూపం లో వేటగాడు, సింహం..

కానీ లేడి మాత్రం ఇవేవీ పట్టించుకోలేదు. అది తన బిడ్డను కనడం మీదే దృష్టి పెట్టింది..

అప్పుడు పరిణామాలు ఇలా జరిగాయి. పిడుగు కాంతికి వేటగాడి కళ్ళు చెదిరాయి.. గురి తప్పి బాణం సింహానికి తగిలింది..

వర్షం పడి సమీపిస్తున్న మంటలు ఆరిపోయాయి..

లేడి పిల్ల తల్లి గర్భం లో నుండిబయటకు వచ్చింది. అది ఆరోగ్యాంగా వుంది. ఏదైతే జరగనీ, నేను బిడ్డకు జన్మనివ్వడం మీదనే దృష్టి పెడతాను అని.. లేడీ అనుకోకుండా ప్రాణం గురించి ఆలోచించి తప్పటడుగు వేసి వుండి వుంటే ఏమి జరిగేది..??


మన జీవితాలలో కూడా అన్ని వైపులా సమస్యలు చుట్టూ ముడుతూనే వుంటాయి. నెగటివ్ ఆలోచనలతో సతమవుతూనే ఉంటాము.. మన తక్షణ కర్తవ్యాన్ని విస్మరిస్తాము. ఈ కాలంలో పిల్లలు చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కొంత మంది సమస్యలను ఎదుర్కోనలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. ఆత్మవిశ్వాసముతో, ధైర్యముతో, ధృఢనిశ్చయముతో, చేసే పనిపై దృష్టి పెడితే విజయం తథ్యము అని చెప్పొచ్చు.

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం జారీ చేసిన G.O.MS.No.2 – సమగ్ర ఆదేశాలు

ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.MS.No.2 ద్వారా తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు 2025 జనవరి 6న అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, మాతృత్వ సెలవులు, ఎక్స్‌గ్రేషియా వంటి అంశాలను స్పష్టంగా చర్చించాయి. ఈ ఆదేశాలలో ఉన్న ముఖ్యాంశాలు, పాజిటివ్ మరియు నెగటివ్ అంశాలను ఈ వ్యాసంలో విశ్లేషించబడింది. ముఖ్యాంశాలు: 1.MTS: ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, మరియు సమాజాల్లో ఖాళీగా ఉన్న నిబంధిత పోస్టులపై నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే న్యూనత పేస్కేల్ వర్తిస్తుంది. MTS ద్వారా నెలవారీ చెల్లింపులు కలిపి ఒకే రూపంలో అందిస్తారు. అయితే, ఈ పేమెంట్‌లో అదనపు అలవెన్స్‌లు, వార్షిక పెంపులు ఉండవు. 2. మాతృత్వ సెలవులు: వివాహిత మహిళా ఉద్యోగులకు రెండు ప్రసవాలకు 180 రోజుల చెల్లింపు మాతృత్వ సెలవు కల్పించడం ఈ ఉత్తర్వుల్లో ప్రధానమైన పాజిటివ్ అంశం. ఈ కాలంలో EPF, ESI వంటి అన్ని ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. 3. ఎక్స్‌గ్రేషియా: అపఘాత మృతి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, సహజ మృతికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించ...

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺