◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
🙏అమ్మ🙏
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
నాకు తెలిసిన తొలి ప్రపంచ సుందరి మా అమ్మ
నాకు తెలిసిన తొలి మమతల కొలువు మా అమ్మ ఒడి
భువిని తాకిన తొలి స్పర్షా కిరణం అమ్మ...
మనస్సుని సుతి మెత్తగా తాకే చల్లని సమీరం అమ్మ...
వెచ్చని ఊపిరి అమ్మ...
నిర్మలమైన నిలువెత్తు రూపం అమ్మ
మాతృ గర్భంలో సుతి మెత్తని పాదాలతో నేను తెలియక గాయ పరుస్తూ ఉంటే....
మరణ వేదనను సైతం
ముని పంటితో నొక్కి పెట్టి
చిరునవ్వుతో....
నాన్నా ఇంకా సమయం ఉంది అంటూ నాతో కబుర్లు చెపుతుంటే ....
నాడు నాకు తెలియలేదు...
నేను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని...
తన ఊపిరిని కూడా నేను లాక్కుని నేను అల్లరి చేస్తుంటే....
ఊపిరి బిగబట్టి నా కోసం ఈ ప్రపంచాన్ని జయించి నను బ్రతికిస్తుంటే....
నాడు నాకు తెలియలేదు...
ఊపిరులు ఊది సాటి ప్రాణాన్ని ఎలా నిలబెట్టాలో నేర్పుతుందని...
తన పాదాలపై నన్ను నిలబెట్టుకుని నడిపిస్తుంటే...
నాడు తెలియలేదు నాకు...
ఈ విశాల ప్రపంచంలో...
ఎక్కడ..
ఎలా..
జాగ్రత్తగా అడుగులు వేయాలో నేర్పుతుందని.....
ఏనుగు అంబారీగా మారి తన వీపుపై ఎక్కించుకుని మురిసి పోతుంటే.....
నాకు నాడు తెలియలేదు...
ఈ ప్రపంచానికి నన్నొక మహా రాజుగా పరిచయం చేస్తుందని.....
వేలు పట్టుకుని నడిపిస్తుంటే....
నాడు నాకు తెలియలేదు...
ఎలాంటి సమస్యను అయినా ధీమాగా ఎదుర్కొనే భరోసాను నాకు ఇస్తుందని......
ముద్దులతో బుద్ధులు చెబుతుంటే.....
నాడు నాకు తెలియలేదు...
నన్నొక మనసున్న మనిషిగా మలుస్తుందని....
కొండంత ఆపద నా ఎదురుగా ఉన్నపుడు...
నాడు నాకు తెలియలేదు...
అల్లంత దూరంలో నా తల్లి నిలబడి నాకు కొండంత ఆత్మ విశ్వాసాన్ని అందించిందని....
నేను ఈ ప్రపంచాన్ని గెలిచే సమయంలో..
నా కంటి వెలుగులో దాగుండి....
నేను నిరాశగా ఉన్న సమయంలో వెలుగు రేఖగా మారి తను దారి చూపిస్తుంటే....
నాడు నాకు తెలియలేదు...
కష్ట సుఖాలను ఎదుర్కోవడంలో నన్ను నిష్ణాతుడిని చేస్తుoదని...
నలత గా ఉండి అచేతనంగా పడి ఉన్న నన్ను తన హృదయానికి హత్తుకున్నపుడు...
నాడు నాకు తెలియలేదు..
తన అనుకునేవారి కోసం సూరీడులా మారి చీకటిని జయించడం నాకు నేర్పుతుందని.....
పలక బలపంతో అమ్మ నన్ను బడికి పంపిన సమయంలో.....
నాడు నాకు తెలియలేదు...
గోరు ముద్దల బడి నుండి బ్రతుకు బడికి నన్ను దగ్గర చేస్తుందని....
ఎదిగే క్రమంలో...
ఈ ప్రపంచంలో ఒదిగే సమయంలో అమ్మ ఆలోచన నన్ను నడిపిస్తుంటే....
నాడు నాకు తెలియలేదు....విజ్ఞాన అన్వేషణలో నాకు తెలియకుండానే ఆమెకు దూరం అవుతున్నానని....
తన కంటి కొనల మధ్య...
కన్నీటి పొరల మధ్య నా జ్ఞాపకాలను దాచుకుని నన్ను వెన్నుతట్టి ప్రోత్సహిస్తుంటే...
నాడు నాకు తెలియలేదు
ప్రపంచాన్ని నాకు పరి చయం చేయడానికి కష్టాల బడబాగ్నుల్ని తనలో దాచుకుందని....
లెక్కలేని బాధ్యతల మధ్య...
అంతులేని ఆవేదన మధ్య...
అలు పెరుగని శ్రమ మధ్య నన్ను కంటికి రెప్పలా కాపాడుతుంటే.....
నాడు నాకు తెలియలేదు...
ఈ ప్రపంచానికి నన్నొక వీరుడి గా పరిచయం చేయడానికి తానొక కర్మాగారంగా మారిందని....
అమ్మంటే ఓ సత్యం...
నాన్నంటే ఒక నమ్మకం...
తను చెప్తేనే తెలుస్తుంది నాన్న ఎవరో...
అలాంటి నిలువెత్తు నమ్మకానికి నేను ఏమి ఇవ్వగలను?
చిరునవ్వుల దోసిల్లో పెట్టి
నా ప్రాణాన్ని ఇవ్వడం తప్ప...
వీలుంటే మరలా జన్మకు తన కొడుకుగా పుడతాను...
కాదు...
కాదు...
తనకు నేనొక అమ్మగా పుడతాను....
వెచ్చని బంధాన్ని అవుతాను...
వేలు పట్టుకుని మనతో నడిచి వచ్చే బంధాలు ఎన్నో ఉన్నా...
వేలు పట్టుకుని నడిపించే బంధాన్ని....
మీకు వీలు అయితే ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి.....
మీ కోసం కళ్ళలో ఒత్తులు వేసుకుని మీ కోసం ఆరాటపడే మాతృ హృదయాన్ని...
మనసారా ఒక్కసారి పలకరించండి...
మీ
కె.వి.కృష్ణా రెడ్డి
నాగులాపల్లి
97043 34519
మీ రాతలకి నా పాదాభివందనం గురూజీ🙏🙏🙏
Mathru devo bhava
ReplyDelete