🚀పీఎస్‌ఎల్వీ సీ46 రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది.
🚀నెల్లూరు జిల్లాలోని షార్ కేంద్రంలో ప్రథమ ప్రయోగ వేదిక నుంచి బుధవారం ఉదయం 5.30 నిమిషాలకు ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.
🚀ఈ ప్రయోగం ద్వారా దేశ సరిహద్దుల్లో ఉగ్రవాద స్థావరాలు, వారి కదలికలపై నిశిత దృష్టి సారించే రీశాట్-2 బీఆర్1 ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు కక్ష్యలో ప్రవేశపెట్టారు.
🚀ఈ రాకెట్ ద్వారా 615 కిలోల బరువైన రాడార్ ఇమేజింగ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ రీశాట్-2బీని భూమికి 557 కిలోమీటర్ల ఎత్తులో, భూమధ్య రేఖకు 37డిగ్రీల వాలులో సూర్యానువర్తన కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
🚀దీని కాలపరిమితి ఐదు సంవత్సరాలు.
🚀ఈ ప్రయోగానికి ఇస్రో 48వ సారి పీఎస్‌ఎల్వీని ఉపయోగించింది.
🚀అయితే బూస్టర్లు లేకుండా పీఎస్‌ఎల్వీ కోర్ అలోన్ తరహా రాకెట్‌ను 14వసారి వినియోగించడం విశేషం.
*🔹ఇవీ ఉపయోగాలు*
➡రీశాట్-2బీ ఉపగ్రహంలో ఉన్న ఎక్స్‌బాండ్ రాడార్ దేశ సరిహద్దులను అనుక్షణం పహారా కాస్తూ ఉగ్రవాద శిబిరాలు, వారి కదలికలను ఎప్పటికప్పుడు పసిగడుతూ ఛాయాచిత్రాలు సహా సమాచారాన్ని అందజేయనుంది.
➡అలాగే పనిలో పనిగా దేశ వ్యవసాయ, అటవీ రంగాలపై సమగ్ర సమాచారాన్నీ అందించనుంది.
➡ప్రకృతి వైపరీత్య సమయాల్లో సహాయకారిగా నిలవనుంది.
➡ఈ ఉపగ్రహం ఐదేళ్ల పాటు పని చేసేలా ఇస్రో రూపొందించింది.
Comments
Post a Comment