ప్రశ్న: సూక్ష్మ జీవుల నుంచి బంగారం, ఇంధనం లభిస్తుందని విన్నాను. నిజమేనా?
కాలువల్లో ప్రవహించే నీటిని జల్లెడ పట్టి బంగారాన్ని తీయడం మనందరికీ తెలిసిన విషయమే. ఈ విధంగా లభించే పసిడిని ‘ప్లేనర్ గోల్డ్’ అంటారు. అతి సూక్ష్మమైన రేణువుల రూపంలో ఉండే ఇది పాక్షికంగా సూక్ష్మ క్రిముల రసాయనిక ప్రక్రియ ద్వారా రూపొందిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
మైక్రోస్కోపు కింద ఈ ప్లేనర్ గోల్డ్ రేణువుల్ని పరిశీలించి చూస్తే అవి ‘పెడో మైక్రోబియమ్’ అనే అతి సాధారణమైన సూక్ష్మ క్రిముల రూపంలో ఉన్నట్లు గుర్తించారు. వీటి ఉపరితలం పైకి బంగారం ఎలా చేరిందనేది శాస్త్రవేత్తలకు తెలియడం లేదు. నశించిపోయిన సూక్ష్మ జీవుల శేషంగా మిగిలే రసాయన పదార్థాలు కొన్ని ఆమ్లాలుగా మారి ఉండొచ్చుఅని వీరి అభిప్రాయం. బ్యాక్టీరియా కణాల వెలుపల జరిగే ఎంజైమ్ చర్యల వల్ల కూడా బంగారం తయారై ఉండొచ్చు. ఈ సూక్ష్మ జీవుల సహాయంతో ఒక మిల్లీ మీటరుండే బంగారు రేణువు తయారు కావడానికి ఒక సంవత్సరం మించి సమయం పట్టవచ్చు. అందువల్ల ఈ పద్ధతిలో ఎవరూ ధనికులు కాలేరు.
సూక్ష్మ జీవుల సహాయంతో మన వాహనాలు నడిచేందుకు కావాల్సిన ఇంధనాన్ని తయారు చేసేందుకు మన శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఈ పద్ధతిలో రెండు దశలు ఉంటాయి. మొదటి దశలో సూక్ష్మ జీవులు వాతావరణంలోని కార్బన్‌డైఆక్సైడ్‌ను అంగారక సమ్మేళనాలుగా మారుస్తాయి. ఆ తర్వాత దశలో ఈ అంగారక సమ్మేళనాలను లిపిడ్ ఎక్యుములేటర్స్ తింటాయి. అప్పుడు వాటి శరీరం అంతా నూనెతో ఉబ్బుతుంది. వీటి శరీరంలో ఉన్న నూనె సరిగ్గా మనకు లభిస్తున్న క్రూడాయిల్ మాదిరిగా ఉంటుంది. అందుకే వీటి శరీరంలోని నూనెను సేకరించి శుద్ధి చేసి వాహనాలకు
ఇంధనంగా వాడుకోవచ్చు.
ఇంధనంగా వాడుకోవచ్చు.
Comments
Post a Comment