హెల్త్ టిప్
అతి మూత్రానికి ఆహారచికిత్సలు
---------------------------------------------
అతి మూత్ర సమస్య మొదలు కాగానే ఒకటి లేక రెండు వారాల పాటు మెంతికూర ఆకురసం 25 గ్రా మోతాదుగా సేవించడం మొదలు పెడితే అతిమూత్రం అదుపులోకి వస్తుంది. దీనివల్ల అమాశయం కూడా శుద్ధిచెందుతుంది.

రోజూ ఉదయం, సాయంత్రం భోజనం తరువాత ఒకగంట ఆగి ఒకటి లేక రెండు అరటి పండ్లు తింటూ ఉంటే మూత్ర సమస్యలు నివారించబడుతుంది.
ఆహారానికి ఒకటి లేక రెండుగంటల ముందు మంచి
మేలురకమైన ఒక ఆపిల్ పండు రెండు పూటలా తింటూ ఉంటే అతి మూత్రం అదుపు చేయబడుతుంది
మేలురకమైన ఒక ఆపిల్ పండు రెండు పూటలా తింటూ ఉంటే అతి మూత్రం అదుపు చేయబడుతుంది
రాత్రిపూట అరగ్లాసు మంచినీటిలో నాలుగైదు ఎండు అంజూర ముక్కలు శుభ్రంగా కడిగి నానబెట్టి ఉదయం ఆ ముక్కలుఒక్కొక్కటే నిదానంగా బాగా నమిలి తిని ఆ నానిన నీళ్ళు కూడా వడపోసుకొని తాగుతూ ఉండాలి. దీని వల్ల అతి మూత్రం అదుపులోకి రావడమేకాక రక్తహీనత, నీరసం, బలహీనత, గుండెదడ, భయం, ఆందోళన మొదలైన సమస్య నివారించబడి రక్తశుద్ధి, రక్తవృద్ధిజరుగుతాయి.
రాత్రి ఆహారం లో పాలకూర తింటూ ఉంటే అతి మూత్రరోగులకు మేలు కలుగుతుంది.
అతిమూత్రసమస్యగలవారు మంచిశనగలను వేయించుకొని 50 గ్రా మోతాదుగా రెండు పూటలా తిని దాని వెంట కొంచెంబెల్లం కూడా తినాలి. దీనివల్ల అతిగా మూత్రం రావడం తగ్గుతుంది.
నల్లనువ్వులు, పాతబెల్లం కలిపి తయారుచేసిన నువ్వుల ఉండలు పొద్దున, సాయంత్రం ఆనందంగా తింటూ ఉంటే అతిమూత్రం తగ్గడమే కాక శరీరమంతా శక్తివంతమవుతుంది.
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment