Skip to main content

భూమి నుంచి పైకి పోయే కొలదీ వేడి తగ్గిపోతూ ఉంటుందంటారు. ఎందువల్ల?


సూర్యకిరణాలు వాతావరణం గుండా ప్రయాణించి భూమిని చేరుతాయనేది తెలిసిందే. వాతావరణంలోని గాలి లోంచి కిరణాలు ప్రయాణించినప్పటికీ గాలి స్వల్పశోషణం (poor absorber) కాబట్టి, వాటిలోని వేడిని అంతగా గ్రహించలేదు. గాలి కంటే భూమి వేడిని ఎక్కువగా గ్రహిస్తుంది. భూమి వేడెక్కడం వల్ల దానిని అంటిపెట్టుకున్న గాలి ఉష్ణోగ్రత పెరుగుతుంది. అలా వేడెక్కిన గాలి సాంద్రత తగ్గుతుంది. దాంతో ఆ గాలి తేలికయి భూమి నుంచి ఎత్తుకు ప్రయాణిస్తుంది. భూమి నుంచి ఎత్తుకు వెళ్లే కొలదీ వాతావరణ పీడనం తగ్గుతుంది. అందువల్ల ఆ ప్రాంతంలోకి వెళ్లిన వేడిగాలి అక్కడ వ్యాకోచిస్తుంది. ఏ వాయువైనా వ్యాకోచిస్తే దాని ఉష్ణోగ్రత తగ్గుతుంది కాబట్టి అక్కడకు వెళ్లిన గాలి చల్లబడుతుంది.

ఈ విధంగా భూమి నుంచి పైపైకి పోయే గాలి ఉష్ణోగ్రత ప్రతి కిలోమీటరుకు 9 డిగ్రీల సెంటిగ్రేడు వరకు తగ్గుతుంటుంది. అందువల్లనే వేసవి కాలంలో ఎత్తుగా ఉండే ప్రదేశాలైన ఊటీ, డార్జిలింగ్‌ లాంటి పర్వత ప్రదేశాలలో వాతావరణం చల్లగా ఉంటుంది. కానీ భూమి నుంచి 40 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఎత్తుకు వెళితే అక్కడ మళ్లీ వేడిగానే ఉంటుంది. ఎందుకంటే భూమి ద్వారా వేడెక్కి పైకి వెళుతూ వ్యాకోచించి చల్లబడే గాలి అంత ఎత్తుకు చేరుకోలేదు.

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

డిగ్రీ , బీటెక్ ఫస్ట్ ఇయర్ చదివే అమ్మాయిలు సంతూర్ స్కాలర్షిప్

👉 టెన్త్ , ఇంటర్ గవర్నమెంట్ కాలేజ్ లలో చదివి ఉండాలి  👉 స్కాలర్షిప్ అమౌంట్ : 30000 👉 ఈ స్కాలర్షిప్ ఆంధ్రప్రదేశ్ , మహారాష్ట్ర విద్యార్థులకు మాత్రమే ఇస్తారు.  కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి 👉 పూర్తి వివరాలు  https://www.buddy4study.com/page/santoor-scholarship-programme 👇 ఎలా అప్లై చేసుకోవాలి 👇 https://www.instagram.com/reel/DPfWwGoE6LI/?igsh=Nmhxd3NiZXZka2Jo 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ