Skip to main content

నేటి మోటివేషన్...


ఒక రాజ్యం లో ఒక బిచ్చగాడు ఉండేవాడు.

 అతను రాజభవంతి దగ్గరలో ఉంటూ రోజూ, ఆ భవంతిలోని రాజుగారిని దూరం నుండి చూస్తూ  ఉండేవాడు. 

ఒకరోజు రాజుగారు అందరికీ  విందు ఇస్తున్నారు అనేవార్త  విన్నాడు.  

ఇది విన్న ఆ బిచ్చగాడికి ఒక ఆశ పుట్టింది.  

తన దుస్తులు చూసుకున్నాడు అన్ని చిరిగిపోయాయి. 

 ఎలాగైనా రాజుగారి నుండి మంచి  దుస్తులు  సంపాదించాలని అనుకున్నాడు.

రాజభవనము  దగ్గరకి వెళ్లి కాపలా వారిని బ్రతిమిలాడి, దర్బారులోకి ప్రవేశము సంపాదించాడు. 

ఎంతో ధైర్యం కూడగట్టుకొని , చాలా  వినయంగా రాజు దర్భారులోకి ప్రవేశించాడు. 

అతన్ని చూడగానే రాజు. “నీకేమి కావాలి” అని అడిగాడు .దానికి ఆ బిచ్చగాడు రాజు గారికి వంగి వంగి దండాలు పెడుతూ ఇట్లా అన్నాడు. “రాజా! నాకు  మీరు ఇస్తున్న విందుకు రావాలని వుంది. దయచేసి తమ పాత  దుస్తులు ఇప్పిస్తే అవి ధరించి విందుకు వస్తాను. నా  దగ్గర చినిగిన బట్టలు మాత్రమే ఉన్నాయి.

రాజుగారు వెంటనే తన పాత  దుస్తులను  తెప్పించి బిచ్చగాడికిస్తూ “ఈ దుస్తులు చినిగిపోవు, మాసిపోవు వాటిపై దుమ్ము పడదు ,ఎందుకంటే ఇవి ఎంతో ప్రత్యేకమైనవి. నీవు ఎప్పటికి వీటిని ధరించవచ్చు”.  అన్నాడు.  

బిచ్చగాడి ,కళ్ళ వెంట నీరు రాగా రాజుగారికి ధన్యవాదములు చెప్పాడు.

 ఆ దుస్తులు తన గదికి తెచ్చుకొని  ధరించి  అద్దములో చూచుకొని  మురిసిపోయాడు బిచ్చగాడు . 

అయితే రాజు గారు ఎంత చెప్పినా, బిచ్చగాడికి ఆ రాజూ గారి  దుస్తులు చినిగిపోతే ఎట్లా అనే భయం పట్టుకొంది ...

 ఎందుకైనా మంచిదని పాతదుస్తులన్నీ ఒక మూట కట్టి తనవెంట త్రిప్పేవాడు. 

రాజా దుస్తులు చినిగితే తన పాత దుస్తులు ధరించవచ్చు అని.

  రాజుగారిచ్చిన విందు భోంచేస్తున్నంతసేపు  ఆనందంగా  లేదు.  బైట  ఎక్కడో దాచిన తన పాత  దుస్తుల మూట ఎవరన్నా  ఎక్కడన్నా   పారవేస్తారేమో అని భయం.

 క్రమంగా  రాజుగారి మాటలలోని సత్యం తెలిసివచ్చింది . ఎన్ని రోజులు ధరించినా  దుమ్ము పడలేదు . కొత్తవిగానే వున్నాయి. కానీ తన పాత  దుస్తులపై  మమకారంతో  ఆ మూట వదిలేవాడు కాదు. అతని తోటి వారు అతనిని చూసి, ధరించిందేమో రాజు దుస్తులు మోసేదెమో  పాత గుడ్డలు అని హేళన చేస్తూ ,  “పీలిక గుడ్డల మనిషి ” అని పేరు పెట్టారు.  చివరగా ఆ బిచ్చగాడు చనిపోవుటకు సిద్ధముగా ఉండి  మంచం పై నుండి లేవలేక పోయేవాడు...
పక్కనున్న జనాలు అతని తలగడ దగ్గర ఉన్న  పాతబట్టల మూటను చూశారు.  అది చూసి, ఎంత విలువైన  చిరగని ,తరగని  దుస్తులు ధరించినా కూడా  బిచ్చగాడికి ,ఆ పాత బట్టల మూటపై వ్యామోహం పోలేదు. 

వాటి  సంరక్షణ కోసమే జీవితం అంతా గడిపి , ఏ రోజూ సంతోషమును పొందలేదు గదా !  అని  బాధ పడ్డారు.

🌸🌸🌸🌸🌸🌸

ఇది ఒక బిచ్చగాడి కథ మాత్రమే కాదు! మనం  అందరమూ కూడా ఈ  అనుభవాల మూటలను పట్టుకొని, వదలకుండా  మోస్తూ ఉంటాము . 

అవి ఏమిటంటే  శత్రుత్వము, ఈర్ష్య ,ద్వేషము ,కోపము ,తన భాధలు మొదలగునవి ఎన్నో జ్ఞాపకాలు . అంతే కాదు ఈ భావనలతో మాటి  మాటికీ దుర్గుణాలను, దుఃఖాన్ని  గుర్తుతెచ్చుకుంటూ  జీవితంలోని అందమైన ,సంతోషమైన  వాటిని   అనుభవించలేము , గుర్తించలేము కూడా !ఎపుడో ,ఎక్కడో జరిగిన సంఘటనలను  ఎక్కడకిక్కడ ,ఎప్పటికప్పుడు  వదలకుండా ఒక పెద్ద పనికిరాని పాతబట్టల మూట లాగా ,ఆ జ్ఞాపకాల బరువును మోస్తూ  ఉండటమే  అనేక  బాధలకు , అశాంతికి   కారణము.
(మంచి కధలు)

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts

TET అభ్యర్థులకు ఉపయోగకరమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్

TET పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఒక ప్రత్యేకమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో మీరు ఎన్ని సార్లైనా పరీక్ష రాయవచ్చు. ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం రూపొందించబడటం దీని ప్రత్యేకత. ఈ మాక్ టెస్టులు విస్తృతమైన ప్రశ్నల బ్యాంక్ ఆధారంగా రూపొందించబడుతున్నందున, ప్రతి పరీక్షలో భిన్నమైన ప్రశ్నలు ఎదురవుతాయి. దీనివల్ల ఒకే రకమైన ప్రశ్నలు పదేపదే రావడం తగ్గి, అభ్యర్థులు వివిధ అంశాలపై మెరుగైన అవగాహన పెంపొందించుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా: • అపరిమిత సంఖ్యలో మాక్ టెస్టులు రాయవచ్చు. • ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం లభిస్తుంది. • విభిన్న అంశాలపై ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. • పరీక్షా సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. • మీ బలాలు, బలహీనతలను గుర్తించి వాటిపై మరింత దృష్టి పెట్టవచ్చు. • కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు అలవాటు పడేందుకు ఇది ఉపయోగపడుతుంది. • కంప్యూటర్ వినియోగంలో అనుభవం తక్కువగా ఉన్న అభ్యర్థులు కూడా ముందుగానే ప్రాక్టీస్ చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. నిరంతరంగా మాక్ టెస్టులు రాయడం ద్వారా పరీక్షా భయం తగ్గి, నిజమైన TET పరీక్షలో ...

AP 2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు

2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు.  https://cse.ap.gov.in/loadacademictextbookpublicview?random=0.6384777802675639 Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺