అభ్యంతరాలపై తుది కీ విడుదల చేసిన అధికారులు
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఈనెల 1న నిర్వహించిన మొదటి రోజు రాత పరీక్షకు హాజరైన వారందరికీ రెండు మార్కులు కలవనున్నాయి. అధికారులు శనివారం విడుదల చేసిన తుది కీలో ఉదయం, మధ్యాహ్నం నిర్వహించిన ఏడు ఉద్యోగాల పరీక్షలకు సంబంధించి ఇచ్చిన ప్రశ్నాపత్రాల్లో నాలుగు తప్పులున్నట్లు నిపుణులు గుర్తించారు. ఉదయం పరీక్షలో రెండు, మధ్యాహ్నం పరీక్ష పత్రాల్లో రెండు తప్పులు దొర్లాయి. ఇవే ప్రశ్నలపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్ష ప్రశ్నపత్రాల్లో మరో 5ప్రశ్నలకు ఇచ్చిన ఐచ్ఛికాల్లో రెండు సమాధాలున్నట్లు నిపుణులు గుర్తించి ఈ రెండింటిలో ఏ సమాధానం గుర్తించినా మార్కులివ్వాలని నిర్ణయించారు. ఉదాహరణకు మధ్యాహ్నం నిర్వహించిన డిజిటల్ అసిస్టెంట్ పోస్టుకు సిరీస్-ఎ ప్రశ్నాపత్రంలో 11వ ప్రశ్నలో 1,3, 66వ ప్రశ్నలో 1,2, 113 ప్రశ్నలో 1,2, 135 ప్రశ్నలో 3,4, 147 ప్రశ్నలో 3,4లో ఏదో ఒకటి సమాధానంగా గుర్తించినా మార్కులిస్తారు.
Comments
Post a Comment