నేటి వార్తలు
> అమెరికా అధ్యక్షుడు ట్రంప్ షాకింగ్ నిర్ణయం: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్‌ను విధుల నుంచి తప్పిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు.
> శ్రీలంక ఆటగాళ్ల బహిష్కరణ భారత్ వల్లే: పాక్ మంత్రి. సెప్టెంబర్ నెలాఖరున ప్రారంభం కానున్న పాకిస్థాన్ పర్యటనకు వెళ్లమని పది మంది శ్రీలంక క్రికెటర్లు భద్రతా కారణాల దృష్ట్యా ఈ పర్యటనకు వెళ్లమని సీనియర్ క్రికెటర్లు భీష్మించుకొని కూర్చున్నారు. దీనిపై పాక్ మంత్రి ఫవాద్ హుస్సేన్ పై విధంగా స్పందించారు
> యూఎన్ వేదికగా పాక్‌ను చీల్చిచెండాడిన భారత్: అంతర్జాతీయ ఉగ్రవాదానికి మూలకేంద్రంగా ఎవరు నిలుస్తున్నారో యావత్ ప్రపంచానికి తెలుసునని, వాళ్లే ఇప్పుడు జమ్మూకశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ భారత్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పాక్ తీరును ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (యూఎన్‌హెచ్‌ఆర్‌సీ)లో భారత్ ఎండగట్టింది
> రోజుల పిల్లల్ని అమ్మేసి మొబైల్ ఫోన్ కొనుకున్న ఓ 'మాతృమూర్తి'..బీజింగ్: బిడ్డల్ని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తల్లే దారుణానికి ఒడిగట్టింది. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించేందుకు రోజుల వయసున్న తన కవల పిల్లల్ని అమ్మేసింది. వచ్చిన డబ్బుతో బిల్లు కట్టేసి..మిగిలిన సొమ్ముతో ఓ మొబైల్ ఫోన్ కూడా కొనుక్కుంది.
> నాగార్జున సాగర్ 23 గేట్లు ఎత్తివేత: శ్రీశైలం నుంచి వస్తున్నవరద ప్రవాహం గంట గంటకు పెరుగుతుండడంతో నాగార్జున సాగర్ డ్యామ్ 23 గేట్లను అధికారులు తెరిచారు. 3లక్షల 77వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 2లక్షల 94వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు
> టెస్టుల్లో ఆసీస్.. వన్డేల్లో మనం నెం.1: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన యాషెస్ సిరీస్ నాలుగో టెస్ట్, టీం ఇండియా వెస్టిండీస్ పర్యటన అనంతరం.. ఐసీసీ తాజాగా వన్డే, టెస్ట్ ర్యాంకులను విడుదల చేసింది. అయితే తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకుల్లో బ్యాటింగ్‌లో స్టీవ్ స్మిత్, బౌలింగ్‌లో ప్యాట్ కమ్మిన్స్ నెం.1 స్థానంలో ఉన్నారు.
నేటి సుభాషితం
బాధలను తట్టుకోగల అనంత సామర్ధ్యాన్నే ప్రతిభ అంటారు."
"The happiest people don't have the best of everything, they make the best of everything."
మంచి పద్యం
పేదలను దుఃఖముల యందు నాదుకొనిన,
రోగపీడిత మనుజుల రోతవినని,
దీన మానవ దైన్యమ్ము దీర్చలేని,
సాధకుని సాధనము కాదు సార్థకంబు
పద్మశ్రీ డా. టి.వి. నారాయణ గారు రచించిన "శ్రుతి సౌరభము" అనే శతకములోనిది. వీరు హైదరాబాద్ వాస్తవ్యులు
నేటి జీ.కె
ప్రశ్న: భారతదేశంలో మొట్టమొదటి నూలుమిల్లు స్థాపన ఏ సంవత్సరంలో జరిగింది?
జ: 1818
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment