Skip to main content

నెలకి ఒక్కసారి తింటే అన్ని ప్రయోజనాలా...



To advertise in our blog contact us.... 9493791484

Our blog views nearly 1,00,000

ప్రతి  నెలా  ఒక్కమారు  మిరియాల  అన్నం  తినటం  వలన కలుగు  ఆరోగ్య  ప్రయోజనాలు .*

నెలకోసారి ఇంటిల్లపాదీ మిరియాల అన్నం తినండి.. మీకు అనారోగ్య సమస్యలే రావు..!

మిరియాలు అనేవి ప్రపంచవ్యాప్తంగా వివిధ వంటకాల్లో ఉపయోగించే చాలా సాధారణమైన మసాలా దినుసులలో ఒకటి. దీనిలో పొటాషియం, మెగ్నీషియం, ఇనుము, విటమిన్ K మరియు విటమిన్ సి సమృద్దిగా ఉంటాయి. ఇది చాలా ఘాటుగా ఉండటమే కాక అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మిరియాలు జీర్ణక్రియ, దగ్గు మరియు సాధారణ జలుబు ఉపశమనంనకు సహాయపడుతుంది. ప్రతి రోజు నల్ల మిరియాలను తినే కోట్లాది మందికి, ఇది ఒక ఔషధ మసాలా అనే విషయం తెలియకపోవచ్చు. అంతేకాక మిరియాల్లో ఖనిజ కంటెంట్ మరియు యాంటీబయాటిక్ లక్షణాలు ఉంటాయి. నెలకోసారి కుటుంబం అంతా మిరియల అన్నం తింటే అద్బుత ప్రయోజనాలున్నాయి..

*మిరియాల అన్నం ఇలా చేయాలి..*

*కావల్సినవి:*

పొడిపొడిగా ఉడికించిన అన్నం – కప్పు, సెనగపప్పు – అరకప్పు, మిరియాలపొడి – రెండు చెంచాలు, పల్లీలు -అరకప్పు, పచ్చిమిర్చి – ఆరు, తాలింపు దినుసులు -ఒకటిన్నర చెంచా, కరవేపాకు రెబ్బలు – రెండు, కొబ్బరి తురుము – పావుకప్పు కన్నా కొద్దిగా తక్కువ, నూనె – అయిదు చెంచాలు, పసుపు – చిటికెడు, ఉప్పు – తగినంత. 

*తయారీ:*

అన్నాన్ని వెడల్పాటి పళ్లెంలోకి తీసుకుని చల్లార్చుకోవాలి. సెనగపప్పులో కొద్దిగా ఉప్పూ, పసుపూ వేసి మరీ మెత్తగా కాకుండా ఉడికించి పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేడిచేసి తాలింపుగింజలు వేయించుకోవాలి. తరవాత పచ్చిమిర్చీ, కరివేపాకూ, పల్లీలూ వేయించాలి. ఇందులో ఉడికించిన సెనగపప్పూ, మరికొంచెం ఉప్పూ, కొబ్బరి తురుమూ, మిరియాల పొడీ వేసుకునిబాగా వేయించి దింపేయాలి. ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసి బాగా కలిపితే సరిపోతుంది.

*మిరియాల అన్నంతో ప్రయోజనాలు…*

* మిరియాలు జీర్ణశక్తిని పెంచుతాయి. కొవ్వు పదార్థాలు జీర్ణమవటాన్ని పెంచుతాయి. దీంతో శరీరంలో ఉన్న కొవ్వు కరగడమే కాకుండా మలినాలు అన్నీ బయటికి పోతాయి.

* మిరియాలతో చేసిన వాటిలో ఒమేగా-౩ ఫాటీ ఆసిడ్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో మంచి కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచి, గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి.
విశ్రాంతి చేకూరుస్తుంది.

* మిరియాల్లో విటమిన్ ‘C’ పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ వైరస్ మరియు బ్యాక్టీరియాతో పోరాడే సామర్థ్యాన్ని శరీర రోగ నిరోధక వ్యవస్థకు చేకూర్చటమేకాకుండా, జీవక్రియ సజావుగా, సాధారణ స్థాయిలో జరిగే విధంగా ప్రోత్సహిస్తుంది. ఆరోగ్యకర రోగ నిరోధక వ్యవస్థ మరియు జీవక్రియలు శరీరంలో కొవ్వు పదార్థాల నిల్వను నివారించి, బరువు తగ్గుటను ప్రోత్సహిస్తాయి.

* రోజువారీ ఆహారంలో నల్ల మిరియాలను చేరిస్తే చర్మం మరియు జుట్టు మెరుగుదలకు సహాయపడుతుంది. జలుబు దగ్గు గొంతు గరగర ముక్కుదిబ్బడ జీర్ణశక్తిని పెంచటం గొంతును శుభ్రపరచటం కీళ్లనొప్పులు ఉబ్బసం కలరా మలేరియా ఇలా ఎన్నో వ్యాధులకు మిరియాలు ఔషధం లా ఉపయోగ పడతాయి.

* మిరియాలను ఆహారంలో తీసుకుంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం స్రవించడం ద్వారా జీర్ణ ప్రక్రియను తేలిక చేస్తుంది. అలాగే ప్రేగు మరియు కడుపు సంబంధించిన వ్యాధుల నివారణలో సహాయపడుతుంది.

* బాక్టీరియా కారణంగా వచ్చే వ్యాధుల చికిత్సలో నల్ల మిరియాలు సహాయపడతాయి. మలబద్ధకం, అతిసారం మరియు ఉదర సంబంధిత వ్యాధుల చికిత్సలో నల్ల మిరియాల యొక్క ప్రభావం ఉందని గుర్తించారు.

* మిరియాలు ఫ్రీ రాడికల్ ని శుద్ధి చేయడం ద్వారా క్యాన్సర్ చికిత్సలో సహాయపడుతుంది. అంతేకాక క్యాన్సర్ యొక్క కొన్ని రకాల కార్యకలాపాల ఉదృతిని తగ్గిస్తుంది. చర్మ క్యాన్సర్ నివారణలో కూడా సహాయపడుతుంది.

* మిరియాలు జీవక్రియను పెంచటానికి సహాయపడి, అవసరంలేని కేలరీలను కరిగించి బొడ్డు కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే మిరియాలు స్థూలకాయంనకు వ్యతిరేకంగా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ప్రతి రోజు ఆహారంలో నల్ల మిరియాలను చేర్చుకుంటే కడుపు సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

* మిరియాలు ఒక యాంటీ డిప్రెసెంట్ గా పనిచేస్తుంది. మిరియాలలో ఉండే పెపైన్ యాంటీ డిప్రెసెంట్ గా పనిచేసి నాడీ వ్యవస్థ ఉద్దీపనకు సహాయపడుతుంది. దాని పలితంగా అభిజ్ఞతా సామర్థ్యం పెరుగుతుంది.

* మిరియాలలో యాంటి ఆక్సిడెంట్ సమృద్దిగా ఉండుట వలన లైన్స్,ముడతలు,నల్లని మచ్చలు, అకాల వృద్ధాప్య చిహ్నాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి చర్మాన్ని రక్షిస్తుంది. రోజువారీ ఆహారంలో నల్ల మిరియాలను చేర్చటం ద్వారా చర్మంపై అద్భుతమైన ప్రభావాన్ని చూడవచ్చు...

     🍏🍎🍐ఆరోగ్యమే మహాభాగ్యం🍊🍋🍅

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

ఆధునిక భారతదేశ చరిత్ర top 30 bits....

1. భగత్ సింగ్‌కు మరణశిక్ష విధించిన న్యాయమూర్తి ఎవరు?  జ: GC హిల్టన్  2. మహాత్మా గాంధీ రాజకీయ గురువు ఎవరు?  జ: గోపాల్ కృష్ణ గోఖలే  3. ఏ చట్టాన్ని అప్పీల్ లేకుండా, లాయర్ లేకుండా మరియు వాదన లేకుండా చట్టం అని పిలుస్తారు.  జ: రౌలట్ చట్టం  4. దండా ఫౌజ్‌ను ఎవరు ఏర్పాటు చేశారు?  జ: చమందీవ్ (పంజాబ్)  5. పాముల దేశం అని దేనిని పిలుస్తారు?  జ: బ్రెజిల్  6. మరణశిక్ష విధించిన అతి పిన్న వయస్కుడైన విప్లవకారుడు ఎవరు?  జ: ఖుదీరామ్ బోస్  7. జలియన్ వాలాబాగ్ మారణకాండకు నిరసనగా కైసర్-ఎ-హింద్ బిరుదును ఎవరు తీసుకున్నారు? నిరాకరించారు.  జ: మహాత్మా గాంధీ  8. గదర్ పార్టీని ఎవరు స్థాపించారు?  జ: లాలా హర్దయాల్, కాశీరాం  9. ఫార్వర్డ్ బ్లాక్ సంస్థ స్థాపకుడు ఎవరు?  జ: సుభాష్ చంద్రబోస్  10. కాంగ్రెస్ ఎప్పుడు, ఏ పార్టీలలో చీలిపోయింది?  జ: 1907 మితవాదులు మరియు తీవ్రవాదులు (సూరత్ సెషన్)  11. కాంగ్రెస్ మొదటి ముస్లిం అధ్యక్షుడు ఎవరు?  జ: బద్రుద్దీన్ త్యాబ్జీ  12. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఎవరు.  జ: శివాజీ ...