Skip to main content

నేటి మోటివేషన్... Moral Story: Read Completey:



ఒక సైకాలజీ సెమినార్ క్లాసు జరుగుతుంది.... దాదాపు ౩౦౦ మంది ఆ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు.. ఇంతలో అకస్మాత్తుగా ప్రసంగీకుడు పాఠం ఆపి అందరినీ ఒక పేద్ద హాలు దగ్గరికి తీసుకు వెళ్తాడు... మీకు ఒక గ్రూప్ యాక్టివిటీ ఇస్తున్నను అని అందరికీ తలా ఒక బెలూను ఇచ్చి దానిని ఊది బెలూను మీద ఎవరి పేర్లు వారు వ్రాసి ఆ హాలు లో వేయమని ఆదేశిస్తాడు... అందరూ ఆ లెక్చరర్ చెప్పిన విధంగా చేస్తారు.. అపుడు ఆ హాలంతా బెలూన్లతో నిండి పోతుంది...

ఒక ఐదు నిమిషాల తర్వాత ఆ లెక్చరర్... మీ అందరికీ ఇంకొక ఐదు నిమిషాలు సమయమిస్తాను.. ఎంత మంది తమ బెలూన్లను కనుగొనగలరో ప్రయత్నించండి... ముందు వచ్చిన వారు నిజమైన సమర్ధులు అని చిన్న కాంపిటిషన్ లా చెపుతాడు....
ఇక అందరిలో టెన్షన్ పెరిగి ఎవరికి వారు ప్రయత్నించడంలో పోటీలు పడి చివరికి ఒక్కరు కూడా తమ బెలూన్ పొందలేకపోతారు...

ఈసారి ఆ లెక్చరర్.. మీరొక పని చేయండి... అందరూ లైన్ లో నిలబడి ఒకరు బెలూన్ తీసుకుని దాని మీద ఉన్న పేరు చదవండి .. మిగిలిన వారిలో ఆ పేరు గల వారు బెలూన్ తీసుకోండి అని అనౌన్స్ చేస్తాడు... ఈసారి కేవలం మూడు నిమిషాలలో ఎవరి బెలూన్ వారి చేతికి వస్తుంది..

ఈ గ్రూప్ యాక్టివిటీ మనకు నేర్పే నీతి:
ఈ గ్రూప్ యాక్టివిటీలో బెలూన్ అనేది మన లోని ఆనందం... మనలో ప్రతి ఒక్కరం ఆనందం కొరకే ప్రాకులాడతాం.. అందరం వెతుకుతాం.. కానీ ఎవరికి వారు ప్రయత్నించడంలొ మిగిలిన వారిని అధిగమించాలనే తొందరలో పడి పోయి అసలైన ఆనందాన్ని అనుభవించలేం.. మరియు మిగిలిన వారికి కూడా దక్కనీయకుండా చేస్తున్నాము... అదే ఒకరికి ఒకరు సహకరించుకోవడం వలన అందరూ తొందరగా దానిని పొందే వీలు కలిగింది.. ఈ పాఠాన్ని నేర్చుకున్న తర్వాత దానిని ఆచరించి చూడండి.. జీవితంలోని విలువైన విషయాలేమిటో మీకు అర్థం అవుతుంది..

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

AP 2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు

2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు.  https://cse.ap.gov.in/loadacademictextbookpublicview?random=0.6384777802675639 Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

వెలుగులు నింపే ఉపాధి యజ్ఞంలో నేను సైతం అంటూ స్పందించిన మానవ దైవాలు...

చేయూత వార్షికోత్సవం సందర్భంగా ప్రతీ ఏడాది వారితో కలిసి... జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమంలో భాగస్వాములం అవుతున్నాం... గత ఏడాది ఆసరా లేక అక్షరం ఆగుతున్న చోట ఇద్దరు చిన్నారులకు మన ద్వారా ఫీజు చెల్లించిన విషయం మీకు విదితమే కదా... ఈ ఏడాది కూడా... ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపే అవకాశం మనకు వచ్చింది... వివరాల్లోకి వెళితే... ఇద్దరు ఒంటరి మహిళలు.. ఇద్దరు వితంతువులు... ఇద్దరిది చిన్న వయసు... ఒకరు ఒకవైపు కోల్పోయిన జీవితంతో పోరాడుతూ... అంగ వైకల్యం గల చిన్నారి ని పోషిస్తూ... ఒక బట్టలు కుట్టే షాపులో రోజు కూలీగా పనిచేస్తున్నారు... మరొకరిది కూడా ఇంత కన్నా దీనమైన పరిస్థితి... ఇద్దరి కష్టాన్ని తరచి చూస్తే.... మనం ఇద్దరికీ ఏమైనా రెండు కుట్టు మిషన్లు సమకూర్చగలిగితే వారి కాళ్ల పై వారు నిలబడగలరు.. వచ్చిన కొద్ది మొత్తం తో కుటుంబాన్ని కూడా పోషించుకోగలరు... ఇన్నాళ్లు సమస్య అన్నప్రతీసారి స్పందించాం... ఇప్పుడు కూడా రెండు కుటుంబాల్లో వెలుగులు నింపే అవకాశం మన ముంగిట నిలబడింది... ఒకరుగా చేయలేం... కానీ ఒకరికి ఒకరు జత కలిస్తే... ఒకటిగా చేయగలం... ఒక్కొక్క ఎలక్ట్రానిక్ సదుపాయం గల కుట్టు మిషన్ ఖరీదు 12,000/ రూపా...