Skip to main content

నేటి మోటివేషన్... జీవితం చేజారనీకు......



వ్యాపారం జగత్తులో శిఖరాన్ని చేరాను నేను. 
విషయానికి ప్రతీకగా నిలిచాను.పనితప్ప నాకు వేరే ఆనందం తెలీదు. సంపాదనకే అంకితమైపోయాను. ఇప్పుడు ఈ మరణశయ్య మీద రోజులు లెక్కపెట్టుకుంటున్న నేను ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుంటే . ఇన్నాళ్లూ నేను గర్వపడిన పేరూ డబ్బూ ఎందుకు కొరగానవని నాకు అనిపిస్తోంది .ఈ నిశిరాత్రిలో.నా ప్రాణల్నీ నిలిపేందుకు అమర్చిన యంత్రాలు చేసే శబ్దంలో నాకు మృత్యు దేవత ఊపిరిచనప్పుడు వినిపిస్తోంది .
నాకిప్పుడనిపిస్తోంది...జీవితంలో సరిపడా డబ్బు సంపాదించాక. మనం ఆలోచించాల్సిన విషయాలు వేరే ఉన్నాయి. కళలూ. అనుబంధాలూ. చిన్నప్పటి కలలూ. కోరికలూ. సేవ...ఇలా డబ్బుకి అవతల చాలా ప్రపంచం ఉంది కానీ డబ్బు వెనక పెట్టే పరుగు మనిషి మరమనిషిలా మార్చేస్తుంది .అందుకు నేనే ఉదాహరణ . ఇతరుల మనసుల్లోని ప్రేమను గుర్తించాలనే దేవుడు మనకి జ్ఞానేంద్రియాలను ఇచ్చాడు . కానీ డబ్బుకు మాత్రమే విలువ ఇచ్చే కాల్పనిక జగత్తును మనం సృష్టించుకున్నాం నేను సంపాదించిన డబ్బు ఈ క్షణం నాకు తోడుగా లేదు. నా ఈ ఆఖరి ప్రయాణంలో అది నా వెంట రాదు. నేను నాతో తీసుకువెళ్లగలిగేది.
ప్రేమానుభూతులూ. అందమైన జ్ఞాపకాలూ మాత్రమే. ఈ ప్రేమపూర్వక అనుభూతులే ఎప్పుడూ మనతో ఉంటాయి. మనల్ని ఉన్నతస్థాయికి చేరుస్తాయి నిజం. అంతా మన హృదయంలోనే.మన చేతుల్లోనే ఉంది .
ఈ ప్రపంచంలో అత్యంత ఖారీదైన మంచం ఏదో తెలుసా...? నువ్వు రోగంతో బాధపడుతూ పడుకున్న మంచం.నీ కారు నడపడానికీ ఒక డైవర్ని నియమించుకోగలవు. నీ కోసం సంపాదించిపెట్టె ఉద్యోగులను నియమించుకోలవు. కానీ నీ జబ్బునూ.నీ బాధనూ అనుభవించే వ్యక్తిని మాత్రం ఎన్ని కొట్లు పెట్టినా నువ్వు ఏర్పాటు చేసుకోలేవు నువ్వుదేన్ని కోల్పోయినా తిరిగి పొందవచ్చు కానీ .
చేజారిన జీవితాన్ని మాత్రం తిరిగి పొందలేదు జీవితంలో ఈ రోజు మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్న కధ ముగిసే రోజు తెర పడే రోజు ఒకటి వస్తుంది అప్పుడు ఎంత ఆరాటపడినా కాలం వెనక్కి మళ్లదు. అందుకు ... కాస్త ముందే కళ్లు తెరువు .డబ్బును కాదు .నీ కుటుంబాన్ని ప్రేమించు. నీ స్నేహితులను ప్రేమించు. ఆనందంగా జీవించు. అందరినీ ఆనందంగా ఉంచు ..


🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం జారీ చేసిన G.O.MS.No.2 – సమగ్ర ఆదేశాలు

ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.MS.No.2 ద్వారా తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు 2025 జనవరి 6న అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, మాతృత్వ సెలవులు, ఎక్స్‌గ్రేషియా వంటి అంశాలను స్పష్టంగా చర్చించాయి. ఈ ఆదేశాలలో ఉన్న ముఖ్యాంశాలు, పాజిటివ్ మరియు నెగటివ్ అంశాలను ఈ వ్యాసంలో విశ్లేషించబడింది. ముఖ్యాంశాలు: 1.MTS: ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, మరియు సమాజాల్లో ఖాళీగా ఉన్న నిబంధిత పోస్టులపై నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే న్యూనత పేస్కేల్ వర్తిస్తుంది. MTS ద్వారా నెలవారీ చెల్లింపులు కలిపి ఒకే రూపంలో అందిస్తారు. అయితే, ఈ పేమెంట్‌లో అదనపు అలవెన్స్‌లు, వార్షిక పెంపులు ఉండవు. 2. మాతృత్వ సెలవులు: వివాహిత మహిళా ఉద్యోగులకు రెండు ప్రసవాలకు 180 రోజుల చెల్లింపు మాతృత్వ సెలవు కల్పించడం ఈ ఉత్తర్వుల్లో ప్రధానమైన పాజిటివ్ అంశం. ఈ కాలంలో EPF, ESI వంటి అన్ని ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. 3. ఎక్స్‌గ్రేషియా: అపఘాత మృతి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, సహజ మృతికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించ...

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺