Skip to main content

నేటి మోటివేషన్... తృప్తి (గెలిచిన పందెం)



ఒక వేటగాడు అవసరానికి తన గుర్రాన్ని అమ్మడానికి సంతకు వెళ్ళాడు. 

గుర్రానికి సరైన బేరం కుదరక గుర్రానిచ్చి ఆవుకు మారకం వేశాడు. మరొకరి సలహా తీసుకుని ఆవునిచ్చి గాడిదకు మారకం వేశాడు. గాడిదనిచ్చి బూట్లు తీసుకొన్నాడు. చివరకు బూట్లిచ్చి ఒక టోపి తీసుకున్నాడు. 

ఆ టోపితో ఇంటికి వస్తూ దారిలో వంతెన మీద నడుస్తుంటే రాయి తగిలి బోర్లాపడ్డాడు. టోపి కాస్తా నదిలో పడింది. దిగులుగా అటే చూస్తూ కూర్చున్నాడు. 

అదే దారిలో వచ్చే ఇద్దరు బాటసారులు విషయం అడిగి తెలుసుకున్నారు. అయ్యో పాపం అని బాధపడ్డారు. "నీకివాల ఉపవాసమే" అన్నాడొకడు. పెళ్ళాంతో బడితపూజ తప్పదన్నాడింకోకడు. "నా పెళ్ళాం అలాంటిది కాదు, ఏమీ అనదు "అని వేటగాడు బాటసారులతో పందెం కట్టాడు.

బాటసారులిరువురు వేటగాడింటికి వెళ్ళారు. వేటగాడు గుమ్మంలో నుంచి భార్యను పిలిచాడు. వాడి పెళ్ళాం ఎదురుగా వచ్చి మావా! వచ్చినావా అంది ఆప్యాయంగా. 

వాడు జరిగింది చెప్పడం మొదలు పెట్టాడు. 

వేటగాడు : "గుర్రం ధరకు పలకకపోతే ఆవుకి మారకం వేశా "అన్నాడు.

భార్య : "మంచి పని చేశావు మావా పాలు తాగవచ్చు"

వేటగాడు : "ఆవు కూడా గాడిదకు మారకం వేశా"

భార్య : "కట్టెలు అడివినుంచి మోసుకు వస్తుందిలే" అంది తృప్తిగా.

వేటగాడు : "గాడిదను అమ్మేసి చెప్పులు తీసుకొన్నా"

భార్య : "అడవుల్లో రాళ్లు, రప్పలు తగలకుండా ఉంటుందిలే మావా"

వేటగాడు : "అవి కూడా ఉంచుకో లేక టోపీకి మారకం వేసినా"

భార్య : "సరేలే మావా ఆ టోపితో అందంగా ఉంటావు"

వేటగాడు : "కానీ వస్తావుంటే నేను వంతెన మీద పడితే టోపి జారి నీళ్లలో పడ్డది"

భార్య : "పోతే పోయిందిలే మావా! నీవు పడిపోకుండా వున్నావు, అంతా అడవి తల్లి దయ" అని తృప్తిగా ముద్దు పెట్టుకుంది. 

గుర్రాన్ని నష్టపోయి వచ్చినందుకు భర్తను విమర్శించకుండా, ఎత్తిపొడుపు మాటలు అనకుండా, భర్త క్షేమంగా ఇంటికి వచ్చినందుకు అడవి తల్లికి కృతజ్ఞతలు తెలుపుకుంది.

ఎగతాళి చేద్దామనుకున్న బాటసారులు ఆ వేటగాడి భార్య మంచి మనసుకు సిగ్గుతో తలదించుకుని వెళ్ళిపోయారు.

* * * * * *

మానవుని యొక్క అన్ని బంధాలు వ్యాపార సంబంధాలుగా పరిణమిస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి సంభాషణ వినగలమా! 

కరుగుతున్న క్షణానికి, జరుగుతున్న కాలానికి, అంతరించే వయసుకి చివరకు మరపురాని జ్ఞాపకాలుగా మిగిలేవి జీవితంలో జరిగే కొన్ని మంచి సందర్భాలే.

అందుకే, ఏ ఒక్కరిని తొందరపడి ఏం అనకండి. కన్ను చెదిరితే, గురి మాత్రమే తప్పుతుంది. మనస్సు చెదిరితే జీవితమే దారి తప్పు తుంది. ఎగతాళి చేసేవారికి కాలమే సమాధానం చెబుతుంది.

ప్రతికూల సందర్భంలో కూడా పాజిటివ్‌గా ఉండేందుకు ప్రయత్నిద్దాం.

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం జారీ చేసిన G.O.MS.No.2 – సమగ్ర ఆదేశాలు

ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.MS.No.2 ద్వారా తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు 2025 జనవరి 6న అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, మాతృత్వ సెలవులు, ఎక్స్‌గ్రేషియా వంటి అంశాలను స్పష్టంగా చర్చించాయి. ఈ ఆదేశాలలో ఉన్న ముఖ్యాంశాలు, పాజిటివ్ మరియు నెగటివ్ అంశాలను ఈ వ్యాసంలో విశ్లేషించబడింది. ముఖ్యాంశాలు: 1.MTS: ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, మరియు సమాజాల్లో ఖాళీగా ఉన్న నిబంధిత పోస్టులపై నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే న్యూనత పేస్కేల్ వర్తిస్తుంది. MTS ద్వారా నెలవారీ చెల్లింపులు కలిపి ఒకే రూపంలో అందిస్తారు. అయితే, ఈ పేమెంట్‌లో అదనపు అలవెన్స్‌లు, వార్షిక పెంపులు ఉండవు. 2. మాతృత్వ సెలవులు: వివాహిత మహిళా ఉద్యోగులకు రెండు ప్రసవాలకు 180 రోజుల చెల్లింపు మాతృత్వ సెలవు కల్పించడం ఈ ఉత్తర్వుల్లో ప్రధానమైన పాజిటివ్ అంశం. ఈ కాలంలో EPF, ESI వంటి అన్ని ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. 3. ఎక్స్‌గ్రేషియా: అపఘాత మృతి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, సహజ మృతికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించ...

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺