Skip to main content

నేటి మోటివేషన్... వెలకట్టలేని వజ్రం



ఒక ఊరిలో ఒక ఒంటరి అవ్వ ఉండేది. కష్టంగా తన పనులు తాను చేసుకుంటుండేది. దూరంగా ఉన్న బావినుంచి నీటిని తెచ్చుకునేందుకు చాలా కష్టపడేది. ఒకరోజు ఆమె బావినుంచి బకెట్ తో నీరు తోడగా అడుగున ఏదో మెరుస్తూ కనిపించింది. 

ఏమిటిది.. ఇంతలా మెరుస్తుందంటూ ఆశ్చర్యంగా తీసి చూసింది. ఎర్రని కెంపు. సూర్యకిరణాలు తాకడంతో మరింత మెరుస్తోంది. ఆహా... ఏమి నా అదష్టం అనుకుంటూ, తీసుకుని తన సంచిలో వేసుకుంది. 
ఇంతలో దాహంతో బావి దగ్గర ఒక యువకుడు వచ్చాడు.

ఆ అవ్వ అతనికి నీళ్లు అందించింది. అతను ఆ నీటిని ఆత్రంగా తాగాడు. అయినా అతని ముఖంలో తీవ్రమైన ఆందోళన కనిపిస్తోంది. అవ్వ అది గమనించి...

’’నాయనా... ఏమైంది? ఎందుకంత ఆందోళనగా ఉన్నావు?‘‘ అని అడిగింది. 
’’ఏం చెప్పేదవ్వా. నా బతుకంతా సమస్యలే. వర్షాల్లేవు. సాగు సాగదు. ఉన్న ఊర్లో పని దొరకడంలేదు. కానీ కుటుంబాన్ని పోషించాలిగా. బతకాలంటే నలుగురికీ నాలుగు వేళ్లు నోటిలోకి పోవాలిగా. అందుకే టౌన్లో ఏదైనా పని దొరుకుతుందేమోనని వెళ్తున్నా. అక్కడ ఎక్కడుండాలో, ఎలా బతకాలో, పని దొరుకుతుందో లేదో...‘‘ అని చెప్పాడు. 

అవ్వ ఒక్క క్షణం ఆలోచించి, తన సంచిలోంచి కెంపు తీసి అతని చేతిలో పెట్టింది. 
’’ఏంటవ్వా.. ఏంటిదీ?‘‘ అని ఆశ్చర్యంతో అడిగాడు. 
’’పర్లేదు నాయనా ఉంచు. ఇప్పుడిది నాకన్నా నీకే ఎక్కువ అవసరం‘‘ అని చెప్పింది. 
’’అది కాదవ్వా. ఇంత విలువైన కెంపు ఏ సంబంధమూ లేని నాకివ్వడం...‘‘ అంటూ సంకోచిస్తూ చెప్పాడు. 
’’పర్లేదులే నాయనా. నాదేముంది ముసలిదాన్ని. నాలుగు మెతుకులు నోట్లోకెళ్తే చాలు. నీకు కుటుంబం ఉంది. పిల్లల చదువులున్నాయి. నీకే బాగా ఉపయోగపడుతుంది‘‘ అని చెప్పింది. 
’’నువ్వు నా పాలిట దేవతవవ్వా‘‘ అని కాళ్లకు మొక్కి పట్టణంవైపుగా సాగిపోయాడు. 
===========

కొన్ని వారాల తరువాత, అవ్వ ఎప్పటిలాగే బావి వద్దకు వెళ్ళింది, అక్కడ మళ్లీ ఆ యువకుడు కనిపించాడు. 
’’ఏంటి నాయనా.. ఏంటి మళ్లీ వచ్చావు? పట్టణంలో పని దొరికిందా? నీ భార్యా పిల్లలు ఎలా ఉన్నారు?‘‘ అని అడిగింది. 
’’అంతా బాగుందవ్వా. నీ మాట చలవవల్ల పట్టణంలో నాకు పని కుదిరింది. ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు.‘‘
’’మంచిది నాయనా. వింటుంటే ఆనందంగా ఉంది. మరి మళ్లీ ఎందుకొచ్చావు?‘‘ అని అడిగింది. 
’’ఇదుగో అవ్వా..‘‘ అంటూ కెంపును చేతిలో పెట్టాడు. 
’’ఏంటి నాయనా.. ఏంటిది? నీ అవసరాలకు ఉపయోగించుకోమని చెప్పాగా. ఇదివ్వడానికే వచ్ఛావా?‘‘ అంటూ నిష్టూరంగా మాట్లాడింది.
’’కాదవ్వా. దీనికన్నా విలువైనది నీ నుంచి కోరుకుంటున్నా.‘‘
’’దీనికన్నా విలువైనదా? నా దగ్గరేముంది నాయనా. ఇది కూడా బావిలో దొరికింది. నాకన్నా నీకు అవసరం ఎక్కువని ఇచ్చా. ఇంతకు మించింది నా దగ్గర ఏముంది నాయనా?‘‘ 
’’అది నీ దగ్గరే ఉందవ్వా.‘‘
’’నా దగ్గరే ఉందా? నాకు తెలియకుండా. ఏంటి నాయనా అది?‘‘
’’ముక్కూముఖం తెలియని నాకు, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఇంత విలువైన కెంపును ఇచ్చేలా చేసిన నీ దగ్గరున్న వెలకట్టలేని వజ్రం‘‘ అని సమాధానమిచ్చాడు.
అంత వెలకట్టలేని నా దగ్గరేముందబ్బా.. అని అవ్వ ఆలోచిస్తోంది. 

ఆ వజ్రమేమిటో మీకేమైనా తెలిస్తే చెప్పండి. 😊

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Post a Comment

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

భారత రాజ్యాంగములో మొత్తం ఆర్టికల్స్ వివరాలు ...

ఆర్టికల్ సంఖ్య మరియు పేరు ఆర్టికల్ 1 - యూనియన్ పేరు మరియు భూభాగం ఆర్టికల్ 2 - కొత్త రాష్ట్రాల ప్రవేశం లేదా స్థాపన ఆర్టికల్ 3 - రాష్ట్రం యొక్క సృష్టి మరియు సరిహద్దులు లేదా పేర్ల మార్పు ఆర్టికల్ 4 - మొదటి షెడ్యూల్డ్ మరియు నాల్గవ షెడ్యూల్స్కు సవరణలు మరియు రెండు మరియు మూడు కింద చేసిన శాసనాలు ఆర్టికల్ 5 - రాజ్యాంగం ప్రారంభంలో పౌరులు ఆర్టికల్ 6 - పాకిస్తాన్ నుండి భారతదేశానికి వస్తున్న కొంతమంది వ్యక్తుల పౌరసత్వ హక్కులు ఆర్టికల్ 7 - భారతదేశం నుండి పాకిస్తాన్ వెళ్లేవారికి కొంతమంది వ్యక్తుల పౌరసత్వ హక్కులు ఆర్టికల్ 8 - భారతదేశం వెలుపల నివసిస్తున్న వ్యక్తుల పౌరసత్వ హక్కులు ఆర్టికల్ 9 - స్వచ్ఛందంగా విదేశీ రాష్ట్ర పౌరసత్వం తీసుకుంటే భారత పౌరుడు కాదు ఆర్టికల్ 10 - పౌరసత్వ హక్కుల నిలకడ ఆర్టికల్ 11 - పౌరసత్వం కోసం చట్టాన్ని పార్లమెంట్ నియంత్రిస్తుంది ఆర్టికల్ 12 - రాష్ట్ర నిర్వచనం ఆర్టికల్ 13 - ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే లేదా అవమానించే చట్టాలు ఆర్టికల్ 14 - చట్టం ముందు సమానత్వం ఆర్టికల్ 15 - మతం, కులం, లింగం, సంతతి లేదా పుట్టిన ప్రదేశం ఆధారంగా వివక్షను నిషేధించడం ఆర్టికల్ 16 - ...

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ