Skip to main content

నేటి మోటివేషన్.. భావవ్యక్తీకరణ ఎంత గొప్పగా ఉంటే ఫలితం అంత మహత్తరంగా ఉంటుంది!



నాలుకను అదుపు చేసుకోగల విద్య తెలిస్తే, అనేక విద్యలు అవలీలగా ఒంటపడతాయి.
 
    నోటిని అదుపులో పెట్టుకుని అందరితో మర్యాదగా మాట్లాడుతూ, 
పద్ధతిగా నడుచుకుంటూ ఉంటే ఎక్కడైనా, 
ఎప్పుడైనా మంచే జరుగుతుంది.

చెట్టు సారం పండులో వ్యక్తమైనట్లుగా, 
మనిషి సారం అతడి మాటలో తొంగి చూస్తూ ఉంటుంది.
మంగళకరమైన మాట తీరు మనిషి సంస్కారానికి గీటురాయి.

మనిషికి నిజమైన అలంకారం అతడి మాట తీరే
ఆలోచించకుండా మాట్లాడటం, 
గురి చూడకుండా బాణం వేయడం లాంటిది.
మాట్లాడిన తరవాత ఆలోచించాల్సిన అవసరం రాకూడదు

కాబట్టి ఆలోచించి ఆచి తూచి మాట్లాడాలి.

‘తాను ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివైనవాడు.
తాను ఏం మాట్లాడకూడదో తెలుసుకోగలిగినవాడు వివేకవంతుడు’
అన్నారు స్వామి వివేకానంద. 

ఎవరైతే తమ మాటలవల్ల,
చేతల వల్ల ఇతరులకు బాధ కలిగించకుండా ఉంటారో వారే ఉత్తములు.

ఆచరిస్తూ చెప్పే మాటలకు 
ఆదరణ ఎక్కువ.
ఆదరణపూర్వకంగా చెప్పే మాటలకు ఆచరణ ఎక్కువ.
ఆకట్టుకునేలా మాట్లాడటం ఓ కళ.
అయితే ఆ మాటలను ఎప్పుడు మొదలుపెట్టాలో,
ఎప్పుడు ఆపాలో తెలియడం మరీ 
గొప్ప కళ. 
మాటలే మంత్రాలు, చెట్లే ఔషధాలు.
మాటలు చాలా పదునైనవి కనుక జాగ్రత్తగా వాడాలి,
బలమైనవి కనుక సున్నితంగా వాడాలి,
ఖరీదైనవి కనుక పొదుపుగా వాడాలి.

మాట్లాడటం 
అందరూ చేస్తారు. 
అయితే అందరిలాగా కేవలం నోటితో మాట్లాడితే సరిపోదు. 
మరింత ప్రభావాన్వితంగా ఉండాలంటే మనసుతో,
శరీరంతో మాట్లాడాలి.

మాటే సంపదలకు, మానవ సంబంధాలకు మూలం. 
మాటే స్నేహితుల్ని సంపాదించి పెడుతుంది, 
శత్రువుల్నీ తయారు చేస్తుంది.

*నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు.*

అలాంటివారికి శత్రువులే ఉండరు.
మాటలు గాయపరచగలవు, 
అదే గాయాన్ని నయం చేయనూగలవు. 
సరైన మాటతీరు- 
చంపడానికి వచ్చిన శత్రువు మనసునైనా మార్చగలదు.

మాటలు - పదాలు
పాయసం లో 
జీడి పప్పు కిస్మిస్లాగా ఉన్నాయి.
-- చలం గారి కవిత లో

మాటల మధ్యలో సందర్భానుసారంగా సామెతలు, 
లోకోక్తులు వాడితే పాయసంలో అతి మధురమైన పదాలు,  
మరింత మధురంగా,
వినసొంపుగా అనిపిస్తుంది. 
సంభాషణ సరస చతురత కలిగి ఉండాలి. 
తిడుతూనే నవ్వించే హాస్య కుశలత కలిగి ఉండాలి.

ఎవరితో, ఎప్పుడు, ఎలా మాట్లాడాలో తెలిసి ఉండాలి. 
ఈ విషయంలో రామాయణంలో నాయకుడైన మర్యాదా పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు,
సుందరకాండకు నాయకుడైన సుందరమూర్తి హనుమంతుడు మనకు ఆదర్శం కావాలి.

మనిషికి భావ వ్యక్తీకరణ గొప్ప ఆస్తి.
ఏం చెప్పారనేదాని కన్నా ఎలా చెప్పారనే దాన్నిబట్టి భావ ప్రసరణ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

భావవ్యక్తీకరణ ఎంత గొప్పగా ఉంటే ఫలితం అంత మహత్తరంగా ఉంటుంది!

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

ఆధునిక భారతదేశ చరిత్ర top 30 bits....

1. భగత్ సింగ్‌కు మరణశిక్ష విధించిన న్యాయమూర్తి ఎవరు?  జ: GC హిల్టన్  2. మహాత్మా గాంధీ రాజకీయ గురువు ఎవరు?  జ: గోపాల్ కృష్ణ గోఖలే  3. ఏ చట్టాన్ని అప్పీల్ లేకుండా, లాయర్ లేకుండా మరియు వాదన లేకుండా చట్టం అని పిలుస్తారు.  జ: రౌలట్ చట్టం  4. దండా ఫౌజ్‌ను ఎవరు ఏర్పాటు చేశారు?  జ: చమందీవ్ (పంజాబ్)  5. పాముల దేశం అని దేనిని పిలుస్తారు?  జ: బ్రెజిల్  6. మరణశిక్ష విధించిన అతి పిన్న వయస్కుడైన విప్లవకారుడు ఎవరు?  జ: ఖుదీరామ్ బోస్  7. జలియన్ వాలాబాగ్ మారణకాండకు నిరసనగా కైసర్-ఎ-హింద్ బిరుదును ఎవరు తీసుకున్నారు? నిరాకరించారు.  జ: మహాత్మా గాంధీ  8. గదర్ పార్టీని ఎవరు స్థాపించారు?  జ: లాలా హర్దయాల్, కాశీరాం  9. ఫార్వర్డ్ బ్లాక్ సంస్థ స్థాపకుడు ఎవరు?  జ: సుభాష్ చంద్రబోస్  10. కాంగ్రెస్ ఎప్పుడు, ఏ పార్టీలలో చీలిపోయింది?  జ: 1907 మితవాదులు మరియు తీవ్రవాదులు (సూరత్ సెషన్)  11. కాంగ్రెస్ మొదటి ముస్లిం అధ్యక్షుడు ఎవరు?  జ: బద్రుద్దీన్ త్యాబ్జీ  12. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఎవరు.  జ: శివాజీ ...