Skip to main content

నేటి మోటివేషన్... మనుషులు అందరికి మంచి మిత్రుడు ఎవరో తెలుసా ......!!



ఈ ఆధునిక యుగంలో ప్రతి మనిషికి మిత్రులు ఉంటారు.అందరూ చెబుతూవుంటారు నాకు 100 మంది ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంస్టాగ్రామ్ లో 100 మంది ఫాలోయర్స్ ఉన్నారు అని.ఇలాంటివి చెప్పుకోవడానికి బాగుంటాయి.

నిజానికి ఒక మంచి మిత్రుడు 100 పుస్తకాలతో సమానం.అతను నీకు మంచిని బోధించి అలవారుచుకొనేలా చేస్తాడు.ఇంక 100 మంది మిత్రులు ఉన్నా వారిలో మంచి బుద్ధి లేకపోతే వాళ్లు మనకి ఎందుకు పనికిరారు.
ఒక్క పని బాగా చేస్తారు అదే మిమల్ని నాశనం చేయడం.ఒక మంచి మిత్రుడు మిమల్ని ఉన్నత శిఖరాలను ఎక్కిస్తే దుర్బుద్ధి గల మితుడు నిన్ను అందాకారంలోకి తోసేస్తాడు.మరి మీరు మీ మంచి మిత్రుడ్ని ఎంచుకున్నారా!

ఆ మంచి మిత్రుడు ఎవరో మీకు తెలుసా!
ఆశ్చర్య పోకండి నిజానికి మీకంటే గొప్ప మిత్రుడు మీకు ఇంకెవరు దొరకరు.మీకు మాత్రమే మీ గురించి పూర్తిగా తెలుస్తుంది.మీ ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుస్తుంది.
మీ గురించి మీకు అంత బాగా తెలిసినప్పుడు మీ కంటే మంచి మిత్రుడు మీకు ఈ ప్రపంచంలో దొరకడు.మీతో మీరే చెప్పుకోవాలి మీరు మంచి పనులు చేయాలని, అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలని,కష్టంలోనే సుఖాన్ని వెతుక్కోవలని,తల్లిదండ్రులను సంతోషపెట్టాలని.
అంతేగాని మన కోసం ఎవరో రావాలి వాళ్ళు మనకు అన్ని నేరిపించాలి అంటే మనం ఎప్పటికి అభివృద్ధి చెందలేం.ఈ స్వార్థపూరిత లోకంలో నీకు ఒక మంచి మిత్రుడు తారసపడితే నీవు అదృష్టవంతునివే కానీ అలా జరగనిచో నీవు నీతోనే స్నేహం చేయి.

అప్పుడు నీవు బాధపడాల్సిన అవసరం ఉండదు.నీవు చేయాల్సిన మంచి పనులన్నీ చేయగల శక్తిని నీకు దేవుడే ప్రసాదిస్తాడు.నీలో ఉన్న నీ మంచి మిత్రుడిని ఈరోజే నిద్రలేపు అతను ఎన్ని కష్టాలు వచ్చినా నీతో ఉంది నీకు సహాయం చేస్తాడు.
ఈ నాటినుండి నీవు నీ మిత్రుడిని కనుగొంతే నీ విజయం ఎప్పుడూ నీతోనే ఉంటుంది.నీలోని మిత్రుడు నిన్ను వదిలిపోడు.వాడిది కల్మషం లేని ప్రేమ .నిన్ను ఉత్తేజపరచడం వాడికి తెలుసు.ఆ కసితో నీవు ఏమైనా సాధించగలవు......!
🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

క్యాలిక్యులేటర్ లో ఉండే ఈ GT, MU, M+, M-, MRC బటన్ల అర్థాలు, ఎందుకు వాడుతారో తెలుసా..?

ఇప్పుడంటే అన్నీ కంప్యూటర్ మయం అయిపోయాయి. దానికి తోడు స్మార్ట్ ఫోన్ లేకుండా క్షణం గడవదు. ప్రతీ దానికి యాప్ లు వచ్చేసాయి. ఇప్పుడంటే మనం సులభం గా పెద్ద పెద్ద అమౌంట్స్ కూడిక వెయ్యటానికి కాలిక్యులేటర్ యాప్ లను వాడుతున్నాం. అయితే ఫిజికల్ కాలిక్యులేటర్ వాడకం మాత్రం ఇంకా తగ్గలేదని చెప్పాలి. ఇప్పటికీ షాపుల్లో, ఆఫీసుల్లో అకౌంట్స్ సెక్షన్స్ లో దీని అవసరం ఉంటూనే ఉంటుంది. మీరు ఎప్పుడైనా కాలిక్యులేటర్ ను సరిగా చూసినట్లయితే అందులో కొన్ని ప్రత్యేకమైన బటన్స్ ఉంటాయి. GT, MU, M+, M-, MRC ఇలా కొన్ని స్పెషల్ బటన్లు ఉంటాయి. కాలిక్యులేటర్ ను వాడే చాలా మందికి అవేంటో ఎందుకు వాడతారో తెలియదనే చెప్పాలి. అసలు ఆ బటన్ల ఉపయోగం ఏంటో తెలుసుకుందామా... 1. GT - గ్రాండ్ టోటల్ (Grand Total) GT బటన్ మీకు గ్రాండ్ టోటల్ ను చెప్తుంది. అంటే ఉదాహరణకు 4 × 2 = 8 అని ఒక గుణకారాన్ని వేసుకుని తరువాత 7 × 6 = 42 అనే వేరే లెక్కను వేసారనుకోండి. ఇప్పుడు GT అనే బటన్ ప్రెస్ చేస్తే మీకు టోటల్ 50 (08 + 42 = 50) అనే ఆన్సర్ వస్తుంది. సో ఇది పెద్ద పెద్ద మొత్తాలలో లెక్కలు చేసినప్పుడు ఈజీ గా గ్రాండ్ టోటల్ తెలుసుకోవడానికి పనికొస్తుంది. ఒకసారి ట్రై చ...

నేటి ఆరోగ్యం... థైరాయిడ్ & హైపోథైరాయిడ్ మధ్య తేడా

థైరాయిడ్ మన మెడలో ఉన్న చిన్న గ్రంధి. ఇది శరీరంలో మెటబాలిజం, బరువు, శక్తి, హృదయ స్పందనలు, శరీర ఉష్ణోగ్రత మొదలైన వాటిని నియంత్రించే థైరాక్సిన్ (T4), ట్రైఐయోడోథైరోనిన్ (T3) అనే హార్మోన్లను విడుదల చేస్తుంది. అంటే థైరాయిడ్ అనేది గ్రంధి పేరు. హైపోథైరాయిడ్ థైరాయిడ్ గ్రంధి సరిగా పని చేయకపోతే హార్మోన్లు తక్కువగా ఉత్పత్తి అవ్వడం. దీనిని Hypothyroidism అంటారు. ఇది ఒక వ్యాధి స్థితి. 👉 కాబట్టి థైరాయిడ్ = గ్రంధి, హైపోథైరాయిడ్ = వ్యాధి అని గుర్తుంచుకోవాలి. 🩺 హైపోథైరాయిడ్ లక్షణాలు అలసట, బలహీనత బరువు పెరగడం మలబద్ధకం చల్లదనం ఎక్కువగా అనిపించడం జుట్టు రాలడం, చర్మం పొడిగా మారడం మానసికంగా డిప్రెషన్, దృష్టి కేంద్రీకరించలేకపోవడం. 🌿 *ఆయుర్వేద ఫార్మసీలో దొరికే మందులు 1. Kanchanar Guggulu – థైరాయిడ్ గడ్డలు, హార్మోన్ అసమతుల్యతకు. 2. Ashwagandha Churna / Tablets  – గ్రంధి పనితీరును సమతుల్యం చేస్తుంది. 3. Punarnava Mandur – వాపులు, మెటబాలిజం సమస్యలకు. 4. Trikatu Churna (మిరియాలు, శొంఠి, పిప్పలి) – జీర్ణక్రియ, థైరాయిడ్ హార్మోన్ యాక్టివిటీ పెంచుతుంది. 5. Varunadi Kashayam – గ్రంధుల వాపు, మలబద్ధకం, మెటబాలిజం స...

📢 AP Government Recruitment Notification దివ్యాంగుల కమిషనర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కీలక నియామక ప్రక్రియను ప్రారంభించింది. రాష్ట్రంలో దివ్యాంగుల హక్కుల పరిరక్షణ, సంక్షేమ పథకాల అమలు మరియు సేవల పర్యవేక్షణ కోసం “State Commissioner for Persons with Disabilities” పోస్టును భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ పోస్టుకు అర్హతలు కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 🔹 పోస్టు పేరు State Commissioner for Persons with Disabilities (దివ్యాంగుల కమిషనర్) 🔹 శాఖ మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వృద్ధుల సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 📅 దరఖాస్తుల చివరి తేదీ 15 జూన్ 2026 🌐 దరఖాస్తు విధానం అభ్యర్థులు కేవలం అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అవసరమైన స్వీయ ధృవీకరించిన (Self-Attested) పత్రాలను అప్లోడ్ చేయడం తప్పనిసరి. 🔗 అధికారిక వెబ్‌సైట్: [ www.wcdsc.ap.gov.in ]( http://www.wcdsc.ap.gov.in ) ⚠️ ముఖ్య సూచనలు ▪️ ఆఫ్‌లైన్ దరఖాస్తులు స్వీకరించబడవు ▪️ అసంపూర్ణ దరఖాస్తులు తిరస్కరించబడే అవకాశం ఉంది ▪️ Self-Attested పత్రాలు జత చేయని దరఖాస్తులు పరిగణనలోకి తీసు...