Skip to main content

నేటి మోటివేషన్... ఇగోనా? నమ్మకమా?



నమ్మకం ఇంత విలువైనదవుతుందని నాకు చిన్నప్పుడు అన్పించేది కాదు.. దాదాపు అందరూ అందర్నీ నమ్మేవారు.. ఎక్కడో అరాకొరా అందరూ కామన్గా డిసైడ్ చేసేసిన మనిషిపై అపనమ్మకం తప్పించి!

ఇప్పటి సంగతి చెప్పేదేముంది.. ఎవర్నీ ఎవరూ నమ్మరు.. నమ్ముతున్నట్లు నటిస్తారు.. చిన్న తేడా వస్తే దాన్ని కన్ఫర్మ్ చేసుకోకుండానే ఖేల్ ఖతం చేసేస్తారు..

ఎవర్నైనా ఎక్కువమంది నమ్ముతుంటే.. పనిగట్టుకుని మరీ వారిపై బురద జల్లేవరకూ శాంతించని కల్లోల హృదయాలు మనవి.

మనుషులు మనల్ని ఎన్ని విధాలుగా మోసం చేస్తారో.. ముక్కున వేలేసుకుంటూ.. గుడ్లప్పగించి చూస్తూ పేపర్లలోనూ, టివిల్లోనూ, ఫేస్ బుక్కుల్లోనూ అవగాహన పెంచుకుంటున్నాం.

అదే మనుషులు మనకు మేలూ చేస్తారంటే వీసమెత్తయినా నమ్మకం ఉండట్లేదు :)

"ఈ మనుషుులేమిటీ.. వీళ్లని గానీ నమ్మాలి నట్టేట ముంచేస్తారు" అని జూలో సింహాన్ని చూస్తూ దూరం దూరంగా జరిగినట్లు ఓ అనుమానపు కన్ను పడేసి వేగంవేగంగా మనుషులకు దూరంగా పారిపోతుంటాం. నిజమే.. మన అపనమ్మకాలకు సహేతుకమైన కారణాలే ఉన్నాయి.

మోసగాళ్లు నమ్మించడం ఎలాగో బ్రహ్మాంఢంగా నేర్చుకుని.. మరీ నమ్మించి మోసం చేస్తున్నారు. దీంతో నమ్మదగ్గ వాళ్లూ మన తేరిపార చూపులకు బలైపోక తప్పట్లేదు. నిజంగా ఇది దారుణమైన స్థితి.

నిజాయితీపరులెప్పుడూ "కావాలంటే నన్ను టెస్ట్ చేసుకోండి" అని శల్యపరీక్షలకు నిలవరు.. "నమ్మితే నమ్మండి... లేకపోతే పొండి" అని విదిలించుకుని వెళ్తారు. ఆ విదిలింతలు మనకు లెక్కలేనితనంగా తోస్తాయి, మన అహాలు గాయపడతాయి. వాళ్లెంత నిజాయితీపరులైనా మన అహాలు గాయపడ్డాక వారి మొహం చూడను కూడా చూడం :)

అదే మోసగాళ్ల మానసిక వనరులన్నీ overclock చెయ్యబడి పనిచేస్తుంటాయి :) తమపై అనుమానం వచ్చిందన్న అనుమానం వచ్చిన తక్షణం లౌక్యంతో వంద స్కెచ్లు వేస్తారు.

మన అనుమానాలు వారి తేనెపూసిన ప్రవర్తనల ముందు వీగిపోతాయి. మనం లొంగిపోతాం.

పై రెండు ఉదాహరణల్లో ఏం జరిగింది?

ఓ చోట మన అహం దెబ్బతింది.. మనం మాత్రం మోసపోలేదు.

మరోచోట మన ఇగో సంతృప్తిపరచబడింది.. మనం మాత్రం మోసగించబడ్డాం.

అయినా మనకు రెండోదే కావాలి :)

అందుకే ఈ ప్రపంచంలో చాలామంది నిజాయితీపరులకూ కాలుతూ ఉంటుంది.. ఈ జనాల్ని మోసం చేసి బ్రతికితే కానీ వీళ్లకి తెలిసి రాదు నమ్మకం విలువ అని! :)

చాలామందికి చాలాసార్లు "జనాల్ని మోసం చేయడమే కరెక్ట్" అనే ఫీలింగ్ కలుగుతోందంటే.. అది సమాజం పతనానికి నాంది.

మనుషులపై నమ్మకాలు పెంచుకోవలసిందీ మనమే.. కలుపు మొక్కల్ని సమిష్టిగా ఏరివేయవలసిందీ మనమే...

కలుపు మొక్కలే చేనంతా నిండిపోతే అవి ఆ చేనుని బీడు చేయంది వదలవు..

అప్పుడు అందరం అందర్నీ అనుమానించుకుందాం.. చిన్న పిల్లాడి కళ్ల వైపూ పిరికి చూపులు చూద్దాం.. ఓ షెల్లో ఇరుక్కుని ఇరుక్కుని బ్రతికేద్దాం :)

#రక్తదానం_చేయండి అవకాశం ఉన్నోళ్లు తప్పక ఇవ్వండి.

మే 1 నుంచి దేశ వ్యాప్తంగా 18 ఏళ్ళు వయసు పైబడిన ప్రతి ఒక్కరికి covid vaccination వేయడం జరుగుతుంది.. ఒక సారి Vaccination వేశాక 60 రోజులు వరుకు మరల బ్లడ్ ఇవ్వడం చేయకూడదు..

రానున్న 3 నెలలు దేశ వ్యాప్తంగా రక్త నిల్వల కోరత రావొచ్చు.. కాబట్టి vaccination వేయించుకునే ప్రతి ఒక్కరు మే 1 లోపు బ్లడ్ డొనేషన్ చేయండి.. 🙏🙏 

#DonateBloodSaveLife

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

AP 2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు

2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు.  https://cse.ap.gov.in/loadacademictextbookpublicview?random=0.6384777802675639 Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

వెలుగులు నింపే ఉపాధి యజ్ఞంలో నేను సైతం అంటూ స్పందించిన మానవ దైవాలు...

చేయూత వార్షికోత్సవం సందర్భంగా ప్రతీ ఏడాది వారితో కలిసి... జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమంలో భాగస్వాములం అవుతున్నాం... గత ఏడాది ఆసరా లేక అక్షరం ఆగుతున్న చోట ఇద్దరు చిన్నారులకు మన ద్వారా ఫీజు చెల్లించిన విషయం మీకు విదితమే కదా... ఈ ఏడాది కూడా... ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపే అవకాశం మనకు వచ్చింది... వివరాల్లోకి వెళితే... ఇద్దరు ఒంటరి మహిళలు.. ఇద్దరు వితంతువులు... ఇద్దరిది చిన్న వయసు... ఒకరు ఒకవైపు కోల్పోయిన జీవితంతో పోరాడుతూ... అంగ వైకల్యం గల చిన్నారి ని పోషిస్తూ... ఒక బట్టలు కుట్టే షాపులో రోజు కూలీగా పనిచేస్తున్నారు... మరొకరిది కూడా ఇంత కన్నా దీనమైన పరిస్థితి... ఇద్దరి కష్టాన్ని తరచి చూస్తే.... మనం ఇద్దరికీ ఏమైనా రెండు కుట్టు మిషన్లు సమకూర్చగలిగితే వారి కాళ్ల పై వారు నిలబడగలరు.. వచ్చిన కొద్ది మొత్తం తో కుటుంబాన్ని కూడా పోషించుకోగలరు... ఇన్నాళ్లు సమస్య అన్నప్రతీసారి స్పందించాం... ఇప్పుడు కూడా రెండు కుటుంబాల్లో వెలుగులు నింపే అవకాశం మన ముంగిట నిలబడింది... ఒకరుగా చేయలేం... కానీ ఒకరికి ఒకరు జత కలిస్తే... ఒకటిగా చేయగలం... ఒక్కొక్క ఎలక్ట్రానిక్ సదుపాయం గల కుట్టు మిషన్ ఖరీదు 12,000/ రూపా...