సాయం అనగానే నిముషమైన ఆలోచన చేయడం లేదు..
ఆకలి అంటే అరక్షణంలో స్పందిస్తున్నారు..
ఎందుకంటే మనకు ఆకలి గురించి పూర్తిగా తెలుసు..
కానీ రక్త దానం చేసి ఒక జీవితాన్ని కాపాడమంటే..
ఒక జీవిత కాలం పాటు మనమంతా ఆలోచన చేస్తున్నాం..
ఎందుకంటే మనకు రక్తం అవసరమయ్యే పరిస్థితి చాలా తక్కువ..
కానీ రక్తం అవసరమున్న..
లక్షల హృదయాలు ఆరాటంగా..
ఆయాసపడుతూ...
ఉబికి వస్తున్న కంటి చెమ్మను తుడుచుకుంటూ...
ఆవేదనగా నడి రోడ్డుపై పరుగులు తీస్తున్నాయి....
భార్య కోసం.. భర్త..
తల్లి కోసం.. కొడుకు..
కూతురి కోసం.. తండ్రి..
అన్న కోసం.. చెల్లి
చెలిమి కోసం.. స్నేహితుడు..
బంధం ఏదైనా..
బ్రతికించుకోవాలని...
కనీసం చివరి చూపైనా దక్కించుకోవాలన్న వారి ఆరాటం..
వారి పోరాటం..
సత్తువని కోల్పోయి..
నిస్సత్తువుగా కూలబడిపోతున్నాయి..
ఏ దైవం అయినా రాకపోతుందా అని ఆశగా వెతుకుతూనే ఉన్నాయి..
ఆశల్ని పోగేసుకుంటూనే ఉన్నాయి..
భార్యను.. భర్తకు చేరువ చేయగలదేమో..?
కొడుకుని తల్లికి అందివ్వగలదేమో..?
ఒక అన్నకు చెల్లి ప్రేమానురాగాలను అందివ్వగలదేమో..?
స్పందించే హృదయమా?
ఒక్కసారి ఇటు చూడు..!
నువ్వు..
నీ నడక...
నీ అడుగు...
వందల మందికి స్ఫూర్తినిస్తుంది..
కాదు.. కాదు.. వందల ప్రాణాల్ని కాపాడుతుంది..!
ఒక్క బంధాన్ని అయినా బ్రతికించాలని..
మన సహచర సంస్థలైన టీమ్ సంకల్పo, టీమ్ చేయూత, టీమ్ హెల్పింగ్ వింగ్స్ కలిసి అడుగులు వేస్తున్నాయి.....
జీవితాలని నిలబెట్టగలిగే.. జీవితం మీది..
ప్రాణాలు పోయగలిగే.. సమర్థులు మీరు..
ఆలోచించండి...
పూర్తి కొవిడ్ నిబంధనలతో జరగబోయే మన ఈ బ్లడ్ క్యాంపు కి మీ సహకారం అందించండి.
వివిధ అపోహల మధ్య, రక్తదాతలు లేక.. కొట్టుమిట్టాడుతున్న ప్రాణాలకి.. దన్నుగా నిలబడదాం.. వారి జీవితాలని నిలబెడదాం..
రక్తదాతలు టీమ్ సంకల్పం 9697189189 నంబర్ కి కాల్ చేసి మీ వివరాలు పంపగలరు.🙏
స్థలం: అన్నవరం
రావిచెట్టు సెంటర్, ZPH స్కూల్
తేదీ: 25.04.2021
లక్ష్య కుటుంబ సభ్యులు ఎవరైనా అన్నవరం పరిసర ప్రాంతాలలో ఉంటే, ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తారని టీం లక్ష్య ఆశిస్తుంది...
రక్తం ఇవ్వలేనివారు కూడా, శిబిరానికి విచ్చేసి.. రక్తదాతలను ప్రోత్సహించండి.. మీ విలువైన సమయాన్ని ఒక మహోన్నత కార్యక్రమానికి కేటాయించండి..
Comments
Post a Comment