Skip to main content

నేటి మోటివేషన్... ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు చదవాల్సిన కథ



👌 గెలుపు 👌
""""""""""""""""""""""""""""
 విలాసవంతమైన జీవితాన్ని మెడలో వేసుకొని కులాసాగా తిరుగుతున్నాను, నాన్న కష్టపడి చదువుని కొనిస్తుంటే.. నేను చదువుకోవడం మానేసాను, రోజుకో డ్రస్ వేస్తూ పగటి వేషగాడిలా పచార్లు కొడుతున్నాను, చిన్నప్పటినుంచి ఇప్పటి వరకూ నాన్న చేసే హితబోధ ఒక్కటే,, 
    " ఒరేయ్ రాజు,, జీవితంలో గెలుపోటములు సమంజసం, కానీ ఎంత బాధవున్నా చివరికి గెలవాలి, మన వంశంలో దేనిలోను ఓడిపోయిన వాళ్ళు లేరు, బాగా గుర్తుపెట్టుకోరా.. "
    అంటున్న నాన్న మాట అప్పుడప్పుడు నా మస్తిష్క గూడులో తళుక్కున మెరుస్తుండేది, ఐనా అలవాటు పడిన మనసు ఒకవైపే ఒరిగిపోతుంటే ఆపే శక్తిని కోల్పోయాను. 

       మాది చాలా ఉన్నతమైన కుటుంబం డబ్బులోనే కాదు, పరపతిలోను గౌరవంలోను పెట్టింది పేరు, మా ఊరిపైన మాదే పెద్ద ఇల్లు, నేను ఒక్కగానొక్క కొడుకుని, గారాబంగా పెంచుతున్నారు, నాకు జలుబు చేస్తేనే చాలు అమ్మ అన్నం తినడం మాని నా బాగోగులు గురించే మదనపడేది, బాగా చదివించాలనే నాన్న పట్టుదలకు అవధులుండేవి కావు, పదవతరగతి పబ్లిక్ పరీక్ష రాయడానికి బయలుదేరిన ముందు నాన్న ఒక మాటన్నాడు, 
       " రాజు.. మీ పెదనాన్న కొడుకు విజెయ్ లేడూ,, పదవతరగతి ఫస్ట్ క్లాస్ లో పాసయ్యాడని ఊరాళ్ళందరు మెచ్చుకున్నార్రా.. అలాగే నువ్వు కూడా పరీక్షల్లో గెలవాల, "
    అనిన నాన్న ఆశయాన్ని నెరవేర్చాను, కన్నవారి కళ్ళల్లో ఆనందాన్ని చూసిన నాకు, నా జవితం ధన్యమైందనుకున్నాను, చదువులోనే కాదు ఆటల్లోను మేటిగా గెలుపొందాను, అన్నింటిలోను గెలుపును సాధిస్తున్న నన్ను చూసి అమ్మానాన్నలో సంతోషం హద్దులు చెరిపేసుకుంది, 
        " ఏమయ్యా సుందరం.. మీవాడు చదువులోనే కాదయ్యా మునుముందుకు అన్ని రంగాల్లోను గెలుస్తాడు "
  ప్రిన్సిపాల్ భక్తవత్సలం నాన్నతో అంటుంటే చెట్టు చాటున వుండి విని ఎగిరి గంతేసాను, 
     ఇన్నాళ్లు నాన్న తెచ్చింది తీసుకునేవాన్ని, ఇప్పుడు నేను కోరింది నాన్న తెచ్చిపెడుతున్నాడు, ఇంటర్ పూర్తి కాగానే డిగ్రీ చేయడానికి పట్టణం వెళ్ళాను, అక్కడే వుండి కాలేజ్ కు వెళ్ళాల్సి వచ్చింది. శెలవుల్లో కూడా ఇంటికి వెళ్ళడానికి తీరిక వుండేది కాదు, కావలసినంత డబ్బు నాన్నే పంపేవాడు, 

          యుక్త వయసు మీదపడి లోకజ్ఞానం బాగా ఒంటబట్టించుకున్నాక విజ్ఞానంతో బాటు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాను, కొత్త కొత్త స్నేహాలు, సరికొత్తగా కలసి వాళ్ళతో మెసలాకా.. కాలేజీ హాజరు పట్టీలో పర్సెంటేజీ తగ్గిపోయింది, ర్యాగింగ్ లు కామెంట్రీల జాడల్లో అడుగేసాక, అల్లరి గ్యాంగ్ లో నా పేరు మొదటికి చేరింది, సెల్ ఫోన్ కావాలని నాన్న కు తెలిపిన తక్షణం డబ్బు ఆగమేఘాలమీద దూసుకొచ్చింది.. సెల్ వాడకం మొదలయ్యాక అక్కడి నుండి మలుపు తిరిగింది, 

      కాలేజీలో దివ్యశ్రీ అనే అమ్మాయిని ప్రేమించాను, అంతే నాలో ఒక కొత్త మనిషి తయారయ్యాడు, మనసును మార్చేసాడు, ఆకల్ని దహించాడు. నిద్రని కోల్పోయి ప్రేమాన్వేషణలో తీరిక లేక ప్రతిక్షణం అలసిపోవాల్సి వచ్చింది, గంటల తరబడి సెల్ ఫోన్ లో దివ్యశ్రీతో మాట్లాడ్డానికి కరెన్సీని మంచినీళ్ళు లెక్కన ఖర్చు చేసాను, లేనిపోని అపద్దాలను నిజాలుగా నమ్మించి నాన్న పైకి అసత్యాల అస్త్రాలను సంధించి అధిక మొత్తంలో డబ్బు లాక్కొన్నాను, 

       క్లాసులు ఎగ్గొట్టి క్రికెట్ ఆటలో ఎక్కువ శాతం నిమగ్నం అయ్యాను. బెట్టింగ్ లో వేలకు వేలు డబ్బులు పోగొట్టాను, మందుకు, విందుకు, షికార్లకు తీరిక లేక వెళ్ళి, తీవ్రంగా నష్టపోయాను, చెడు వ్యసనాలు నా చుట్టూ చేరి పీడించడం మొదలు పెట్టాకా విద్యార్థికున్న లక్షణాలన్నింటిని కోల్పోవాల్సి వచ్చింది, బంద్ లకు రాస్తారోకోలకు వెళ్ళవద్దని నాన్న చాలా సార్లు ఫోన్ చేసి చెప్పాడు ఐనా ససేమిరా అంటూ ముందుకు కదిలాను, 

       ఒకరోజు దివ్యశ్రీకి ఒంట్లో నలతగా వుందని ఫోన్ చేసిన అరనిమిషంలోనే నాన్న ఫోన్ చేసి 
     " బాబు... మీ అమ్మకు ఒళ్ళు బాగోలేదు. నిన్ను చూడాలంటోంది ఒకసారి వచ్చిపోరా... "
అన్నాడు, ఎటు వెళ్ళాలో దిక్కుతోచడం లేదు, ప్రియురాలిపైగల ప్రేమ ముందు అమ్మపై గల ప్రేమ ఓడిపోయింది, 
       అంతే... ఆరోజునుండి నాన్న ఫోన్ చేయడం మానేసాడు, ఇదివరకే నాన్న పంపిన డబ్బులు సంవత్సరం పాటు నా విలాసవంతమైన జీవితానికి పనికొచ్చాయి, చాలా రోజులకు అమ్మ నాన్నను చూడాలనిపించింది, సెల్ ఫోన్ విక్రయించగా వచ్చిన డబ్బుతో ఊరికి బయలుదేరాను. 

       సొంత ఊర్లో బస్సు దిగి రెండడుగులు ముందుకు వేయగానే మాసిపోయిన చొక్కా.. చిందరవందరగా వున్న జుత్తు, ముక్కుల్లోకి దుమ్ము పడకుండా అర్దం ముఖాన్ని కప్పుతూ చుట్టుకున్న గుడ్డ.. ఆటోలో రెడీగా కూర్చుని వున్నాడు వెళ్ళి 
     " ఏమయ్యా... టవర్ క్లాక్ పక్క వీధికి వస్తావా "
అనడిగాను 
       " ఎక్కండి బాబు " అన్నాడతను ఎక్కి కూర్చున్న.... ఆటో కదిలింది.. దారిలో వైన్ షాప్ ముందు ఆపించాను. 
      " మందు అలవాటుందా...? "
అనడిగాను.. లేదన్నట్టు తలూపాడు అతను. నేను చక చకా బార్లోకి వెళ్ళి ఒక పెగ్గు మందు లాగించి. తిరిగి ఆటో ఎక్కి కూర్చున్నాను

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్... ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి ఫలితాలు విడుదల...

10th results link: 1 10th results link: 2 Direct link 10th results link: 3 10th results link: 4 10th results link: 5  100% working link use this all 10th results link: 6  most searched link 10th results link: 7 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺