Skip to main content

నేటి మోటివేషన్... పిడికెడు ఉప్పు..!!



ఒక యువకుడు తన గురువు దగ్గరికెళ్ళి ఇలా చెప్పాడు..!స్వామీజీ...నా జీవితమంతా కష్టాలే..ఈ జీవితాన్ని భరించలేకపోతున్నాను..దయచేసి నా కష్టాలు తీరే మార్గo చెప్పండి.

అప్పుడు గురువు ఆ యువకుడి వైపు చూశాడు..
ఒక గ్లాసు నీటిలో ఒక పిడికెడు ఉప్పు వేయమన్నాడు..
యువకుడు అలాగే చేశాడు.ఇప్పుడు ఆ నీటిని తాగు అన్నాడు గురువు..యువకుడు గ్లాసు పైకెత్తాడు..ఆ నీటిని తాగాడు..వెంటనే ఉమ్మేశాడు..అబ్బ... భరిoచలేని ఉప్పు అన్నాడు.

ఇంకో పిడికెడు ఉప్పు తీసుకుని...ఆ యువకుడిని చెరువు దగ్గరకు తీసుకెళ్లాడు గురువు.ఈ ఉప్పు ఈ చెరువులో వేసి ఈ నీళ్ళని తాగు అని చెప్పాడు గురువు.
ఆ యువకుడు చెరువు నీటిని గడగడా తాగేశాడు.

ఎలా ఉన్నాయి ఈ నీళ్ళు..?? అడిగాడు గురువు..
నీరు తీయగా ఉంది. చెప్పాడు ఆ యువకుడు.
అదే పిడికెడు ఉప్పు, అప్పుడెందుకు భరించలేక పోయావు..ఇప్పుడెలా భరించావు.. అడిగాడు గురువు..

అప్పడు ఆ యువకుడు ఇలా చెప్పాడు.అది తక్కువ నీరు...గ్లాసుడు నీరు..అందుకే ఉప్పగా ఉంది.
ఇది చెరువు..అంటే ఎక్కువ నీరు..
అందుకే ఉప్పదనం లేదు..అన్నాడు యువకుడు..

అప్పుడు ఆ గురువు ఇలా చెప్పాడు..నాయనా..
సమస్యలు పిడికెడు ఉప్పు లాంటివి.అది గ్లాసులోనూ పిడికెడే...చెరువులోనూ పిడికెడే...

కానీ నీ జీవితం గ్లాసులా ఉండాలా..చెరువులా ఉండాలా అన్నది మాత్రం నువ్వే నిర్ణయించుకోవాలి...

నీ ఆలోచనా శక్తి, సహన శక్తి పరిధి పెరిగితే పిడికెడు ఉప్పు తక్కువవుతుంది...ఆ పరిధి సంకుచితమైతే పిడికెడు ఉప్పు భరించలేనంత అవుతుంది" అన్నారు గురువు. 

పరిస్థితి అవగాహన చేసుకొని జీవితాన్ని నందనవనం చేసుకున్నాడా యువకుడు...స్వస్తి..!!

లోకా సమస్తా సుఖినోభవంతు..!!

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

🚨 తల్లికి వందనం స్టేటస్ కోసం ఈ లింక్ చెక్ చేయండి

తల్లికి వందనం పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థిక సహాయం జమ చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. 💰 https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout మీ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో, దరఖాస్తు ఆమోదం పొందిందో లేదో ముందుగానే తెలుసుకోవడం కోసం పై లింక్ ఓపెన్ చేసి... మీ అబ్బాయి/అమ్మాయి ఆధార్ enter చేయండి  కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఒకే కుటుంబంలో అర్హత కలిగిన ఒక్కరికంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే, ప్రతి విద్యార్థికి విడివిడిగా ప్రయోజనం అందే అవకాశం ఉంది. క్రింది కారణాల వల్ల మీ దరఖాస్తు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది: ❌ అర్హత నిబంధనలకు సంబంధించిన వివరాలు సరిపోకపోతే ❌ బ్యాంక్ ఖాతా ఆధార్ మరియు NPCIతో అనుసంధానం కాకపోతే ❌ ఇతర ధృవీకరణ వివరాల్లో లోపాలు ఉంటే మీ ఆధార్ వివరాలతో ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో స్టేటస్‌ను సులభంగా పరిశీలించవచ్చు. 📱 మరిన్ని వివరాల కోసం: https://apgovtschemes.com/thalliki-vandanam-status-check-2026-27/ https://apgovtschemes.com/thalliki-vandanam-status-check-2026-27/ 📢 గమనిక: తుది అర్హత, చెల్లింపు తేదీలు మరియు నిబంధనలు ప్రభుత్వ అధికారిక ప్రకటనల ఆధారంగా మారవచ్చు. 🏹Lakshya🇮...

📢 టెట్ (TET) సిలబస్ తెలుగులో (Direct PDF Download Links) 📄

మీరు టెట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారా? అయితే సిలబస్ కోసం వెతకాల్సిన అవసరం లేదు! క్రింది డైరెక్ట్ లింక్స్ పై క్లిక్ చేసి, సిలబస్‌ను తెలుగులో నేరుగా మీ మొబైల్‌లో PDF రూపంలో డౌన్లోడ్ చేసుకోండి. 👇 సిలబస్ డౌన్లోడ్ లింకులు ఇవే: 📄 టెట్ పేపర్-1(ఎ) 📥 https://drive.google.com/uc?export=download&id=1SVUkSkRXt9E97-TLazh2P8MAPMwyUOSe 📄 టెట్ పేపర్-1(బి) 📥 https://drive.google.com/uc?export=download&id=1IN2yDR7F8b71wM-iP1cMT-Q8ZSTxCmOT 📄 టెట్ పేపర్-2(ఎ) మ్యాథ్స్ & సైన్స్ 📥 https://drive.google.com/uc?export=download&id=1ztvQ-kCs1N1IgBsJXeCAgiMUxPTdZgMr 📄 టెట్ పేపర్-2(ఎ) సోషల్ స్టడీస్ 📥 https://drive.google.com/uc?export=download&id=1jI-sVBtAhBENkfs5v4oMU3LpGjR1kv6R 📄 టెట్ పేపర్-2(ఎ) తెలుగు 📥 https://drive.google.com/uc?export=download&id=1GlZVJyH4i5BkWg3UlkvsJeWWW1-cRAh5 📄 టెట్ పేపర్-2(బి) స్పెషల్ ఎడ్యుకేషన్ 📥 https://drive.google.com/uc?export=download&id=1wz4e_jAXwmZoKpHdyyowz2BeMcgOzz_7 Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺