Skip to main content

నేటి మోటివేషన్... తప్పక ఆచరించాలి బాస్...



అనగనగా ఒక చిన్న అడవిలో రెండు బాతు పిల్లలు ఉండేవి. అవి ఎప్పుడు ఏవో ఒక పోటీ పెట్టుకునేవి. పరుగు పందేమో , ఈతల పోటీయో , ఎగిరే పోటీయో పెట్టుకుని సంతోషిస్తుండేవి, అవి ఆడుకునేందుకు వెళ్ళినప్పుడు తల్లి బాతు చాలా జాగ్రత్తలు చెప్పేది. పిల్లలు ఆ జాగ్రతలన్ని పాటించి ఆటలన్ని ముగిశాక క్షేమంగా తిరిగి వస్తుండేవి.
ఒకరోజు అవి ఒక నదిలో ఈత పోటీ పెట్టుకున్నాయ్ . రెండు ఒకేసారి ఈదడం మొదలుపెట్టాయి.ఒక బాతు పిల్ల నీటి ప్రవాహం ఎక్కువగా లేని వైపునుంచే ఈదుకుంటూ వెళ్తుంది. కానీ రెండోది మాత్రం ఎక్కువ కష్టపడి ఈదకుండా గమ్యాన్ని త్వరగా చేరుకోవాలని ఆతృతతో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నవైపుకు వెళ్ళింది.
"నీరు వేగంగా ప్రవహిస్తున్న వైపు ఈదకూడదు . కొట్టుకుపోతారు. అటువైపు సుడుగుండాలు కూడా ఉంటాయి. అందుకే అటువైపు వెళ్లకూడదు" అని తల్లి చెప్పిన మాటలు గుర్తుకువచ్చాయి. కాసేపు ఆలోచించి "నేను ఇప్పుడు కాస్త పెద్దగా అయ్యాను కదా ఏమి పర్వలేదులే" అనుకుంది బాతుపిల్ల. ఇంతలోనే ప్రమాదం ముంచుకొచ్చింది. వేగంగా ప్రవహిస్తున్న నీటితో పాటు బాతు కొట్టుకుపోసాగింది. బాతుపిల్ల భయపడింది. తల్లి చెప్పిన మాట వినకపోవడం వల్లే ఇంత పెద్ద ప్రమాదంలో పడ్డానని బాధ పడింది.
ఇంకో బాతుపిల్ల దానిని గమనించింది . కానీ ఏమిచేయలేక నిస్సహాయంగా బాధపడుతూ చూస్తూ ఉండిపోయింది.
ఇదంతా అక్కడ ఒక పెద్ద చెట్టు మీద ఉన్న ఒక కోతి గమనించింది. ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీదికి దూకుతూ ఒక చెట్టు కొమ్మ మీద నుండి నదిలోకి వేలాడుతూ తోకతో బాతుపిల్లను బయటకు లాగేసింది.
బాతుపిల్ల ప్రమాదం నుంచి బయటపడింది . రెండు బాతుపిల్లలు కోతికి కృతజ్ఞతలు తెలిపాయి.
ప్రమాదం అంటే ఏమిటో ఎలా ఉంటుందో అనుభవపూర్వకంగా తెలుసుకున్న బాతుపిల్ల అప్పట్నుంచి తల్లి చెప్పిన జాగ్రతలన్నిట్నీ పాటించడం మొదలుపెట్టింది.
నీతి పెద్దలు
చెప్పిన మాట తప్పక ఆచరించాలి.🙏

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

AP 2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు

2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు.  https://cse.ap.gov.in/loadacademictextbookpublicview?random=0.6384777802675639 Lakshya Educational Groups

TET అభ్యర్థులకు ఉపయోగకరమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్

TET పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఒక ప్రత్యేకమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో మీరు ఎన్ని సార్లైనా పరీక్ష రాయవచ్చు. ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం రూపొందించబడటం దీని ప్రత్యేకత. ఈ మాక్ టెస్టులు విస్తృతమైన ప్రశ్నల బ్యాంక్ ఆధారంగా రూపొందించబడుతున్నందున, ప్రతి పరీక్షలో భిన్నమైన ప్రశ్నలు ఎదురవుతాయి. దీనివల్ల ఒకే రకమైన ప్రశ్నలు పదేపదే రావడం తగ్గి, అభ్యర్థులు వివిధ అంశాలపై మెరుగైన అవగాహన పెంపొందించుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా: • అపరిమిత సంఖ్యలో మాక్ టెస్టులు రాయవచ్చు. • ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం లభిస్తుంది. • విభిన్న అంశాలపై ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. • పరీక్షా సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. • మీ బలాలు, బలహీనతలను గుర్తించి వాటిపై మరింత దృష్టి పెట్టవచ్చు. • కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు అలవాటు పడేందుకు ఇది ఉపయోగపడుతుంది. • కంప్యూటర్ వినియోగంలో అనుభవం తక్కువగా ఉన్న అభ్యర్థులు కూడా ముందుగానే ప్రాక్టీస్ చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. నిరంతరంగా మాక్ టెస్టులు రాయడం ద్వారా పరీక్షా భయం తగ్గి, నిజమైన TET పరీక్షలో ...

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺