Skip to main content

నేటి మోటివేషన్... నలుగురు భార్యలు



      ఒక వ్యక్తికి నలుగురు భార్యలు. వారిలో నాల్గవ భార్యంటే అతనికి ప్రేమ ఎక్కువ. ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. బెస్ట్ అన్నీ ఆమెకు ఇచ్చాడు.

మూడవ భార్యను కూడా ప్రేమిస్తున్నాడు. ఆమెను తన స్నేహితులకు చూపించాలని కోరుకుంటాడు. అయితే, ఆమె వేరే వ్యక్తితో పారిపోతుందనే భయం ఉండేది.

రెండవ భార్యంటే కూడా ఇష్టమే. అతనికి సమస్యలు ఎదురైనప్పుడల్లా ఆమె వైపు చూసేవాడు. ఆమె అతనికి సహాయం చేసేది

మొదటి భార్యను అస్సలు ప్రేమించలేదు. కానీ ఆమె మాత్రం అతన్ని గాఢంగా ప్రేమించేది. అతనికి విధేయంగా ఉండేది. అతనిని చాలా జాగ్రత్తగా చూసుకునేది.

ఒక రోజు ఆ వ్యక్తి చాలా అనారోగ్యానికి గురయ్యాడు, త్వరలోనే చనిపోతాడని తెలుసుకున్నాడు. "నాకు నలుగురు భార్యలు ఉన్నారు, నేను చనిపోయినప్పుడు వారిలో ఒకరిని నాతో పాటు తీసుకెళ్తాను, మరణంలోనూ నాకు తోడుంటుంది" అనుకున్నాడు.

తనకెంతో ఇష్టమైన నాల్గవ భార్యను తనతో పాటు సహగమనం చేయమని కోరాడు. "ప్రసక్తే లేదు!" అని మరొక మాట లేకుండా వెళ్ళిపోయింది.

తన మూడవ భార్యను అడిగాడు. "మీరు చనిపోతే నేనెందుకు చావాలి. నేను తిరిగి వివాహం చేసుకుంటాను" అని చెప్పి వెళ్లిపోయింది.

అనంతరం తన రెండవ భార్యను అడిగాడు. "నన్ను క్షమించండి. మీ సమాధి వరకు మాత్రమే రాగలను." అని స్పష్టం చేసింది.

తాను అమితంగా ప్రేమించిన ముగ్గురు భార్యలూ అలా చెప్పేసరికి అతను విషాదంలో మునిగిపోయాడు. అప్పుడు "మీకు నేనున్నాను. మీరు ఎక్కడికి వెళ్ళినా నేను మిమ్మల్ని అనుసరిస్తాను" అని ఒక స్వరం వినిపించింది.

ఎవరా... అని తలెత్తి చూశాడు. సన్నగా పీలగా మొదటి భార్య కనిపించింది. ఆమె పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లుగా ఉంది. "నేను నిన్ను బాగా చూసుకుని ఉండాల్సింది" అని చాలా బాధపడ్డాడు.

మనందరికీ జీవితంలో నలుగురు భార్యలు ఉన్నారు.

నాల్గవ భార్య మన శరీరం. అందంగా కనిపించడం కోసం మనం ఎంత సమయం, శ్రమ చేసినా మరణంతో అది మనలను వదిలివేస్తుంది.

మూడవ భార్య మన ఆస్తిపాస్తులు, హోదా, సంపద. మనం చనిపోయినప్పుడు ఇతరుల వద్దకు చేరుతుంది.

రెండవ భార్య మా కుటుంబం మరియు స్నేహితులు. మనం జీవించి ఉన్నప్పుడు ఎంత దగ్గరగా ఉన్నా, సమాధి వరకు మాత్రమే రాగలరు.

మొదటి భార్య మన ఆత్మ సంతృప్తి (fulfillment). భౌతిక సంపద, కీర్తి ప్రతిష్టల కోసం దాన్నిఎంత నిర్లక్ష్యం చేసినా, మరణంలోనూ అది మనలను అనుసరిస్తుంది.

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

భారత రాజ్యాంగములో మొత్తం ఆర్టికల్స్ వివరాలు ...

ఆర్టికల్ సంఖ్య మరియు పేరు ఆర్టికల్ 1 - యూనియన్ పేరు మరియు భూభాగం ఆర్టికల్ 2 - కొత్త రాష్ట్రాల ప్రవేశం లేదా స్థాపన ఆర్టికల్ 3 - రాష్ట్రం యొక్క సృష్టి మరియు సరిహద్దులు లేదా పేర్ల మార్పు ఆర్టికల్ 4 - మొదటి షెడ్యూల్డ్ మరియు నాల్గవ షెడ్యూల్స్కు సవరణలు మరియు రెండు మరియు మూడు కింద చేసిన శాసనాలు ఆర్టికల్ 5 - రాజ్యాంగం ప్రారంభంలో పౌరులు ఆర్టికల్ 6 - పాకిస్తాన్ నుండి భారతదేశానికి వస్తున్న కొంతమంది వ్యక్తుల పౌరసత్వ హక్కులు ఆర్టికల్ 7 - భారతదేశం నుండి పాకిస్తాన్ వెళ్లేవారికి కొంతమంది వ్యక్తుల పౌరసత్వ హక్కులు ఆర్టికల్ 8 - భారతదేశం వెలుపల నివసిస్తున్న వ్యక్తుల పౌరసత్వ హక్కులు ఆర్టికల్ 9 - స్వచ్ఛందంగా విదేశీ రాష్ట్ర పౌరసత్వం తీసుకుంటే భారత పౌరుడు కాదు ఆర్టికల్ 10 - పౌరసత్వ హక్కుల నిలకడ ఆర్టికల్ 11 - పౌరసత్వం కోసం చట్టాన్ని పార్లమెంట్ నియంత్రిస్తుంది ఆర్టికల్ 12 - రాష్ట్ర నిర్వచనం ఆర్టికల్ 13 - ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే లేదా అవమానించే చట్టాలు ఆర్టికల్ 14 - చట్టం ముందు సమానత్వం ఆర్టికల్ 15 - మతం, కులం, లింగం, సంతతి లేదా పుట్టిన ప్రదేశం ఆధారంగా వివక్షను నిషేధించడం ఆర్టికల్ 16 - ...

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ