Skip to main content

నేటి మోటివేషన్... ఆ... కొడుకుల కోసమే ఈ పోస్ట్



గమనిక: ఇది కొంత మందిని ఉద్దేశించి మాత్రమే. ఆ కొంత మందిలో మీరు లేకపోతె ఈ పోస్ట్ మీకు తప్పకుండా నచ్చుతుంది.

"ఒంటి మీదకి ముప్పై ఏళ్ళు" వస్తున్నా.... అమ్మా బాబు సంపాదన మెక్కుతున్న సన్నాసుల్లారా..... మీకే చెప్తున్నా వినండి.

మీరేదో పొడిచేసి చించేసి చదివిన చదువుకి సరిపడిన ఉద్యోగం రాలేదు అని ఏడుస్తూ, ప్రభుత్వాన్ని నిందిస్తూ సంవత్సరాల తరబడి రోడ్డున పడి తిరిగేటపుడు ఒక్క క్షణం ఐన ఆలోచించారా...? 
నీ భవిష్యత్తు కోసం, నీ చదువు కోసం ఇప్పటికి నీ తండ్రి ఓ కూలివాడిలా, ముసలి ఎద్దులా పని చేస్తున్నాడని...

 ఉడుకు రక్తం... ఉడుకు రక్తం... అని విర్రవీగే ఓ మనుషుల్లారా రంగులు పూసుకునే వాళ్ళ వెనక పరిగెత్తడం కాదు.... నీ జీవితం కోసం పరిగెత్తు....
 
ఎవడో వస్తాడు, ఎదో చేస్తాడు...! ఆడొస్తే అది చేస్తాడు, ఈడొస్తే ఇది చేస్తాడు... అన్నది కాదు నువ్వెవరు? నువ్వేం చేస్తావ్? నీకోసం ఎం చేస్తావ్? ఎప్పుడైనా చేసావా?
కనీసం ఆలోచన ఐన చేసావా ? 

టైం బాలేదు, టైం రాలేదు అని కూసే నువ్వు ఏ రోజు ఐన టైంకి లేచావా ? ఏ పని ఐన సక్రమంగా చేసావా ?
ఇంట్లో అమ్మ పాల పాకెట్ తెమ్మంటే కదలవు...... అదే నీ ఫ్రెండ్ రాత్రి 2 కి బీరేద్దాం రమ్మంటే పరుగెత్తికెళ్తావ్ ....! నీకు ఎలా వస్తుంది టైము?

దేవుడు నీ రాత సరిగా రాయలేదని నిందించే బదులు....!
నీ తల్లి తండ్రులే నీ దేవుళ్ళు అని ఎప్పుడైనా గుర్తించావా ?
ఏనాడైనా వాళ్ళకి చేతులెత్తి మొక్కవా ?
మనసారా అమ్మనాన్నతో ఒక్కసారి ఐన మాట్లాడవా?  
ఆడి బాబుకి అంత ఉంది, ఈడీకి ఇంత ఉంది, నా బాబు నాకేమి ఇచ్చాడు అని మాట్లాడే నువ్వు...

నువ్వేమి సాధించడానికి వచ్చావో నిరూపించుకో.....! 

ఇంట్లో నాన్న వేసుకునే మాత్రలు అయిపోతే పట్టించుకోని నువ్వు...... ఎవత్తో ఫేస్బుక్ లో పరిచయం ఐన అమ్మాయికి రీఛార్జ్ కోసం, లిఫ్ట్ ఇవ్వడం కోసం పరిగెడతావ్. తూ.... నీ  

ఈ మధ్య ఇదొక ఫ్యాషన్ "Breakup feeling" 
అమ్మాయి మోసం చేసిందట తాగేసి, గడ్డాలు మీసాలు పెంచేసుకొని ఊరిమీద ఆంబోతులా తిరగటం.....!

నువ్వేదో వైట్ కాలర్ జాబ్ చేస్తావని, సుఖంగా AC లో కూర్చుని పనిచేసుకుంటావని కలలు కన్న నీ తండ్రి నిన్ను అలా చూసి ఎంత కుమిలిపోతాడో ఆలోచించావా ? 

(ఇక్కడ ఇంకో విధంగా రివర్స్ అవుతారేమో అమ్మాయే మోసం చేసింది, అమ్మాయిలే అబ్బాయిల్ని నాశనం చేస్తారు అని ...!) 
చిన్నా....... ఒకటి గుర్తుంచుకో "మోస పోయాం" అంటే అది ఎదుటివాళ్ళ తెలివి కాదు......! నీ చేతకానితనం 

ప్రేమించిన అమ్మాయి కోసం చస్తావా....?
ఎవడిచ్చాడు నీకా హక్కు ? అసలు ప్రేమంటే ఏంటో తెలుసా...?
నీకు ఉద్యోగం లేదని నిన్ను ప్రేమించిన అమ్మాయిని వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే తప్పేంటి.... ?

నీ చెల్లెలిని ఒక ఉద్యోగం లేనివాడికి, నీకు సరిగా నమ్మకం కుదరని వాడికి నీ చెల్లెల్ని ఇచ్చి నువ్వు పెళ్లి చేస్తావా ? చెప్పు.....!

ప్రేమించడానికి మనసులు, ఇష్టాయిష్టాలు కలిస్తే సరిపోతుందని తెలిసిన నీకు పెళ్లి కి రెండు కుటుంబాలు కలవాలి, నీకు యోగ్యత ఉండాలి అనే ఇంగిత జ్ఞానం కూడా లేదా ?
ఎవడిస్తాడు నీకు పిల్లని ....? 
నువ్వెంటో నిరూపించుకో ....!
ప్రేమ పుట్టడానికి ఒక్క క్షణం చాలు...! కానీ అదే ప్రేమని నిలబెట్టుకున్న వాడే అసలైన మగాడు.  
నువ్వు మగాడివైతేనే ప్రేమించు ...! 
ఇది పోటీ ప్రపంచం...! ఊరికే ఏది రాదు...!

కావలసిన దానికోసం పరిగెత్తాలి,పోరాడాలి, ప్రాధేయపడాలి...... తప్పని సరి పరిస్థితుల్లో తల వంచాలి...!     
అది అమ్మాయి ఐన, ఉద్యోగం ఐన... ఇంకేదైనా...!
 
ప్రతి ఇంటికి కొన్ని పద్ధతులు ఉంటాయి అవి పాటించండి, తల్లి తండ్రుల్ని ప్రేమించండి, గౌరవించండి...!
ఇంట్లో వాళ్ళ మనసు నొప్పించి ఎన్ని గుళ్ళు తిరిగినా, ఎన్ని పూజలు, జపాలు చేసినా వ్యర్థమే ...!

గుర్తుంచుకో ఇప్పుడు కాదు ఎపుడైనా సరే నీ ఇంట్లో వాళ్ళ మనసు గెలుచుకోకుండా నువ్వు ఎం గెలుచుకున్న వ్యర్థమే.

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Post a Comment

Popular posts

🚨 తల్లికి వందనం స్టేటస్ కోసం ఈ లింక్ చెక్ చేయండి

తల్లికి వందనం పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థిక సహాయం జమ చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. 💰 https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout మీ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో, దరఖాస్తు ఆమోదం పొందిందో లేదో ముందుగానే తెలుసుకోవడం కోసం పై లింక్ ఓపెన్ చేసి... మీ అబ్బాయి/అమ్మాయి ఆధార్ enter చేయండి  కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఒకే కుటుంబంలో అర్హత కలిగిన ఒక్కరికంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే, ప్రతి విద్యార్థికి విడివిడిగా ప్రయోజనం అందే అవకాశం ఉంది. క్రింది కారణాల వల్ల మీ దరఖాస్తు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది: ❌ అర్హత నిబంధనలకు సంబంధించిన వివరాలు సరిపోకపోతే ❌ బ్యాంక్ ఖాతా ఆధార్ మరియు NPCIతో అనుసంధానం కాకపోతే ❌ ఇతర ధృవీకరణ వివరాల్లో లోపాలు ఉంటే మీ ఆధార్ వివరాలతో ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో స్టేటస్‌ను సులభంగా పరిశీలించవచ్చు. 📱 మరిన్ని వివరాల కోసం: https://apgovtschemes.com/thalliki-vandanam-status-check-2026-27/ https://apgovtschemes.com/thalliki-vandanam-status-check-2026-27/ 📢 గమనిక: తుది అర్హత, చెల్లింపు తేదీలు మరియు నిబంధనలు ప్రభుత్వ అధికారిక ప్రకటనల ఆధారంగా మారవచ్చు. 🏹Lakshya🇮...

📢 టెట్ (TET) సిలబస్ తెలుగులో (Direct PDF Download Links) 📄

మీరు టెట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారా? అయితే సిలబస్ కోసం వెతకాల్సిన అవసరం లేదు! క్రింది డైరెక్ట్ లింక్స్ పై క్లిక్ చేసి, సిలబస్‌ను తెలుగులో నేరుగా మీ మొబైల్‌లో PDF రూపంలో డౌన్లోడ్ చేసుకోండి. 👇 సిలబస్ డౌన్లోడ్ లింకులు ఇవే: 📄 టెట్ పేపర్-1(ఎ) 📥 https://drive.google.com/uc?export=download&id=1SVUkSkRXt9E97-TLazh2P8MAPMwyUOSe 📄 టెట్ పేపర్-1(బి) 📥 https://drive.google.com/uc?export=download&id=1IN2yDR7F8b71wM-iP1cMT-Q8ZSTxCmOT 📄 టెట్ పేపర్-2(ఎ) మ్యాథ్స్ & సైన్స్ 📥 https://drive.google.com/uc?export=download&id=1ztvQ-kCs1N1IgBsJXeCAgiMUxPTdZgMr 📄 టెట్ పేపర్-2(ఎ) సోషల్ స్టడీస్ 📥 https://drive.google.com/uc?export=download&id=1jI-sVBtAhBENkfs5v4oMU3LpGjR1kv6R 📄 టెట్ పేపర్-2(ఎ) తెలుగు 📥 https://drive.google.com/uc?export=download&id=1GlZVJyH4i5BkWg3UlkvsJeWWW1-cRAh5 📄 టెట్ పేపర్-2(బి) స్పెషల్ ఎడ్యుకేషన్ 📥 https://drive.google.com/uc?export=download&id=1wz4e_jAXwmZoKpHdyyowz2BeMcgOzz_7 Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺