Skip to main content

కోవిడ్ వాక్సిన్ గురించి వచ్చే సందేహాలు, సమాధానాలు...



1. కోవాగ్జిన్, కోవిషీల్డ్‌లో ఏది మంచిది?

మ‌న దేశంలో ప్ర‌స్తుతం రెండు వ్యాక్సిన్ల‌ను అందిస్తున్నారు. ఇందులో మ‌న‌కు న‌చ్చిన వ్యాక్సిన్‌ను ఎంచుకునేందుకు అవ‌కాశం లేదు. టీకా కేంద్రాల్లో ఏది అందుబాటులో ఉంటే అది వేస్తున్నారు. అయితే ఇందులో ఒక‌టి మంచిది, ఇంకోటి కాదు అని ఏమీ లేదు. ఇవి రెండూ కూడా క‌రోనా వైర‌స్‌పై స‌మ‌ర్థంగా ప‌నిచేస్తాయ‌ని ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. అందువ‌ల్ల రెండింటిలో ఏ వ్యాక్సిన్ అయినా తీసుకోవ‌చ్చు.

2. మొద‌టి డోస్ ఒక టీకా, రెండో డోస్‌లో ఇంకో టీకా వేసుకోవ‌చ్చా?

కోవాగ్జిన్ ఇన్‌యాక్టివేటెడ్ ప్లాట్‌ఫాంపై త‌యారైంది. కోవిషీల్డ్ వైర‌ల్ వెక్ట‌ర్ ప్లాట్‌ఫాంపై ఆధార‌ప‌డి ఉంటుంది. అందువ‌ల్ల రెండు టీకాల‌ను క‌లిపి తీసుకోవ‌డం మంచిది కాదు. క‌రోనావైర‌స్‌ను ఎదుర్కొనేందుకు రెండు డోసుల్లోనూ ఏదో ఒక వ్యాక్సిన్‌ను మాత్ర‌మే తీసుకోవాలి.

3. క‌రోనా బారిన ప‌డి కోలుకుంటే వ్యాక్సిన్ అవ‌స‌ర‌మా?

గ‌తంలో క‌రోనా బారిన ప‌డిన వారు కూడా వ్యాక్సిన్ తీసుకోవాలి. దీనివ‌ల్ల యాంటీబాడీలు పూర్తిస్థాయిలో ఉత్ప‌త్తి అవుతాయి. దీనివ‌ల్ల మ‌ళ్లీ వైర‌స్ సోకే ప్ర‌మాదం త‌గ్గుతుంది.

4. మొద‌టి డోస్ తీసుకున్న త‌ర్వాత క‌రోనా వ‌స్తే ఎలా?

క‌రోనా నుంచి కోలుకున్న రెండు వారాల‌కు రెండో డోస్ తీసుకోవ‌చ్చు. అదే మొద‌టి డోస్ తీసుకోక‌ముందు క‌రోనా వ‌స్తే.. రిక‌వ‌రీ అయినా 28 రోజుల త‌ర్వాత‌నే వ్యాక్సిన్ వేసుకోవాలి

5. రెండు డోసులు తీసుకునే వ‌ర‌కు ప్ర‌త్యేక‌మైన డైట్ ఫాలో అవ్వాలా?

క‌రోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకునేంత వ‌ర‌కు ఎలాంటి ప్ర‌త్యేక‌మైన‌ డైట్ ఫాలో అవ్వాల్సిన అవ‌స‌రం లేదు. ఎప్పుడూ తీసుకునే ఆహార‌మే తీసుకోవాలి. ఆల్క‌హాల్‌కు దూరంగా ఉండ‌టం మంచిది.

6. 28 రోజుల్లో రెండో డోస్ తీసుకోవ‌డం కుద‌ర‌క‌పోతే ఎలా?

మొద‌టి డోస్ తీసుకున్న త‌ర్వాత ఒక్కోసారి 28 రోజుల్లో రెండో డోస్ తీసుకోవ‌డం సాధ్యం కాక‌పోవ‌చ్చు. దానివ‌ల్ల ఇబ్బందేమీ లేదు. కాక‌పోతే 6 నుంచి 8 వారాల్లోపు క‌చ్చితంగా రెండో డోస్ తీసుకోవాలి. అప్పుడే ఫ‌లితం ఉంటుంది.

7. గ‌ర్భిణులు, బాలింత‌లు వ్యాక్సిన్ తీసుకోవచ్చా?

ప్ర‌స్తుతం మ‌న దేశంలో ఉన్న రెండు వ్యాక్సిన్ల క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌ను గ‌ర్భిణులు, పిల్ల‌ల‌పై చేయ‌లేదు. కాబ‌ట్టి గ‌ర్భిణులు, బాలింత‌లు, పిల్ల‌లు వ్యాక్సిన్లు తీసుకోవ‌డంపై కేంద్ర ఆరోగ్య శాఖ ఎలాంటి సిఫార‌సులు చేయ‌లేదు.

8. దీర్ఘ‌కాలిక వ్యాధుల‌తో బాధ‌ప‌డేవారు మెడిసిన్ ఆపేయాలా?

క‌రోనా వ్యాక్సిన్‌పై ఇత‌ర మందులు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ చూపించ‌వు. కాబ‌ట్టి బీపీ, షుగ‌ర్ వంటి దీర్ఘ‌కాలిక వ్యాధుల‌కు మందులు వాడే వారు నిర‌భ్యంతరంగా వాటిని వేసుకోవ‌చ్చు.

9. థైరాయిడ్ పేషెంట్లు టీకా తీసుకోవ‌చ్చా?

థైరాయిడ్ పేషెంట్లు నిర‌భ్యంత‌రంగా టీకా తీసుకోవ‌చ్చు. దానివ‌ల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండ‌వు.

10. వ్యాక్సినేష‌న్ ముందు క‌రోనా టెస్ట్ చేయించుకోవాలా?

క‌రోనా వ్యాక్సిన్ వేసే ముందు భార‌త్‌లోనే కాదు ప్ర‌పంచంలో ఎక్క‌డా కొవిడ్‌-19 టెస్ట్ చేయ‌డం లేదు. అయితే క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్టు అనిపిస్తే మాత్రం టెస్ట్ చేయించుకోవాలి.

11. వ్యాక్సిన్ వేసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వ‌స్తాయి?

ఏ టీకా తీసుకున్నా కొన్ని దుష్ప్ర‌భ‌వాలు ఉంటాయి. 
కొవిడ్‌-19 వ్యాక్సిన్ తీసుకున్న త‌ర్వాత కొంత‌మందికి ఒళ్లు నొప్పులు, తేలిక‌పాటి జ్వ‌రం, అల‌స‌ట‌, త‌ల‌నొప్పి, కీళ్లనొప్పులు వంటివి రావ‌చ్చు. కానీ ఇవ‌న్నీ రెండు నుంచి మూడు రోజుల్లో త‌గ్గిపోతాయి. కాబ‌ట్టి వీటి విష‌యంలో భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు.

12. రెండు డోసులు తీసుకుంటే మాస్క్ వాడ‌క్క‌ర్లేదా?

రెండు డోసుల వ్యాక్సినేష‌న్ త‌ర్వాత కూడా అంద‌రూ క‌రోనా మార్గ‌ద‌ర్శ‌కాలు పాటించాల్సిందే. టీకా తీసుకున్న వారికి కూడా క‌రోనా సోకే అవకాశం ఉంటుంది. కానీ దాని తీవ్ర‌త అంత ఎక్కువ‌గా ఉండ‌దు. అయితే వీరి ద్వారా ఇత‌రుల‌కు వైర‌స్ సంక్ర‌మించే అవకాశం మాత్రం ఎప్ప‌టిలాగే ఉంటుంది. కాబ‌ట్టి వ్యాక్సినేష‌న్ త‌ర్వాత కూడా మాస్కులు ధ‌రించ‌డం, సామాజిక దూరం పాటించాలి.

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

🚨🚨 FLASH FLASH – AP SPECIAL TET 2026 HALL TICKETS 🚨🚨

📢 ఆంధ్రప్రదేశ్ స్పెషల్ టెట్ (AP SPECIAL TET) 2026 హాల్ టికెట్లకు సంబంధించి కీలక అప్డేట్! ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ నిర్వహించనున్న AP Special TET 2026 పరీక్షకు హాజరుకానున్న ఇన్‌ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం హాల్ టికెట్లను అక్టోబర్ 5, 2026న విడుదల చేయనున్నారు. 📌 ముఖ్యమైన వివరాలు: 🔹 పరీక్ష పేరు: AP Special TET 2026 🔹 హాల్ టికెట్ల విడుదల తేదీ: 05-10-2026 🔹 పరీక్ష తేదీలు: 11-10-2026 నుంచి 21-10-2026 వరకు 🔹 పరీక్ష విధానం: ఆన్‌లైన్ (CBT) 🔹 అర్హులు: ఇన్‌ సర్వీస్ ఉపాధ్యాయులు 🌐 హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే వెబ్‌సైట్: https://tet2dsc.apcfss.in/ 📌 డౌన్‌లోడ్ విధానం: 1. అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. 2. Candidate Login పై క్లిక్ చేయండి. 3. మీ Username, Password నమోదు చేయండి. 4. హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. 5. ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి. ⚠️ అభ్యర్థులు తమ హాల్ టికెట్‌లోని పేరు, పరీక్ష తేదీ, పరీక్ష కేంద్రం, సమయం తదితర వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలి. 🙏 పరీక్షకు హాజరయ్యే ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు! 📲 ఈ సమాచారాన్ని మీ ఉపాధ్యాయ మిత్రులకు కూడా షేర్ చేయండి. #APSpecialTET20...

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో...

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో... 💫Official Question Bank నుంచి 5×630 మొత్తం 3150 Questions ను వరుసగా 30 బిట్స్ కి ఒకటి చొప్పున మొత్తం Practice Tests చేయడం జరిగింది. 💡 ప్రశ్నలు చదవడం మాత్రమే కాదు… 👉 మీరు స్వయంగా Test రాసి 👉 వెంటనే Answer Check చేసి 👉 మీ Preparation Level తెలుసుకోండి! ⚡ Practice Mode + Actual Exam Mode 📊 Score & Answer Review కూడా వెంటనే! 🎯 AP TETకి సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థి ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించండి. 👇 Practice & Mock Tests ఇక్కడ: 🔗 https://ganaweb.in/ap-tet-official-paper-1a-practice-test/ 🔥 ఈరోజు ఒక Test… మీ Preparationలో ఒక Step ముందుకు! Lakshya Educational Groups

హార్ట్‌ ఎటాక్‌ ముప్పు ఆల్కహాల్‌ వల్ల కాదండోయ్‌!..... మీరు ఎంతగానో ఇష్టపడి త్రాగే ఇదే...

ఎనర్జీ డ్డ్రింక్స్ వల్ల అని చెబుతున్నారు నిపుణులు! ఎనర్జీ డ్రింక్స్ హానికరం కాదని మీరు అనుకుంటున్నారా?  ఒకటి తాగిన తర్వాత మీ హృదయ స్పందన రేటు పెరుగుతుందా?  ఈ సందేహాలు మీకూ ఉన్నాయా?  'హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ డక్' గా పిలువబడే ప్రముఖ కార్డియాలజిస్ట్‌ డాక్టర్ డిమిత్రి యారనోవ్ మీ సందేహాలకు సమాధానం ఇస్తున్నారు.  ఎనర్జీ డ్రింక్ వినియోగం యువకుల గుండె జబ్బులతో ముడిపడి ఉంటుంది.  అధిక ఎనర్జీ డ్రింక్ వినియోగం తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తుందని అతను అంటున్నారు. ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు ఉన్న రోగులను తాను ఎక్కువగా చూస్తున్నానని.. 20, 30 ఏళ్లలోపు యువకులు, ఆరోగ్యవంతులు అకస్మాత్తుగా గుండె వైఫల్యంతో బాధపడుతున్నారు. ధూమపానం అలవాటు లేదు, కుటుంబ చరిత్ర కూడా లేదు. కానీ వీరందరిలో ఓ ఉమ్మడి అలవాటు ఉంది. అది వారు ప్రతిరోజూ 3-4 డబ్బాల ఎనర్జీ డ్రింక్స్ తీసుకుంటున్నారు. ఎనర్జీ డ్రింక్స్ రక్తపోటును పెంచుతాయని, అసాధారణ గుండె లయలకు కారణమవుతాయని, కాలక్రమేణా గుండె కండరాలను బలహీనపరుస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అధిక కెఫిన్, ఉత్తేజకాలు గుండెను ఓవర్‌డ్రైవ్‌కు గురి చేస్తాయి...