ప్రతీ అక్షరం
ప్రాణం నింపుకునే పుడుతుంది
కొన్ని మాటలే ఊపిరవుతాయి
కొన్ని మాటలే చైతన్యాన్నీ తెస్తాయి
కొన్ని మాటలే ఆత్మీయమవుతాయి
కొన్ని మాటలే గెలుపునిస్తాయి
కొన్ని మాటలే బలంనిస్తాయి
కొన్ని మాటలే ధైర్యానిస్తాయి
కొన్ని మాటలే చూపులవుతాయి
భగవద్గీత చదువు తున్నాము
కానీ మన భవితను మార్చుకోలేకపోతున్నాము...
బైబిల్ చదువుతున్నాము..
స్టెబిలిటీ లేక మనిషిగా మారలేక పోతున్నాము...
ఖురాన్ చదువు తున్నాము
ధర్మానికి కట్టుబడ కుండానే జీవిస్తున్నాము...
ఇంకా ఎన్నో చదువు తున్నాము..
లోకం తెలియకుండానే బతికేస్తున్నాము
ఓ బండరాయిలా!!!!!
చీకటి వెలుగుల తేడాని
ఎవ్వరి సహాయం లేకుండా. చూస్తున్న మనము;;;;
మంచి ,చెడు ని.అర్ధము చేసుకోలేక పోతున్నాము....
మనము మాట్లాడే మాట ఎదిటివారికి ఊపిరి పొయ్యాలే కానీ ప్రాణము తీసేటట్లు ఉండకూడదు....
Comments
Post a Comment