Skip to main content

భేటీ మోటివేషన్.... గుర్తింపు


 ఒక రాజసభకు ఒక అపరిచితుడు ఉద్యోగం అడగటానికి వచ్చాడు. “నీ విశేషం ఏంటి?” అని అడిగితే, “మనిషి అయినా, జంతువైనా నేను ముఖం చూసి వారి గురించి చెప్పగలుగుతాను.” అని చెప్పాడు.

🌸 రాజు అతడిని తన అశ్వశాలకు అధిపతిని చేశాడు. 

🌸 కొన్ని రోజుల తర్వాత రాజు అతడిని తనకు అన్నిటికంటే ప్రియమైన, ఖరీదైన గుర్రాన్ని చూపించి, అడిగాడు.అప్పుడు అతను, “ఇది జాతిగుఱ్ఱం కాదు.” అని అన్నాడు. రాజు చాలా ఆశ్చర్యపోయాడు. 

🌸 అడవి నుంచి గుర్రపువాడిని పిలిపించి అడిగితే అతడు - “గుర్రం జాతిదే కానీ ఇది పుట్టంగానే దాని తల్లి చనిపోయింది. దీనిని ఆవు పాలు పోసి పెంచామ”ని చెప్పాడు.

🌸 రాజు తన ఉద్యోగిని పిలిచి, “నీకు ఈ సంగతి ఎట్లా తెలుసు?” అని అడిగాడు. అప్పుడు అతడు- “ఇది గడ్డి తినేటప్పుడు ఆవులాగా తలకాయ కిందకని తింటుంది. జాతి గుర్రం అయ్యుంటే దాణా నోట్లోకి తీసుకుని తలెత్తి తినేది.” అని చెప్పాడు. 

🌸 రాజుకు అతడి కౌశలం చూసి చాలా సంతోషం వేసింది. అతడికి బోలెడు ధాన్యం, నెయ్యి, కోడ్లు, కోడిగుడ్లు, ఉదారంగా పంపించాడు. 
అతడిని రాణి భవంతికి ఉద్యోగిగా పెట్టాడు.

🌸 కొన్ని రోజుల తర్వాత అతడు రాణీ గురించి అడిగాడు... అప్పుడు ఉద్యోగి చెప్పాడు- “ఆమె తీరుతెన్నులు, వ్యవహారం రాణి లాగానే ఉన్నాయి. కానీ ఆమె పుట్టుకతో రాణి కాదు.” అని..
రాజు కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్టయింది. అతడు తన అత్తగారిని పిలిచి విషయం చెప్పాడు.

🌸 అప్పుడు అత్తగారు అన్నది- “నిజం ఏంటంటే మీ నాన్నగారు మా వారిని మా అమ్మాయి పుట్టినప్పుడే సంబంధం అడిగాడు. కానీ మా కూతురు పుట్టిన ఆరు నెలలకే చనిపోయింది. అప్పుడు మేము రాచసంబంధం కోసం ఒక వేరే పిల్లను తెచ్చి కూతురుగా పెంచుకున్నాము అని .

🌸 రాజు మళ్లీ తన ఉద్యోగిని అడిగాడు, “నీకు ఎట్లా తెలిసింది?” అని. అతను చెప్పాడు- “రాణి నౌకర్లతో వ్యవహరించే విధానం చాలా సౌమ్యంగా ఉంది. ఒక రాణి స్తాయి వ్యక్తి ఇతరులతో వ్యవహరించే పద్ధతి ఒకటి ఉంటుంది. అది రాణిగారిలో ఎక్కడా లేదు....

🌸 రాజు మరొకసారి ఇతడి దృష్టిలోని నైపుణ్యానికి సంతోషపడి చాలా గొర్రెలు, మేకలు కానుకగా ఇచ్చి తన దర్బారులో నియమించుకున్నాడు.

🌸 కొంతకాలం గడిచాక రాజు ఆ ఉద్యోగిని పిలిచి తన గురించి అడిగాడు. ఉద్యోగి, “నా ప్రాణాలకు అభయం ఇస్తే చెప్తాను.” అని అన్నాడు. 
రాజు మాట ఇచ్చాడు. అతడు, “మీరు రాజూ కాదు, రాజు కొడుకూ కాదు. మీ వ్యవహారం రాజు లాగా లేదు.” అని అన్నాడు.

🌸 రాజుకు చాలా కోపం వచ్చింది. 
కానీ అభయం ఇచ్చేశాడు కదా. అందువల్ల నేరుగా తన తల్లిని పిలిచాడు. 
తల్లి అన్నది- “ఇది నిజమే నాయనా. నువ్వు ఒక రైతు కొడుకువు. 
మాకు పిల్లలు లేనందువల్ల నిన్ను దత్తత తీసుకుని పెంచుకున్నాము.” అని. 

🌸 రాజా ఉద్యోగిని పిలిచి, “నీకు ఈ విషయం ఎట్లా తెలుసు?” అని అడిగాడు. 

🌸 అప్పుడు ఉద్యోగి- “రాజు ఎవరికైనా కానుకలు ఇస్తే వజ్రాలు, ముత్యాలు, నగలు, నట్రా ఇస్తారు. కానీ మీరు గొర్రెలు, మేకలు, తిని తాగే వస్తువులు కానుకిస్తున్నారు. 
ఈ పద్ధతి రాజులది కాదు, రైతువారిదే అవుతుంది.” అన్నాడు...

🌸 మనిషి దగ్గర ఎంత ధనము, సంపదలు, సుఖము, సమృద్ధి, వైభవం, శక్తీ ఉన్నా ఇదంతా బయటికి కనిపించడానికే!

🌸 "మనిషి నిజమైన గుర్తింపు సాధనం అతడి వ్యవహారమే.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు సువర్ణావకాశం

2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి లో 60% లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు తో పాస్ అయిన విద్యార్ధిని విద్యార్ధులకు ఎంట్రెన్స్ ఎగ్జామ్ లేకుండానే నవోదయ ఎటపాక స్కూల్ నందు 11వ తరగతి సైన్స్ మరియు మ్యాథ్స్ గ్రూప్స్ లో డైరెక్ట్ గా సీటు ఇవ్వబడును. కావున విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాము. దరఖాస్థులు నింపి పంపించడానికి చివరి తేదీ 20 ఆగష్టు 2025 . అడ్మిషన్స్ కేవలం మెరిట్ బేసిస్ మీదనే ఉంటుంది. ఎవరి సిఫార్సులు పని చేయవు.  మొత్తం ఖాళీల సంఖ్య: 52 సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9494343022 (కె. టీ. ప్రసాద్)  9491191813 (శ్రీ భాస్కరాచారీ, సీనియర్ టీచర్)  9491768144 (శ్రీ కె. శేఖర్, కౌన్సిలర్) ముఖ్య గమనిక: 11వ తరగతిలో ఎంపికకు ఖాళీగా ఉన్న సీట్లు 12 నుంచి 52 కు పెంచబడినాయని చెప్పటానికి సంతోషిస్తున్నాము. అంటే ఒక సెక్షన్ పెంచబడింది. ఇట్లు ప్రిన్సిపాల్ ఇంచార్జి  కె టి ప్రసాద్ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

𝗧𝗢𝗗𝗔𝗬 - 𝗛𝗜𝗡𝗗𝗨 - 𝗩𝗢𝗖𝗔𝗕𝗨𝗟𝗔𝗥𝗬

1. STIFLE (VERB): (गला घोंटना):  choke Synonyms: suffocate, asphyxiate Antonyms: cold Example Sentence:Those in the streets were stifled by the fumes. 2. VOLUMINOUS (ADJECTIVE): (विशाल):  capacious Synonyms: commodious, roomy Antonyms: tiny Example Sentence:We have a voluminous purple cloak at home. 3. PATRONIZE (VERB): (रिआयत करना):  look down on Synonyms: talk down to, put down Antonyms: friendly Example Sentence:She was determined not to be put down or patronized. 4 TACTICAL (ADJECTIVE): (परिगणित):  calculated Synonyms: planned, plotted Antonyms: unwise Example Sentence:In a tactical retreat, she moved into a hotel with her daughters. 5. AMALGAMATE (VERB): (मिलाना):  combine Synonyms: merge, unite Antonyms: separate Example Sentence:She amalgamated his company with another. 6 ONEROUS (ADJECTIVE): (कष्टदायक):  burdensome Synonyms: heavy, inconvenient Antonyms: easy Example Sentence:She found his ...