Skip to main content

నెయ్యి మోటివేషన్... భర్తృహరి సుభాషితం ఏమి చెప్పింది


వాడు నన్ను సాయం అడిగాడా..? వాడికి నేను సహాయం చేయటానికి..!

వాడికి నేను అడగకుండానే సహాయం చేశాను. కానీ వెధవకు కృతఙ్ఞత లేశమంతయినాలేదు!
ఇలాంటి మాటలు మనం చాలా వింటుంటాం!

ఎదుటి వాడికి సహాయం చేసి వాడినుండి తిరిగి మనం ఏదో ఒకటి ఆశిస్తున్నాం !
.
ఏదీ లేక పోతే కనీసం కృతఙ్ఞత ఆశిస్తున్నాం...ఇది
"ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం" లాంటిది 
it is simply a transaction, not help...

ఆశించి చేసేది సహాయం అవుతుందా...? ఒక్క సారి ఆలోచించండి!

ఒక చక్కని భర్తృహరి సుభాషితం చూడండి

"పద్మాకరమ్ దినకరో వికచం కరోతి
చంద్రో వికాసయతి కైరవ చక్రవాలమ్
నాభ్యర్ధితో జలధరోపి జలం దదాతి
సన్తఃస్వయమ్ పరహితే విహితాభియోగః"

ఏమి ఆశించి సూర్యుడు తామర కొలను వికసింప చేస్తున్నాడు...?

ఏమి ఆశించి చంద్రుడు కలువలను వికసింప చేస్తున్నాడు...?

ఏమి ఆశించి మేఘం నీటిని మానవాళికి అందిస్తున్నది?

ఏమి ఆశించ కుండా పరులహితం కోరేవాడే సత్పురుషుడు!

మనకు మనం ఎప్పుడూ గొప్పవాళ్లు గానే మనం భావిస్తాం, మన మంచి మనకు ఎప్పుడూ గుర్తుంటుంది (అది మనకు మాత్రమే)

మనం నిజంగా గొప్పవాళ్ళమే అయితే,నిజంగా మనం సత్పురుషులము అని మన మనస్సాక్షి ఒప్పుకుంటే, మనం చేసేది సహాయమే అని మనం భావించేటప్పుడు, 
ఎదుటివాడు అడగకుండానే ఎందుకు సహాయం చేయకూడదు..?

జీవితమే ఒక ప్రయాణం ఆ ప్రయాణంలో కలిసే ప్రయాణికులందెరో కానీ ఏదీ శాశ్వతం కాదు. ఎవరూ శాశ్వతం కాదు. నీ నడవడిక శాశ్వతం.
గెలిచేది నువ్వే.., ఒడేది నువ్వే..., గెలుపుకి పొంగి పోకుండా, ఓటమికి కుంగిపోకుండా, ధర్మ బద్ధంగా ఫలాపేక్ష లేకుండా, తోటి వారికి సహాయపడుతూ సాగిపోవడమే జీవితం.....

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం జారీ చేసిన G.O.MS.No.2 – సమగ్ర ఆదేశాలు

ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.MS.No.2 ద్వారా తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు 2025 జనవరి 6న అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, మాతృత్వ సెలవులు, ఎక్స్‌గ్రేషియా వంటి అంశాలను స్పష్టంగా చర్చించాయి. ఈ ఆదేశాలలో ఉన్న ముఖ్యాంశాలు, పాజిటివ్ మరియు నెగటివ్ అంశాలను ఈ వ్యాసంలో విశ్లేషించబడింది. ముఖ్యాంశాలు: 1.MTS: ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, మరియు సమాజాల్లో ఖాళీగా ఉన్న నిబంధిత పోస్టులపై నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే న్యూనత పేస్కేల్ వర్తిస్తుంది. MTS ద్వారా నెలవారీ చెల్లింపులు కలిపి ఒకే రూపంలో అందిస్తారు. అయితే, ఈ పేమెంట్‌లో అదనపు అలవెన్స్‌లు, వార్షిక పెంపులు ఉండవు. 2. మాతృత్వ సెలవులు: వివాహిత మహిళా ఉద్యోగులకు రెండు ప్రసవాలకు 180 రోజుల చెల్లింపు మాతృత్వ సెలవు కల్పించడం ఈ ఉత్తర్వుల్లో ప్రధానమైన పాజిటివ్ అంశం. ఈ కాలంలో EPF, ESI వంటి అన్ని ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. 3. ఎక్స్‌గ్రేషియా: అపఘాత మృతి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, సహజ మృతికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించ...

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺