జవాబు: ఈనాటి క్యాలండర్ కు తొలి రూపాలు ఏవని చూస్తే ముఖ్యంగా రోమన్, ఈజిప్టు, గ్రేగోరియన్ విధానాల గురించి చెప్పుకోవాలి.
రోమ్ సామ్రాజ్యాన్ని పాలించే రోమన్ చక్రవర్తి కాలంలో ఏడాదికి 304 రోజులుగా నిర్ణయించారు. వీటిని పది నెలలు గా విభజించారు. అప్పట్లో మార్చితో కొత్త ఏడాది ప్రారంభమయ్యేది. ఆ తర్వాత క్రీస్తు పూర్వం ఏడో శతాబ్దం దగ్గరికి వస్తే రోమ్ ను పాలించిన "సుమా పామ్పిలియాస్" ఏడాదిని 12 నెలలుగా విభజించాడు. రోజుల సంఖ్య ఏడాదికి 354 రోజులుగా నిర్ణయించాడు. అయితే, సరి సంఖ్యలు శుభకరం కావనే నమ్మకంతో ఒక రోజును కలిపి ఏడాదికి 355 రోజులుగా చేశారు.
క్రీ.పూ 153లో ఏడాది ప్రారంభాన్ని మార్చి నుంచి జనవరికి మార్చారు. కానీ చంద్రుడి గమనం, సూర్యుడి గమనం ప్రకారం చూస్తే ఏడాదికి రోజుల లెక్కల్లో తేడాలు ఉండేవి. ఈ గందరగోళాన్ని సవరించడానికి రోమన్ చక్రవర్తి "జూలియస్ సీజర్" ప్రయత్నించారు. క్రీ.పూ 46లో ఈజిప్టు వెళ్లిన ఆయన... అక్కడ ఏడాది విభజించిన విధానాన్ని తెలుసుకుని రోమ్ లో అమలు చేశాడు. దాని ప్రకారం ఏడాదికి 265.25 రోజులుగా లెక్కగట్టారు. జనవరి, మార్చి, మే, జూలై, ఆగస్టు, అక్టోబర్, డిసెంబర్ నెలలాకు 31రోజులుగా;
ఏప్రిల్, జూన్, సెప్టెంబర్, నవంబర్ నెలలకు 30 రోజులుగా;
ఫిబ్రవరి నెలకు 28 రోజులుగా నిర్ణయించారు. అయినా పావురోజు మిగిలిపోయింది. దాన్ని నాలుగేళ్లకొకసారి ఫిబ్రవరికి కలపాలనుకున్నారు(అదే లీపు సంవత్సరమన్నమాట). ఇదే జూలియస్ క్యాలెండర్.
అయితే.. సీజర్ తర్వాత క్యాలెండర్ రూపకర్తలు తప్పుగా అర్థం చేసుకుని మూడేళ్లకోసారే ఫిబ్రవరికి ఒకోరుజును కలిపేయడం మొదలెట్టారు. ఇది క్రీస్తు శకం 08 వరకు కొనసాగింది. దీన్నీ గమనించిన అగస్తస్ అనే చక్రవర్తి అంతవరకూ జరిగిన తప్పును సరిదిద్దడానికి నాలుగేళ్లకు ఒకసారి ఒకరోజును కలిపే పద్ధతిని ఆపించాడు. ఆపై క్రీ.శ 567లో తిరిగి కొత్త సంవత్సరాన్ని మార్చికి మార్చేశారు.
తర్వాత రోజుల్లో లెక్కల్లో కచ్చితత్వం పెరిగి ఏడాదికి 365.242199 రోజులుగా గుర్తించారు. ఇందువల్ల ఏడాదికి 11 నిముషాల 14 సెకనులు వంతున తేడా వస్తూ.. క్రీ.శ 1572 వచ్చేసరికి ఏకంగా 10రోజుల పాటు క్యాలెండర్ లెక్క తప్పింది. దీన్ని "13 వ పోప్ గ్రెగొరీ" సరిదిద్దించారు. అయినా, ఏటా 0.0078 రోజుల తేడా తప్పలేదు. అందువల్ల ప్రతి 400 ఏళ్లకు లీపుసంవత్సరాన్ని వదలివేయాలని నిర్ణయించారు. అందువల్లే 400తో భాగించబడే శతాబ్ది సంవత్సరాలకే తీపు నిబంధన ఉండాలనే సవరింపు వచ్చింది. కాబట్టే 1700, 1800, 1900, మామూలు సంవత్సరాలుగానూ.. 2000 మాత్రము లీపుసంవత్సరం అయింది. అలాగే కొత్త సంవత్సరం జనవరితో ప్రారంభమవ్వాలని నిర్ణయించారు.
క్రీ.శ 1582లో అమలులోకి వచ్చిన ఈ గ్రెగోరియన్ క్యాలెండరే ఇప్పటి మన క్యాలెండర్ కు నాంది.
Comments
Post a Comment