Skip to main content

నేటి మోటివేషన్... దురాశ ధుఃఖానికి చేటు:

దురాశ ధుఃఖానికి చేటు:

ఒక ఊరిలో రంగడు, సింగడు అని ఇద్దరు మిత్రులుండేవారు. ఇద్దరూ ప్రతి రోజూ అడవిలో కట్టెలు కొట్టుకుంటూ జీవనం సాగించేవారు. వారిలో రంగడు చాలా మంచివాడు. కష్టపడి పని చేసేవాడు. ఎవరి జోలికీ వెళ్లేవాడు కాడు. సింగడు మాత్రం పేదవారికి సాయం చేయకుండా పిసినారిగా ఉండేవాడు. ఎప్పుడూ 
 కష్టపడకుండా పైకి రావాలని ఆశించే వాడు.

రోజూ లాగానే ఆ రోజు కూడా రంగడు, సింగడు ఇద్దరూ అడవిలోకి వెళ్లారు. ఇద్దరూ చెరో ప్రక్కకు కట్టెల కోసం వెళ్లారు. ఆ సమయంలో రంగడు కట్టెలు కొట్టి అలసి పోయి చెట్టు క్రింద నిద్రపోయాడు. ఆ సమయంలో ఆ చెట్టు మీదున్న దెయ్యం అతన్ని చూసింది. రోజూ అతన్ని ఆ అడవిలో చూడడంతో అతను భూతానికి తెలిసిన ముఖమే.

అతని గురించి తెలిసిన భూతం సాయం చేయాలని భావించి అతని దగ్గిర ఉన్న సద్దన్నం మూటకు బదులుగా బంగారు నాణేలు ఉన్న లంకెబిందెలను అతని ప్రక్కనే పెట్టి వెళ్లిపోయింది. నిద్ర లేచి దానిని చూసిన రంగడు ఆశ్చర్యపోయాడు. అవి అక్కడికి ఎలా వచ్చేయో తెలియలేదు. అయినప్పటికీ, తన కష్టాలను తీర్చేందుకు దేవుడే ప్రసాదించాడని వాటిని ఇంటికి తీసుకెళ్లి తనలాగే కష్టపడే వాళ్లకి పంచిపెట్టాడు.

రంగడు పడుకున్న ఆ మహిమ కలిగిన చెట్టు కింద తను కూడా పడుకుని అలాగే కష్టపడకుండా డబ్బు సంపాదించాలని మనసులో నిర్ణయించుకున్నాడు. మర్నాడు యథాలాపంగా ఇద్దరూ అడవికి వెళ్లారు. ఆ సమయంలో రంగడిని వేరే మార్గంలో పంపి, ముందు రోజు రంగడు వెళ్లిన వైపే సింగడు వెళ్లి కాసేపు కట్టెలు కొట్టాడు. రంగడు ఏ చెట్టు కింద పడుకున్నాడో ఆలోచించి వెతికి వేసారి చూద్దాం అనుకుని ఓ చెట్టు కింద పడుకుని నిద్ర నటించసాగాడు.

రంగడు తెచ్చుకున్న సద్దన్నం మూటను బంగారు నాణేలుగా మార్చిందంటే ఆ మహిమ కలిగిన చెట్టు వెండి నాణేలను వజ్ర, వైఢూర్యాలుగా మార్చే అవకాశం ఉందని భావించి మూట నిండా వెండి నాణేలను తెచ్చి పక్కన పెట్టుకున్నాడు. వీటిని చూసిన భూతం అతని దురాశను పసిగట్టి ఇతనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని భావించింది.

అతని వద్ద ఉన్న అన్నిటినీ తీసుకుని అడవి మధ్యలో దారితెలియని చోటులో వదిలేసి వచ్చింది. కళ్లు తెరచి చూసిన సింగడికి పరిస్థితి అర్థమయ్యి దు:ఖించసాగాడు. దురాశకు లోనై వెండి నాణేల్ని పోగొట్టుకున్నాను, దారి తప్పి అడవిలో పడ్డానని పశ్చాత్తాపపడ సాగాడు. అతనిలో పశ్చాత్తాప భావనను చూసిన భూతం ప్రత్యక్షమై నీకు బుద్ధి రావాలని ఇలా చేశానంది.

తన తప్పు తెలుసుకున్న సింగడు ఊరికి చేర్చమని భూతాన్ని ప్రాధేయపడ్డాడు. అప్పట్నుంచీ కష్టపడి పనిచేస్తూ పేదవారికి దానాలు చేస్తూ సంతోషంగా జీవించాడు. కాబట్టి పిల్లలూ మీరు కూడా దురాశకు లోను కాకుండా మీకు దొరికినంతలో తృప్తి పడండి. ఎక్కువ సంపాదించాలనుకుంటే అడ్డదారులు తొక్కకుండా కష్టపడి దాని కోసం ప్రయత్నించండి విజయం మీదే అవుతుంది.

---సేకరణ .

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

RRB NTPC 8050 జాబ్స్ నోటిఫికేషన్ విడుదల

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) 2025 సంవత్సరానికి సంబంధించి 8,050 ఖాళీలతో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్) సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ (CEN 2025)ను ఒక ప్రకటనలో విడుదల చేసింది. మొత్తం 8,050 ఖాళీలను భర్తీ చేయనుంది. వీటిలో 5,000 పోస్టులు గ్రాడ్యుయేట్, 3,050 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు ఉన్నాయి. అర్హత: గ్రాడ్యుయేట్ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణత, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఉండాలి. ముఖ్య తేదీలు: గ్రాడ్యుయేట్ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 20.11.2025. అండర్ గ్రాడ్యుయేట్ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 27.11.2025.  మరిన్ని వివరాల కోసం అలాగే పూర్తి నోటిఫికేషన్ కోసం క్రింద ఉన్న లింకును క్లిక్ చేయగలరు  https://www.rrbapply.gov.in/#/auth/landing (Join us on whatsapp at) https://chat.whatsapp.com/JuVLXd0zVNNGnadLIN4Pr8?mode=ems_copy_t https://whatsapp.com/channel/0029VbAmA2K4SpkJgaw7uJ3u 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

RRB JE Recruitment: రైల్వేలో 2,570 జూనియర్ ఇంజినీర్, మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులు

భారతీయ రైల్వే (Indian Railway).. 2,570 పోస్టులతో మరో నోటిఫికేషన్ను విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా అన్ని రీజియన్లలో ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) నోటిఫికేషన్ (సీఈఎల్ నంబర్ 05/ 2025) విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 2,570 జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ ఖాళీలు భర్తీ కానున్నాయి. ఆర్ఆర్బీ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 31వ తేదీ నుంచి ప్రారంభమై నవంబర్ 31వరకు కొనసాగనుంది. పూర్తి వివరాల కోసం ఆఫీసియల్ వెబ్సైటు లింక్ https://www.rrbcdg.gov.in/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ