Skip to main content

నేటి మోటివేషన్... రూపాయి.......



రూపాయి , మనిషి బండి నడవడానికి అవసరం అయ్యే ఇంధనం , 
విచిత్రం ఏమిటంటే దాని విలువ మనిషిని బట్టి , 
ప్రదేశాన్ని బట్టి , 
కాలాన్ని బట్టి మారిపోతుంది ... 
ఇరవైరూపాయలు పెట్టిసామాను తెచ్చి ఇరవైఐదుకు అమ్ముకునే వానికి , 
ఆ అయిదు రూపాయలు ఎంతో విలువైనవి , 
అదే వాడి జీవన ఆధారం , 
అదే లక్షపెట్టి లక్షపదివేలుకు అమ్ముకునే వానికి ఆ అయిదు రూపాయలు పెద్ద లెక్క 
కాదు , 
వాడికి అటువంటి అయిదులు చాలానే కావాలి లెక్కకు రావాలి అంటే ,
ఎంత పెద్ద కోటీశ్వరుడు అయినా కూరగాయల మార్కెట్ వెళితే , 
కిలో ఇరవై చెబితే పద్దెనిమినిదికి ఇవ్వవా అంటూ బేరం అడతాడు , 
రెండు రూపాయలు మిగిలించడానికి , అవి వీడికి ఏ విధంగానూ లెక్కకు రావు , 
అదే రెండు రూపాయలు కూరగాయలు అమ్మే వానికి జీవన ఆధారం , 
ఇదే కోటీశ్వరుడు హోటల్ కి వెళ్లి అడక్కుండానే వంద టిప్ పడేస్తాడు , 
ఒక పక్క రెండు రూపాయలు ఎంతో విలువైనవి అంటూ బేరం అడతాడు , 
అదే చేత్తో లెక్కలేకుండా వంద రూపాయలు టిప్ గా పడేస్తాడు , 
ఇలా చెప్పుకుంటూ పోతే రూపాయి విలువ ఊసరివిల్లిలా రంగులు మారుస్తూ , 
మనిషిని ఆడిస్తూ పోతూ ఉంటే అదే మనిషి మాత్రం ఎప్పుడూ , దానిని సంపాదించడంలోనే ఉరుకులు పరుగులు పెడుతాడు జీవితం అంతా ! 
ఇంతేనా ఆ రూపాయి గురించి ఒక కవి " " ఆ నలుగురు " " సినిమా లో ఇలా చెప్పాడు , రూపాయి రూపాయి నువ్వు ఏమి చేస్తుంటావు అని అడిగితే .... 
హరిశ్చంద్రుడి చేత అబద్ధం ఆడిస్తాను !!! 
భార్యా భర్తల మధ్య చిచ్చు పెడతాను !!! 
తండ్రి బిడ్డలను విడదీస్తాను !!! 
అన్నదమ్ముల మధ్య వైరం పెంచుతాను !!! 
ఆఖరికి ప్రాణ స్నేహితులను సైతం విడగడతాను !!! 
అందట , ఒక్కసారి మనం కనుక దానికి విలువ ఇచ్చి ఇంట్లోకి చొరబడనిస్తే , 
అది ఇంట్లో ఉన్న రక్త సంబంధాలను సైతం కిలోల లెక్కన తూకం వేసి అనే అన్నీ మనకు తెలుసు కానీ మనం కూడా సందర్భాన్ని బట్టి ,
విలువ ఇస్తూ దాని వెనకాలే పరిగెడతాం ,  
అది ఇంట్లో ఉన్న రక్త సంబంధాలను సైతం కిలోల లెక్కన తూకం వేసి అమ్మేస్తుంది , 
పైన చెప్పినవి అన్నీ మనకు తెలుసు కానీ మనం కూడా సందర్భాన్ని బట్టి , 
ఆ రూపాయికి విలువ ఇస్తూ దాని వెనకాలే పరిగెడతాం , 
దానికి ఎవరు మినహాయింపు కాదు , 
అందుకే రూపాయి అవసరం ఉన్నంత వరకు జీవనాధారం , 
ఆ తరువాత అది మనిషికే పెద్ద గుది బండగా మారి దాని వేటలో , 
ఎంతో విలువైన ప్రాణాలే పొగుట్టుకునే మనుషుల్ని చూస్తున్నాం ఇప్పుడు , 
ఒక్కటి మాత్రం నిజం మనకి ప్రాణం ఉంటేనే రూపాయికి విలువ , 
మరి అటువంటి ప్రాణాలే గాలిలో కలిసిపోతే ఇక రూపాయి ఒక విలువలేని కాగితం ముక్క , ఈ సత్యం గమనించి ప్రవర్తిస్తే అదే మన వెనకాల పరిగెడుతుంది . 
ఇది నిజం ...


Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ