Skip to main content

తెలుసుకుందాం....



🌼రాత్రి వేళల్లో వికసించే మల్లెపూలకు, నైట్‌క్వీన్‌కు అంత సువాసన ఎందుకు❓

🌸జవాబు: కొన్ని పూలకు ఆకర్షణీయమైన రంగులు ఉంటే మల్లె, నైట్‌క్వీన్‌(రాత్‌కీ రాణి) లాంటి పూలకు మధురమైన సువాసన ఉంటుంది. కొన్ని పూలకు రంగు, సువాసనా రెండూ ఉంటాయి. వీటి వెనుక ప్రత్యేకమైన ప్రయోజనం ఉంది. క్రిమికీటకాలు, తేనెటీగలు, తుమ్మెదలు, సీతాకోక చిలుకలు పూలలోని మకరందాన్ని పీల్చుకుని జీవిస్తాయి. ఇవి పూలపై వాలినపుడు వాటి కాళ్లకు, రెక్కలకు పూలలోని పుప్పొడి అంటుకుంటుంది.

ఈ కీటకాలు మరో పువ్వుపై వాలినపుడు పుప్పొడి రేణువులు ఆ పూవు అండాశయాన్ని చేరి ఫలదీకరణం జరుగుతుంది. అపుడే పువ్వు కాయగా మారుతుంది. అవే పండ్లుగా మారి వాటి గింజలు భూమిపై పడి మొలకెత్తి మొక్కలు పెరుగుతాయి. ఈ విధంగా మొక్కలు ఉత్పత్తి కావడానికి ఉపయోగపడే కీటకాలను ఆకర్షించేందుకే పూలకు అందమైన రంగులు, రకరకాల సువాసనలు ఏర్పడతాయి.

కీటకాల్లో కొన్ని పగలు సంచరిస్తే మరికొన్ని రాత్రివేళల్లో తిరుగుతుంటాయి. పగటి వేళ వీటిని ఆకర్షించడానికి వాటి రంగులు దోహదపడతాయి. రాత్రివేళ రంగులు కనబడవు కాబట్టి రాత్రి పూచేపూలు మరింత ఎక్కువగా సువాసనను వెదజల్లుతాయి.

సాయం వేళల్లో, రాత్రులలోని వాతావరణ పరిస్థితులకు మాత్రమే ప్రేరణ పొంది వికసించే జాజి, మల్లె, నైట్‌క్వీన్‌ లాంటి పూలకు మనోహరమైన సువాసన ఉండటానికి కారణం అదే. రాత్రిపూట రంగులతో పని ఉండదు కాబట్టి సాధారణంగా అలాంటి పూలు చీకటిలో కనిపించేందుకు వీలుగా తెల్లని రంగులో ఉంటాయి....

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

RRB NTPC 8050 జాబ్స్ నోటిఫికేషన్ విడుదల

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) 2025 సంవత్సరానికి సంబంధించి 8,050 ఖాళీలతో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్) సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ (CEN 2025)ను ఒక ప్రకటనలో విడుదల చేసింది. మొత్తం 8,050 ఖాళీలను భర్తీ చేయనుంది. వీటిలో 5,000 పోస్టులు గ్రాడ్యుయేట్, 3,050 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు ఉన్నాయి. అర్హత: గ్రాడ్యుయేట్ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణత, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఉండాలి. ముఖ్య తేదీలు: గ్రాడ్యుయేట్ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 20.11.2025. అండర్ గ్రాడ్యుయేట్ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 27.11.2025.  మరిన్ని వివరాల కోసం అలాగే పూర్తి నోటిఫికేషన్ కోసం క్రింద ఉన్న లింకును క్లిక్ చేయగలరు  https://www.rrbapply.gov.in/#/auth/landing (Join us on whatsapp at) https://chat.whatsapp.com/JuVLXd0zVNNGnadLIN4Pr8?mode=ems_copy_t https://whatsapp.com/channel/0029VbAmA2K4SpkJgaw7uJ3u 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

RRB JE Recruitment: రైల్వేలో 2,570 జూనియర్ ఇంజినీర్, మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులు

భారతీయ రైల్వే (Indian Railway).. 2,570 పోస్టులతో మరో నోటిఫికేషన్ను విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా అన్ని రీజియన్లలో ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) నోటిఫికేషన్ (సీఈఎల్ నంబర్ 05/ 2025) విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 2,570 జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ ఖాళీలు భర్తీ కానున్నాయి. ఆర్ఆర్బీ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 31వ తేదీ నుంచి ప్రారంభమై నవంబర్ 31వరకు కొనసాగనుంది. పూర్తి వివరాల కోసం ఆఫీసియల్ వెబ్సైటు లింక్ https://www.rrbcdg.gov.in/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ