Skip to main content

నేటి మోటివేషన్... ఉచితం

 

                 ఒక రోజున దొంగ ఒకడు ఒక ఇంటికి దొంగతనానికి వెళ్ళాడు.

ఇంటి ముందు కాపలాగా ఒక కుక్క ఉన్నది. దొంగను చూసింది కానీ ఏ చప్పుడు చేయకుండా చూస్తూ ఉన్నది. అతన్ని చూసి మొరగని కుక్కను చూసి దొంగ ఆలోచనలో పడ్డాడు. దొంగతనానికి వెళదామా? వద్దా? అని.

తీరా ఇంటి లోపలకు వెళ్ళాక కుక్క అరిచిందంటే ఏం చేయాలి? ఇప్పుడే అరిస్తే వేరే ఇంటికి దొంగతనానికి వెళ్లొచ్చు! అని అనుకున్నాడు.

ఇలా ఆలోచిస్తూ చివరగా తాను తెచ్చిన రొట్టెముక్కను కుక్కకు విసిరాడు. అంతే వెంటనే ఆ కుక్క గట్టిగా అరుస్తూ అతని వెంటపడి కరవడానికి ప్రయత్నించింది.

అప్పుడు దొంగ కుక్కతో ఇలా అన్నాడు. నన్ను చూసికూడా అరవని నువ్వు రొట్టె ముక్క ఇవ్వగానే అరుస్తున్నావు ఎందుకు? అని అడిగాడు.

నువ్వు ఊరికే ఉన్నప్పుడు ఒకవేళ నువ్వు ఈ ఇంటి బంధువో లేక తెలిసిన వ్యక్తో అయిఉంటావని అనుకున్నాను.

కానీ ఎప్పుడైతే నువ్వు ఉచితంగా రొట్టెముక్క ఇచ్చావో అప్పుడే నాకు అర్థమయింది నువ్వు దొంగవని. అని బదులిచ్చింది ఆ కుక్క.

ఆలోచించవలసిన విషయమే కదండీ ఇది. ఉచితం అనగానే ఆలోచన మరిచి ఎగబడుతున్నారు జనాలు.

ఉచితంగా రొట్టె ఇచ్చాడంటే అందులో ఎంతటి అర్థం ఉందో గ్రహించింది కుక్క. కానీ మషులమైన మనమే ఉచితంగా డబ్బులు* ఎందుకు ఇస్తునారో గ్రహించలేక పోతున్నాం. 

ఒక కుక్క గ్రహించిన చిన్న విషయాన్ని కూడా మానవులమైన మనం గ్రహించలేక పోతున్నందుకు చాల బాధగా ఉంది. 🙏

❣❣❣❣❣❣❣❣❣❣❣❣

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

IIIT అప్లై చేసిన మీ 10th మార్క్స్ పెరిగితే ఏమి చేయాలి

ప్రధానోపాధ్యాయులకు/ప్రధానాచార్యులకు తెలియజేయునది. 10వ తరగతి పాసైన కొంతమంది విద్యార్థులకు IIIT అప్లై చేయడం జరిగింది. అప్లై చేసిన తర్వాత కొంతమంది విద్యార్థులకు రి వెరిఫికేషన్ మరియు రికౌంటింగ్ అప్లై చేసిన తర్వాత వారి మార్కులు మారి పెరగడం జరిగింది Already అప్లై చేసిన విద్యార్థులకు మరలా తిరిగి అప్లై చేసే అవకాశం లేదు కావున అట్లాంటి విద్యార్థుల కోసం కన్వీనర్ IIIT వారికి అడ్రస్ చేస్తూ గతంలో అప్లై చేసిన అప్లికేషన్ నంబర్తో ఒక రిక్వెస్ట్ లెటర్ ను రాస్తూ మార్కులు పెరిగిన తర్వాత కొత్తగా వచ్చిన మార్కులు మెమోని ఈ రిక్వెస్ట్ లెటర్ తో పాటు అటాచ్ చేసి ఈ క్రింది తెలిపిన రెండు Mail id లకు Convener Admissions RGUKT-AP •   convener.admissions@rgukt.in Assistant Registrar, Academics - RGUKT Nuzvid •   ar.academics@rguktn.ac.in  మెయిల్ చేసినట్లయితే పెరిగిన మార్కులను పరిగణలోకి తీసుకొని IIIT అవకాశం వచ్చే విధంగా కన్వీనర్ గారు చర్యలు తీసుకుంటారు. కావున ఈ విషయాన్ని ప్రధానోపాధ్యాయ/ప్రధానాచార్య మిత్రులు గమనించవలసిందిగా కోరుతున్నాం. IIIT అప్లై చేసిన మీ 10th మార్క్స్ రీవెరిఫికేషన్/రీకౌంటింగ్ లో పెరిగితే...

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

నేటి మోటివేషన్... "ఖాళీ గానే ఉంటావు కదా"

ఈ మాటల్ని ఈ మధ్య పిల్లలు కూడా అమ్మను అనడం ప్రారంభించారు... "ఖాళీ గానే ఉన్నావు కదమ్మా నాకు అది చేసిపెట్టచ్చుగా" ఇలా అమ్మతో పిల్లలు అనడం సహజం అయిపోయింది... నాన్నగారి మాటలను విని పిల్లలుకుడా ఇలా తయారయ్యారు...ఖాళీగా ఉంటున్నాను అని వీళ్లంతా అనుకుంటున్నారు కదా! నేనెందుకు ఒకరోజు ఖాళీగా కూర్చోకూడదు అన్న ఆలోచనవచ్చింది నాకు...🤔 ఆలోచన రావడమే తరువాయి పిల్లలు, మావారు వెళ్ళాక ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చున్నాను... సాయంత్రం అయింది.పిల్లలు ఇంటికి వచ్చారు... వస్తూనే... ఇంటిముందు పిల్లలు వేసుకున్న షూ పాలిష్ మూత తెరిచివుంది.చెప్పుల స్టాండు చిందరవందరగా ఉంది.."అమ్మ కు ఏమైంది ఇవన్నీ ఎందుకు సర్దలేదు..అనుకుంటూ..."అమ్మా!ఎక్కడున్నావు? ఆకలవుతుందే ఏమైనా పెట్టు"  జవాబులేదు..."తొందరగా కాస్త పాలైనా ఇవ్వమ్మా! అన్నారు.జవాబులేదు...అమ్మ పలకడం లేదేంటి అని అమ్మను వెతకసాగారు...ఇంతలో భర్త వచ్చారు.. రాగానే "లక్ష్మీ!తల పగిలిపోతోంది వేడిగా కాఫీ ఇవ్వు"అన్నాడు...జవాబులేదు.. భార్య వంటింట్లో ఉందేమో అని వెళ్లి చూసాడు... లేదు...ఎక్కడ ఉన్న పాత్రలు అన్నీ అక్కడే వాసనకొడుతూ ఉన్నాయి..బెడ్రూం లో ఉంద...